Thursday 22 December 2016

A Proud Day to Celebrate.. Happy Birthday


మనిషి పుట్టుకకు ఒక గుర్తింపు, ఒక సార్ధకత ఉండాలంటారు. మనం పోయాక కూడా పదిమంది తలుచుకునేలా మంచిని పంచుతూ, పెంచుతూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

పదేళ్ల క్రితం నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపులేకుండా టైమ్ పాస్ కోసం జాలంలోకి అడుగుపెట్టి, బ్లాగు మొదలెట్టి మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, గైడెన్స్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ బ్లాగరుగా, ఫుడ్ కాలమ్నిస్టుగా, రైటర్ గా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, పత్రిక సంపాదకురాలిగా, పబ్లిషర్ గా ఒక్కో విషయం నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది.. ఇక చాలు అని అనుకోలేను. గత మూడు సంవత్సరాలుగా నా  పుట్టినరోజును నా కిష్టమైన పుస్తకాలు, అందునా తెలుగు పుస్తకాలు, రచయిత్రుల సమక్షంలో బుక్ ఫెయిర్ స్టాలులో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నాను. పుస్తకాల మధ్య గడపడం కంటే  ఘనంగా జరిగే ఉత్సవాలు ఉంటాయా? అందుకే నాకు నేను సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటున్నా....

హ్యాపీ బర్త్ డే జ్యోతివలబోజు.. 

Many Happy Returns of the Day

Wednesday 14 December 2016

పురాణిక్ తంబోలా - Puranik Tambola


























మీరు ఆటలు ఆడతారా? అంత టైమెక్కడిది? అయినా ఈ వయసులో ఆటలేంటి అంటారా?
ఎప్పుడైనా గ్రూప్ మీటింగులలోకాని. ఏధైనా కుటుంబ, స్నేహ సమావేశాలలో కాని సరదాగా ఆడుకునే తంబోలా ఆట మీకు తెలుసు కదా. చిన్న టికెట్ మీద నంబర్లు ఉంటాయి. నంబర్లు చెప్తుంటే వాటిని కట్ చేయాలి. లైన్ల ప్రకారం ఎవరిది పూర్తైతే వాళ్లు గెలిచినట్టు , డబ్బులొస్తాయి. టాప్ లైన్, మిడిల్ లైన్, బాటమ్ లైన్,ఫుల్ హౌజ్ ఇలా....
ఎప్పుడూ అంకెలేనా. ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా, ఇష్టంగా, విజ్ఞానదాయకంగా ఉండే తంబోలా ఆట ఉంటే ఎలా ఉంటుంది.
ఇది మరీ బావుంది. ఇలాటి ఆటలు అసలు ఉంటాయా.. ఉంటే మంచిదేగా. మాకోసం, మా పిల్లలకోసం, పిల్లల పిల్లలకోసం కొనచ్చు, బహుమతిగా కూడా ఇవ్వడానికి బావుంటుంధి.
ఇంతకీ ఈ ప్రత్యేకమైన తంబోలా ధర ఎంత? కొనగలిగేట్టుగానే ఉందా??

తప్పకుండా ఉంది..

ఇది పురాణాలలోని పాత్రల పేర్ల గురించి తెలుసుకుంటూ ఆడుకునే విధంగా ప్రత్యేకంగా తయారుచేయబడ్డ తంబోలా..

ఈ తంబోలా మీకు హైదరాబాదు బుక్ ఫెయిర్ లోని జె.వి.పబ్లికేషన్స్ స్టాల్ 30,31 లో లభిస్తుంది. అదికూడా తక్కువ ధరలోనే.. అసలు ధర రూ.450 అయితే నా స్టాలులో మాత్రం రూ.300 మాత్రమే..

రేపటినుండి మీకు అందుబాటులో ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మనవళ్లకు పురాణాలగురించి చెప్పడానికి చాలా సులువుగా ఉండే ఆట ఇది. బహుమతిగా కూడా ఇవ్వొచ్చు..

