Tuesday 28 April 2015

Tv9 నవీన - "నెట్ "మణులు

ఇటీవల Tv9  వారు తెలుగు మహిళా బ్లాగర్లతో జరిపిన చర్చా కార్యక్రమం...



ధీర-3 - అంతులేని కధ



“ధీర” అనగానే... ధీరురాలు, శూరురాలు, వీరపత్ని లేదా చత్రపతి శివాజీ తల్లి లాగ వీర మాతేమో, అలాంటి characterizations కే ఆ ధీర అనే మాట వాడాలేమో అనుకుంటాం. ఇప్పటిదాకా మన సినిమాల్లో చూపించేది అలాగే. కత్తిపట్టి యుద్ధం చెయ్యగలిగే కోవలో ఉన్నవాళ్ళు సరే. కత్తిపట్టకుండా తామే కత్తై బ్రతుకు సాగించేవాళ్ళని కూడా “ధీర” అనవచ్చు. ధీర అంటే ధైర్యవంతురాలు, విశ్వాన్ని ఒడిసి పట్టుకునే ఆత్మవిశ్వాసం గలది. రామాయణంలో సీత కత్తి పట్టి యుద్దం చెయ్యలేదు, బాణాలు వేసి శత్రువుని తుదముట్టించలేదు. కాని తనని అపహరించిన రావణుడిని తన ఆత్మవిశ్వాసంతో, మాటలతో భయపెట్టిన దైర్యవంతురాలు, రామాయణానికి గ్రంధనాయకి సీత.. అందుకే ఆమె ధీర. 


సామాన్యుల జీవితాలలో మరెన్నోకష్టాలు, నష్టాలు, ఆకలి, డబ్బు లేమి, బ్రతుకు భయం, అవసరాలు, వ్యసనాలు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో వుంటాయి. వీటి బారిన పడి ఎంత మంది స్త్రీ, పురుష జీవితాలు పెనుగాలి లో చిక్కి రాలిపోయిన పువ్వుల్లా రాలిపోతున్నాయో.. మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వెనక్కి తీసుకొచ్చుకోలేనంత !!!


ఇటువంటి కష్టాల మధ్య, ఒకపూటే తిన్నా కూడా మళ్ళీ అర్ధాకలే అనే నిరాశా నిస్పృహల మధ్య పెరిగిన జయమ్మ, కన్న తల్లి దూరమయి, కన్న తండ్రి మరో పెళ్ళి చేసుకుని అందులో కొట్టు మిట్టాడుతూ వుంటే తాను వంటరిదయి పోయిన జయమ్మ, తాతయ్య, నానమ్మ చేతిలో చాలీ చాలని జీవితాన్ని జీవించిన జయమ్మకు అక్షర జ్ఞానం లేదు. కానీ పుట్టుకతోనే విచక్షణ, అవగాహన తద్వారా విజ్ఞానం అన్నది కొంతమందికి వస్తుంది అనీ పెద్దలు చెప్తుంటారు, అది జయమ్మని చూస్తే నిజమే అనిపిస్తుంది. తన వారు లోనయిన ప్రలోభాలకు, చేసిన తప్పులకు (కారణాలేమైనా గానీ) కుటుంబం అనేది విచ్చిన్నమై తానెలా వంటరిదైపోయిందో అర్ధంచేసుకుంది. అటువంటి దుస్థితి తన జీవితానికి ఇకనైనా వుండకూడదనీ, తన బిడ్డలు తనలా అలమటించకూడదనీ ఆమె చేసిన.. ఇంకా చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఆమెని ఈ రోజు "ధీర" గా నిలబెట్టాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న ఈ జయమ్మ ఒక ధీర అని చెప్పడంలో సందేహమే లేదు.


ఈ ధీర మాలిక పత్రిక మే నెల సంచికలో ...




ప్రింట్ పుస్తకాలు కొనలేనివారు, పుస్తకాలు వెంటబెట్టుకుని చదవలేనివారు, అస్తమానం కంఫ్యూటర్ ముందు కూర్చుని చదువుకోలేనివారికి ఒక శుభవార్త...

ఇప్పుడు నా తెలంగాణ ఇంటివంటలు వెజ్, నాన్ వెజ్ పుస్తకాలు, ప్రమదాక్షరి కథామాలిక, మాలిక మాసపత్రిక NewsHunt అనే ఆప్ ద్వారా మొబైల్ లో కూడా చదువుకోవచ్చు...


మాలిక పత్రిక ప్రతీనెల కొత్త సంచిక అందుబాటులో ఉంటుంది..

