tag:blogger.com,1999:blog-7016156651579282002.post5936904749058052477..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: ఎవండోయ్ శ్రీవారూ...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-14553460053494974592008-05-20T20:18:00.000+05:302008-05-20T20:18:00.000+05:30భై.కా గారూనేను చెప్పింది ఒకావిడ నైజం. నేను రాసిన క...భై.కా గారూ
నేను చెప్పింది ఒకావిడ నైజం. నేను రాసిన కామెంట్లో తీవ్రవాదం మీకు ఎక్కడ కనిపించిందో కాస్త శెలవిస్తారా? తీవ్రవాదం? చాలా విచిత్రంగా ఉందే? థేంక్సు.
బండి సున్నాSDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-34964587540879955192008-05-19T00:57:00.000+05:302008-05-19T00:57:00.000+05:30This article seems to be written by some cheap edi...This article seems to be written by some cheap editor at Times. If everything costs something, nobody would live in this world. In that case wife can also asks some money for sex. Infact even husband can demand some money for the sex. I like the first comment by RSG. By all means why you are calling "Sreevaru" I dont understand. Your husband either is not so good guy or killing all of your ambitions with out giving proper recognition. You better do not generalize it on a gender.Chandra Ahttps://www.blogger.com/profile/00059850234908636060noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-57606480848285254232008-05-19T00:53:00.000+05:302008-05-19T00:53:00.000+05:30ccChandra Ahttps://www.blogger.com/profile/00059850234908636060noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89314530516309987622008-05-18T22:58:00.001+05:302008-05-18T22:58:00.001+05:30జ్యోతిగారు నా కామెంటులోని ఆఖరు వాక్యం మీగురించి క...జ్యోతిగారు నా కామెంటులోని ఆఖరు వాక్యం మీగురించి కాదండోయ్. టైమ్స్ వాడిపైన.
మంచి డిస్కషను పెట్టారు మీరు. థాంక్స్
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-63106510974839216422008-05-18T22:58:00.000+05:302008-05-18T22:58:00.000+05:30This comment has been removed by the author.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38631796866885323392008-05-18T22:39:00.000+05:302008-05-18T22:39:00.000+05:30ఈ టాపిక్ చాలా హాట్ గురూ అంటూ లోపల అంతరాత్మ చెపుతున...ఈ టాపిక్ చాలా హాట్ గురూ అంటూ లోపల అంతరాత్మ చెపుతున్నా, నేనూ వేలు పెట్టేస్తున్నా........

ఏవైన పనులు ఉద్యోగ ధర్మంగానో, లెక జీవికకోసమో చేసింప్పుడు, ఆయా పనులను బట్టి, వెచ్చించిన సమయాన్ని బట్టి ఆపని విలువను డబ్బురూపంలో తూచటం జరుగుతుంది.
కానీ ఇద్దరు వ్యక్తుల మద్య ముఖ్యంగా కుటుంబసబ్యులమద్య (మరీ ముఖ్యంగా భార్యా భర్తల మద్య) ఒకరికొకరు చేసె పనులకు విలువకట్టటం ధర్మమా?

ఇక్కడ చేసే పనులు ఐచ్చికంగా చేయబడతాయి (చాలా సందర్భాలలో, ముఖ్యంగా మద్యతరగతి కుటుంబాలలో) లాభనష్టాలు బేరీజువేసుకొని కాపురం చేస్తారా? (అలా ప్రవర్తించే కుటుంబాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం గురించే నేను మాట్లాడుతున్నాను, ఫ్రీక్స్ గురించి రెలిక్స్ గురించీ కాదు)

ఈ ఐచ్చికతా కోణంలో బహుసా స్త్రీ ఎక్కువగా ఇవ్వవలసి రావటం కొంతమందికి అన్యాయమనిపించవచ్చు. కానీ పురుషుడు పాత్ర లేనే లేదని భావించటం మరీ, మరీ అన్యాయం.

చాలా కుటుంబ సభ్యుల మద్య జరిగే చాలా చాలా విషయాలకు వెలకట్టలేము.
చిన్న ఉదాహరణ: నేను 3 సంవత్సరాల వయసులో ఉండగా తీవ్రమైన సుస్తీ చేస్తే, మా అమ్మ నన్ను భుజాన వేసుకొని అర్ధరాత్రి, 2 కి.మీ దూరంలో ఉన్న హాస్పటలు కు రొప్పుకుంటూ, రొప్పుకుంటూ పరిగెట్టుకొని తీసుకువెళ్లటానికి ఎవరూ ఖరీదు కట్టలేరు. (ఈ విషయం ఆ దృశ్యాన్ని చూచిన వ్యక్తి చెప్పితే, అవునా అని అమ్మను అడిగినపుడు నిజమే అప్పుడు నాకేం చెయ్యాలో తోచలేదు అని అమాయకంగా అన్నప్పుడు నేనేం చెప్పగలిగాను ) ఇటువంటి సంఘటనలో లేక ఇంతకంటే బలమైనవో ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉండవా? వాటిని తూచే తూనికరాళ్ళు మనవద్ద ఉన్నవా అని ప్రశ్నించుకోవాలి?