Tuesday 13 December 2016

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో జె.వి.పబ్లికేషన్స్











డిసెంబర్ 15 నుండి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే 30వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో జె.వి.పబ్లికేషన్స్ స్టాల్ నంబర్ 30, 31 లో నెలవై ఉంటుంది. మీరు మెచ్చిన మీకు నచ్చిన రచయితల పుస్తకాలెన్నో ఈ స్టాలులో లభిస్తాయి.
ప్రస్తుతం ఉన్న మనీ ప్రాబ్లమ్ కి కూడా సులువైన ఉపాయాలను సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటిలాగే. మీకు ఇష్టమున్న పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.
ఈ పుస్తక ప్రదర్శన ప్రతీరోజు మద్యాహ్నం రెండు గంటలనుండి రాత్రి 8.30 వరకు. శని, ఆదివారాలు, హాలిడేస్ లలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 8.30 వరకు

Saturday 10 December 2016

Books from J.V.Publications



Feeling Proud to announce that I have brought out 67 books from J.V.Publications from 2014 Jan to 2016 Dec... All the books were well appreciated and praised for its quality and beautiful cover designs. I am very happy to have a good team of dtp operator, graphic designer and printers who understand and work as per my requirements and time maintenance..

2014 జనవరిలో ప్రారంభించిన ఈ పుస్తక ప్రచురణలో మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ, నేర్చుకుంటూ, మెరుగు పరుచుకుంటూ వీలైనన్ని తక్కువ తప్పులతో, అందంగా, మంచి క్వాలిటీతో ఇంతవరకు 67 పుస్తకాలను ప్రచురించిడం జరిగింది. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఈ రంగంలోకి ప్రవేశిస్తాను అని. కాని చేపట్టిన పని మాత్రం పర్ఫెక్టుగా చేస్తాను. అంతేకాక నా మీద అభిమానంతో కాక నమ్మకంతో తమ పుస్తకాల పని అప్పగించిన రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగని తప్పులు జరగలేదని కాదు. జరిగాయి. వాటివల్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నాను.

ఇంతవరకు ప్రచురించిన 67 పుస్తకాల లిస్టు ఇది. హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో దాదాపు చాలా పుస్తకాలు ఉంటాయి. రాలేనివారు కోరిన పుస్తకాలను వారి ఇంటికి కూడా పంపడం జరుగుతుంది.

Books from J.V.Publications
jyothivalaboju@gmail.com,


1. తెలంగాణ ఇంటివంటలు – వెజ్ - జ్యోతి వలబోజు .
2. తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్ – జ్యోతి వలబోజు .
3. ఆకుపాట – శ్రీనివాస్ వాసుదేవ్ -
4. ఏ కథలో ఏమున్నదో – సి.ఉమాదేవి
5. సాగర కెరటం - సి.ఉమాదేవి
6. కేర్ టేకర్ - సి.ఉమాదేవి
7. మాటే మంత్రము - సి.ఉమాదేవి
8. మంచిమాట – మంచి బాట - సి.ఉమాదేవి
9. అమ్మంటే - సి.ఉమాదేవి
10. Avni’s Cookbook - Avni
11. అమూల్యం - నండూరి సుందరీ నాగమణి
12. నువ్వు కడలివైతే – నండూరి సుందరీ నాగమణి
13. నాకు తెలుగు చేసింది – సత్యసాయి కొవ్వలి
14. జీవనవాహిని - మంథా భానుమతి
15. అగ్గిపెట్టెలో ఆరుగజాలు – మంథా భానుమతి
16. హాస్యామృతం - ఆర్.వి. ప్రభు
17. Snapshots – కె.బి.లక్ష్మీ
18. ఎగిరే పావురమా – కోసూరి ఉమాభారతి
19. వేదిక - కోసూరి ఉమాభారతి
20. ధర్మప్రభ - కొంపెల్ల రామకృష్ణ
21. తెలుగు కథ - శోభా పేరిందేవి
22. వృద్దాప్యం వరమా? శాపమా? – శోభా పేరిందేవి
23. కలికి కథలు – వెంపటి హేమ
24. అర్చన – అత్తలూరి విజయ
25. ఆవిరి – స్వాతికుమారి
26. ప్రమదాక్షరి కథామాలిక – 1
27. ప్రమదాక్షరి కథామాలిక – 2
28. ఒక పరి జననం – ఒక పరి మరణం - రామా చంద్రమౌళి
29. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు - రామా చంద్రమౌళి
30. స్ఫూర్తిప్రదాతలు – రామా చంద్రమౌళి
31. అంతిమం – రామా చంద్రమౌళి
32. ఏకాంత సమూహంలో – రామా చంద్రమౌళి
33. తమిరిశ జానకి మినీ కథలు – తమిరిశ జానకి
34. The Silent Stream – Tamirisa Janaki
35. ఊర్వశి – వారణాసి నాగలక్ష్మి
36. కదంబం – శ్రీనివాస భరద్వాజ్ కిషోర్
37. ఫేస్ బుక్ కార్టూన్స్ – రాజు, లేపాక్షి
38. చిగురాకు రెపరెపలు – మన్నెం శారద
39. మహారాజశ్రీ మామ్మగారు- మన్నెం శారద
40. మన్నెం శారద కథలు
41. అమృతవాహిని – సుజల గంటి
42. ప్రియే చారుశీలే – సుజల గంటి
43. మనసా ఎటులోర్తునో – సుజల గంటి
44. పునీతులు – సుజల గంటి
45. సప్తపది – సుజల గంటి
46. Into the Crowded Aloneness – Rama chandramouli
47. Nomadic Nights – Indira Babbellapati
48. అసమాన అనసూయ – వింజమూరి అనసూయాదేవి
49. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – శ్యామలాదేవి దశిక
50. “ అమెరి“కలకలం – వంగూరి చిట్టెన్ రాజు
51. కవిత్వంలో నేను – విన్నకోట రవిశంకర్
52. చెప్పుకుంటే కథలెన్నో – సి.హెచ్. కామేశ్వరి
53. Photo Frame
54. శ్రీచక్ర సంచారిణి – పోలంరాజు శారద
55. స్వర్ణకుటీరం - పోలంరాజు శారద
56. బంగారు కంచం – పోలంరాజు శారద
57. రెప్పపాటు ప్రయాణం – పోలంరాజు శారద
58. సంధ్యారాగం – పోలంరాజు శారద
59. సుందరకాండ – నాగజ్యోతి సుసర్ల
60. మహాభారతం – శ్రీనివాసరావు తాతా
61. ఎమ్మెస్వీ కథలు – ఎమ్మెస్వీ గంగరాజు
62. అనుబంధాల టెక్నాలజీ – లక్ష్మీ రాఘవ
63. స్వప్నసాకారం – వాలి హిరణ్మయిదేవి
64. మెదక్ ఆలయాలు – పి.ఎస్.ఎమ్.లక్ష్మీ
65. చిట్టి చిట్టి మిరియాలు – ఇంద్రాణి పాలపర్తి
66. ఇంటికి వచ్చిన వర్షం – ఇంద్రాణి పాలపర్తి
67. ఱ – ఇంద్రాణి పాలపర్తి