ఇంకెందుకు ఆలస్యం మరి :... NewsHunt మొబైల్ ఆప్ వేసుకుని పైన చెప్పిన  పుస్తకాలు, ప్రతీనెల మాలిక పత్రికను మీ ఫోన్ లోనే చదువుకోండి..

సృజనాత్మకమైన చిత్రకళ




సృజనకు స్ఫూర్తి... అంతుబట్టని అపురూప చిత్రం ఈ ప్రకృతి!

ప్రకృతిలోని అందాలు చూసే కొద్దీ మురిపించి మైమరపిస్తాయి!!

కొండలు, కోనలు... గట్టులు, గుట్టలు... చెంగున దుమికే లేళ్ళు, సెలయేళ్ళు... పచ్చని వర్ణంతో పరిసరాలను చైతన్య పరచే చెట్లు, చేమలు... కలకూజితాలతో గాలికి రంగులద్దే పిట్టలు... ఉభయ సంధ్యల్లో రాగరంజితమయ్యే సువిశాల ఆకాశం... ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడే తెలినురగల కెరటం...

వీటిని చూసి గంతులు వేయని హృదయముంటుందా? ఏ భావుకత లేని అతిసాధారణ హృదయమే ఈ అందాల్ని చూసి పులకిస్తుంది. ఇక కళాకారుల హృదయాల సంగతి వేరే చెప్పాలా!

ప్రకృతి అందాలకు ముగ్థుడై, ఆ శోభ మనసులో కల్పించిన అనుభూతిని తోటివారికి పంచిపెట్టేందుకు, ఆ ప్రకృతినే అనుకరిస్తూ దానికి ప్రతికృతిని తయారుచేస్తాడు, చిత్రకారుడు. కాగితమో, కాన్వాసో, మరేదైనా తలంపును కుంచెల సాయంతో అనుకున్న రంగులను అనుకున్న విధంగా వివిధమైన ఛాయలతో, ఛాయాప్రభేదాలతో... తన మనసులోని సంవేదనలను వర్ణాంచితం చేస్తాడు. 


అయితే, కుంచెల అవసరం లేకుండా చిత్రించేందుకు, వారి చిత్రణ విధానానికో నవ్యతను కూర్చుకునేందుకు ఎన్నెన్నో ప్రయోగాలు చేసే అపురూపమైన చిత్రకారులు కొందరుంటుంటారు. వారిలో ప్రఖ్యాత అమెరికా నైరూప్య అభివ్యక్తి చిత్రకారుడు జాన్సన్‌ పొల్లాక్‌... మరో అమెరికా విద్యావేత్త చిత్రకళావిద్యలో చేతివేళ్ళ చిత్రీకరణని ఒక మాధ్యమంగా ప్రవేశపెట్టిన రూథ్‌ పయ్‌జన్‌ షా, ఆమెకు అనుయాయులుగా జాన్‌ థామస్‌ పైన్‌, కారీలు... టెయిలర్‌ రమ్సే, నిక్‌ బెంజామిన్‌, జిమ్మీ లీ సుదాత్‌ మొదలైనవారు ఉన్నారు.

నిజానికి, చిత్రకారులందరూ చిత్రాలను గీస్తూ చేతివేళ్ళను ఏదో ఒక సందర్భంలో ఉపయోగిస్తారు. కుంచెను పట్టుకుందుకు చేతి వేళ్ళే ఆధారమౌతాయి. కానీ... వేళ్ళతో కుంచెను పట్టకుండా, ఆ వేళ్ళనే కుంచెగా ఉపయోగించి గొప్ప చిత్రాలను సృజించగల వినూత్న చిత్రకారులు కొందరే. ఈ ‘వేళ్ళకుంచెల’ చిత్రకారులు వేళ్ళమీద లెక్కించ గలిగినంతమంది మాత్రమే మనకు తారసపడతారు. అలాంటి కొద్ది మంది చిత్రకారుల్లో వేలెత్తి సగర్వంగా చూపించగలిగే సత్తా ఉన్న మన తెలుగు చిత్రకారుడూ ఒకరున్నారు.


తన చేతివేళ్లనే కుంచెగా ఎన్నోచిత్రాలను ఆవిష్కరించిన ఒక చిత్రకారుడి గురించి మాలిక మే నెల సంచికలో తెలుసుకుందాంః..

ఎంత చేసినా ఇంతే...




 pic courtesy: Raju Epuri Cartoonist


ఈ అభిప్రాయం నాది మాత్రమే కాదండోయ్. చాలా చాలామంది ఆడవాళ్లు ఇలాగే విసుక్కుంటారు. మగవాళ్ల అదృష్టం బాలేకుంటే తప్ప అందరు ఆడవాళ్లు వంట బాగా చేస్తారు. మరి కొందరు మరింత ఇష్టంతో ఇంకా బాగా చేస్తారు. కాని....