ఆత్మీయులకు నలతగా ఉన్నప్పుడు గుండెల్లో ఎంప్టీనెస్ ను తూచగలరా ఎవరైనా?
అన్నాలు తింటున్నప్పుడు ఈ ముక్క తిను బాగుంటుంది అని మనకంచంలోని మంచి ముక్కలను ఎదుటివారికివ్వటాన్ని ఎంత రేటుకు రేట్ చేస్తారు.
తల్లితండ్రులకు దగ్గరగా ఉండాలని మంచి దూరపు ఉద్యోగాలను ఒదులుకొని చిన్న ఉద్యోగాలు చేసే వారు లేరంటారా?

ఇట్లాంటి చాలా చాలా విషయాలను తూకం వేసే రాళ్లు మనదగ్గర లేవు. కుటుంబ సంభంధాలు అనేవి చాలా వరకు లాభనష్టాలకు అతీతంగానే సాగుతాయి. ఎదో సినిమా డైలాగు అనుకోకపోతే భార్యాభర్తల మద్య సంబంధం గురించి a wife and husband should be like water and fish and not like fish and fisherman.

ఇక్కడ నీరు పెద్దది చేపచిన్నది అని రంద్రాన్వేషణ చేయటం తగదేమో. నీరు లేకపోతే చేపలేదు, అదేవిధంగా చేపలేకపోతే నీటిలో జీవం లేనట్టే అని అర్ధాన్ని తీసుకోవచ్చు.

ఇలాంటి విషయాలకు (పనులే కావచ్చు కానీ నాదృష్టిలో అవి చాలామట్టుకు ఐచ్చికంగా చేసేవి) రేటింగ్ ఇవ్వటాన్ని మానవసంభందాలమీద వేసే ఒక ప్రాక్టికల్ జోక్ గా నేను తీసుకుంటున్నాను.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-92231121269265185192008-05-17T12:49:00.000+05:302008-05-17T12:49:00.000+05:30నాకు ఈ కామెంట్స్ అన్నీ చదువుతున్నప్పుడు ఒక కధ గుర్...నాకు ఈ కామెంట్స్ అన్నీ చదువుతున్నప్పుడు ఒక కధ గుర్తుకు వస్తోంది.. దాంట్లో కూడా ఆ ఇల్లాలు ఇంట్లో అందరికీ అన్నీ చాల మంచిగా అమర్చిపెడుతూ ఉండేది. బాగా చదువుకున్నా కూడా ఇంట్లో అందరినీ చూసుకోవడం కష్టమవుతుందని ఉద్యోగం చేసేది కాదు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ తోడికోడలు ఉద్యోగం చేస్తుంది. ఈమెని అందరూ బాగా చూసుకుంటారు. ఇంట్లో కూడా ఈవిడ మాటే చెల్లుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ హడావిడితో సరిపోయేది, తరువాత వాళ్ళు స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుండి, ఇంట్లో అంత తోచేది కాదు. అదీ కాక ఆవిడకి ఏమైనా కావలంటే, భర్తనో, మామగారినో, మరిదిగారినో, తొడికోడలినో అడుగుతూ ఉండాల్సి వచ్చేది. దీనితో, ఆవిడలో ఉద్యోగం చేయాలన్న కోరిక పెరిగిపొతుంది. చివరికి ఉద్యోగం లో చేరడానికి నిశ్చయించుకుంటుంది.

ఇంట్లో ఒప్పుకోరు. నాకు ఆర్ధిక స్వాతంత్ర్యం కావాలి అంటే భర్త మనిద్దరికీ కలిపి జాయింట్ ఎక్కౌంట్ ఉంది కదా, నీకు కావల్సినంత తీసుకో అంటాడు. కానీ అది ఆవిడకి నచ్చదు. ఎలాగైతేనేమి ఉద్యోగంలో చేరుతుంది. డబ్బులు ఐతే వస్తున్నాయి కానీ, ఇంట్లో పనులు, అక్కడ పనులు చేయలేక ఆరోగ్యం దెబ్బ తింటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి ఆలోచిస్తారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని. చివరికి తన పేరు మీద ఒక అక్కౌంట్ ప్రారంభించి, దాంట్లో ప్రతి నెలా అందరూ కొంత మొత్తం వేయాలని నిశ్చయించుకుంటారు. అలాగని ఆమె ఆ డబ్బుని విచ్చలవిడిగా ఏమీ ఖర్చ్చు పెట్టేది కాదు. కానీ ఆమె ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలిగింది. ఆ కధలో తోడికోడలు అంటుంది, అక్కా నేను ఆడదాన్నయి ఉండి, ఉద్యోగం చేస్తూ ఉండి కూడా, నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను అని! కధ కాబట్టి, సుఖాంతం అవుతుంది. కానీ నిజ జీవితంలో మాటేంటి..?