మాలిక పత్రిక డిసెంబర్ 2016 సంచిక విడుదల

Jyothivalaboju
Chief Editor and Content Head


ప్రియమైన పాఠకులకు, రచయితలకందరికీ నమస్కారాలు, రాబోయే కొత్త సంవత్సరానికి అభినందనలు.. డిసెంబర్ అనగానే మాకు, మీకు, అందరికీ ఇష్టమైన పుస్తకాల పండగ మన హైదరాబాదుకు రాబోతుందని తెలుసుగా. మరి మీ  పుస్తకాల లిస్టు, డబ్బులతో తయారుగా ఉన్నారా..
అనివార్య కారణాలవల్ల కాస్త ఆలస్యంగా వెలుగు చూస్తున్న మాలిక పత్రికలో ఈసారి ప్రమదాక్షరి కథామాలిక శీర్షికన స్నేహం పేరిట వచ్చిన కథలను  ప్రచురించడం జరుగుతోంది. ఇంకా మీ ప్రియమైన కథలు, కవితలు, సీరియళ్లు, పద్యాలు కూడా కొలువై ఉన్నాయి. మరి ఈ మాసపు విశేషాలు చూద్దామా..

  1. యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే
  2. మూడంతస్ధులు
  3. స్నేహబంధం
  4. గుండెకీ గుబులెందుకో
  5. బెస్ట్ ఫ్రెండ్
  6. ఎగిసే కెరటాలు 8
  7. బ్రహ్మలిఖితం 3
  8. శుభోదయం 10
  9. మాయానగరం 32
 10. సమన్విత
 11. పెళ్లిచూపులు
 12. కుక్కతోక వంకర
 13. వామ్మో! పుట్టినరోజు
 14. ఆంధ్ర శాకంబరీ మాత
 15. నాచన సోమనాధుడు
 16. అశ్వమేధము
 17. పూర్వీ
 18. కోరుకొండ నుండి పాపికొండలు వరకు
 19. నాన్న
 20. సహజీవనం
 21. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 11
 22. కలం
 23. బాలమురళి స్వర్గప్రస్థానం
 24. ఇంద్రియాలు - అంతరేంద్రియం
 25. నిజాలు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008