ఇంట్లో ఏళ్ల తరబడి అయ్యో మొగుడు, పిల్లలూ అని పూట పూటకు రుచిగా వంట చేస్తారా? పప్పు, చారు, కూరలు, పచ్చళ్లు, పిండివంటలు అంటూ చేస్తారా? పుష్కరానికోసారి తప్ప వంట బాగుంది అని నోటినుంచి ఒక్క మాట రాదు. కాస్త ఉప్పు తక్కువైతే మాత్రం ఇంటి కప్పెగిరిపోయేలా అరుస్తారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అయితే నీకసలు వంట రాదు. మీ అమ్మా నేర్పించలేదు. నీవు నేర్చుకోలేదు. ఏదో ఇంత వండి మా మొహాన పడేస్తున్నావు, గతిలేక తింటున్నాం అంటూ డైలాగులు.. 

ఇలాంటప్పుడు ఇంట్లో చేసేకన్నా కాస్త పత్రికల్లో, టీవీలో ట్రై చేస్తే మన వంటలు, మన ఫోటోలు పడతాయి. కాస్త సొమ్ములు ఇస్తారు. పేరూ వస్తుంది.

ఏమంటారు???

మా ఇంట్లో జరిగిన సంఘటన చెప్పనా??

ఒకరోజు ఆదివారం రాత్రి నా సిస్టమ్ లో నా వర్క్ చేసుకుంటున్నా. మావారు ఆరోజు పేపర్లన్నీ చూస్తున్నారు. పేపర్ చదువుతూ వంటల పేజి చూసి ఈ క్యాబేజీ పకోడీ చూడు బావున్నట్టుంది చూసి చేయి. నీకేమీ రాదు చేయమంటే పాలకూర లేక ఉల్లి పకోడీ చేస్తావ్ అన్నారు. నేను ఏంటా అని వెళ్లి చూస్తే అది నేను ఆంధ్రభూమి పేపర్లో రాస్తున్న రుచి కాలమ్. ఆ పేజినిండా నేను చేసిన వంటలే.. అఫ్పుడు ఆ పేపర్ చివరన నా పేరు చూపించా... హి..హి..హి.. అని నవ్వేసి ఎప్పుడు చేసావ్ అన్నారు. నాలుగు రోజుల క్రింద ఈ పకోడీలు చేసి అన్నం తినేటప్పుడు నంజుకోవడానికి పెడితే టీవీ చూస్తూ తినేసారు ఎలా ఉన్నాయని చెప్పలేదు. ఇప్పుడు ఇవి చూసి నేను నేర్చుకోవాలా అన్నా...

సైలెంట్....

అదన్నమాట సంగతి....

Wednesday 1 April 2015

మాలిక పత్రిక ఏఫ్రిల్ 2015 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head 

పాఠకుల ఆదరాభిమానాలతో మరిన్ని ఆకర్షణీయమైన, పఠనీయమైన వేర్వేరు అంశాల మీద రాయబడిన రచనలను మీకోసం అందిస్తోంది మాలిక పత్రిక. ఈ నెలనుండి మాలిక పత్రికలో నాలుగు విభిన్నమైన సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి.  మరిన్ని కొత్త ప్రయోగాలకు మాలిక పత్రిక ఎప్పుడు ఆహ్వానిస్తుంది. మీరు రాయాలనుకుంటున్నారా? రాయండి.  ఈ చిరునామాకు పంపండి. editor@maalika.org

ఈ నెల విశేషాలు:

00.  మండా సుధారాణి  
01. ధీర 2
02. అంతా రామమయం
03. శోధన 1
04. అంతిమం 1
05. చిగురాకు రెపరెపలు 2
06.  మాయానగరం 13
07. Dead People Don't Speak
08. వెటకారియా రొంబ కామెడియా 8
09. పదచంద్రిక
10. మహిళా శాస్త్రవేత్త అన్నామణి
11. చేరేదెటకో తెలిసి 1
12. ఆరాధ్య 7
13. Rj వంశీతో అనగా అనగా 3
14. పుకార్ల పురాణం
15. నా మాట
16. పచ్చనాకు కళ
17. అంకితమిస్తున్నా నీకై
18.  హృదికవాటం
19. సూర్యుని నీడ
20. ఎక్కడినుండి ఎక్కడిదాకా?
21. అక్షర సాక్ష్యం 2
22. సెల్ఫీ.. సెల్ఫీ..
23. మాతా వైష్ణవీదేవి

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008