అలా అని ఇది ఎవరూ కావాలని చేస్తారు అని అనను, కాకపోతే తెలియకుండానే, అవతలి వాళ్ళని బాధపెట్టడం జరుగుతోందిమేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-81973496330925623732008-05-17T12:23:00.000+05:302008-05-17T12:23:00.000+05:30బండిగారూ,మీరు కొంచెం తీవ్రవాదిలా ఉన్నారే:-)లోపాలనే...బండిగారూ,
మీరు కొంచెం తీవ్రవాదిలా ఉన్నారే:-)
లోపాలనేవి ఆడవాళ్ళలోనైనా మొగవాళ్ళలోనైనా ఉంటాయి. తాగుబోతు భర్తలలానే గయ్యాళిభార్యలూ ఉంటారు. అయితే సాంఘికంగా(మొత్తం సమాజం గురించి) ఆలోచించాలంటే, మనకి తెలుసున్న ఉదాహరణలు మాత్రం తీసుకుంటే సరిపోవు. గణాంకాలూ, సాంఘిక కట్టుబాట్లూ వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆలా చేస్తే, ఆడవాళ్ళు సమాజంలో మగవాళ్ళ అణచివేతకి గురయ్యారన్న వాస్తవం బోధపడుతుంది. ఇప్పుడా పరిస్థితి చాలామారింది కానీ ఇంకా పూర్తిగా ఆ మార్పు జరగలేదు. ఉదాహరణకి, పెళ్ళవ్వగానే ఆడది భర్తకుటుంబలోని వ్యక్తిగా మాత్రమే గుర్తింపబడాలి అన్న ఆలోచన ఇంకా అధికశాతం చదువుకున్నవాళ్ళలో కూడా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రులని, కొడుకు తెచ్చి ఇంట్లోపెట్టుకుని చూసుకున్నంతగా కూతురు తెచ్చి ఇంట్లోపెట్టుకు చూసుకోడం అంత సులభం కాదు.
ఇలా ఆలోచిస్తే ఇంకా చాలా అసమానతలే ఉన్నాయి...
నేను చెప్పదలచుకున్న విషయం ఒకటే. వీటిని ఆర్థిక దృష్టితో చూడడం తప్పని.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54106787219071436422008-05-17T02:32:00.000+05:302008-05-17T02:32:00.000+05:30భైకా గారూజాయింట్ అక్కౌంట్ సంగతి బానే ఉంది గానీ, అం...భైకా గారూ
జాయింట్ అక్కౌంట్ సంగతి బానే ఉంది గానీ, అందులోంచి తొంభై శాతం నాకు, మావాళ్ళకీ మాత్రమే ఇవ్వాలి లేకపోతే నీకు నిప్పూ లేదు నీరు లేదు అంటే మాత్రం కష్టం. అసలు దాంపత్యం లో దెబ్బలాటలు రావడానికి ఇదే నెంబర్ వన్ కారణం.

నాకో తెల్సినావిడ ఉండేది (ఇప్పుడు లేరు లెండి. చాలా దగ్గిర బంధువే) ఆవిడకి పెళ్ళవలేదు. ఆవిడ ముఖ్య సిద్ధాంతం ఇది - మగాళ్ళంతా వెధవలు. కానీ డబ్బులు కావలిస్తే మాత్రం ఆవిడ ఏమాత్రం సిగ్గు లేకుండా ఆవిడ నాన్నగారి దగ్గిరా, తమ్ముళ్ళ దగ్గిరా నిరభ్యంతరంగా తీసుకునేది. అప్పుడు మాత్రం మగాళ్ళందరూ వెధవలని గుర్తు ఉండేది కాదు కాబోలు.SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66679956420389022842008-05-17T00:37:00.000+05:302008-05-17T00:37:00.000+05:30మీరిచ్చిన లిస్టులో చాలా పనులు మా ఆవిడ చెయ్యదండీ!(మ...మీరిచ్చిన లిస్టులో చాలా పనులు మా ఆవిడ చెయ్యదండీ!(మా ఆవిడతో ఈ మాట చెప్పేరుకనక, నేనేదో మాటవరసకి అంటున్నాను:-) మరి అలాటప్పుడు, తను కావాలని అడిగితే అంత డబ్బులివ్వాల్సిన అవసరం లేదంటారా?
నా ఉద్దేశంలో భార్యగా, తను ఏ పనులుచేసినా చెయ్యకపోయినా, భర్తసంపాదనలో సమానమైన హక్కు ఉందని నా ఉద్దేశం. అసలిక్కడ హక్కుల ప్రసక్తే రాదు, భర్త సంపాదనైనా భార్య సంపాదనైనా వాళ్ళిద్దరిదీ అన్న భావన వస్తే. అలా రాకపోతే అది దాంపత్యమే కాదు!

నాకూ మా ఆవిడకీ joint-account ఉంది. అయినా తను అందులోంచి తానుగా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఇంటిఖర్చులకి (నావైనా, తనవైనా, ఇద్దరివీ అయినా) కొంత డబ్బు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది తనకి అందుబాటులో. ఒకవేళ అవసరమైనా, తను నన్ను డబ్బడగడం "అడుక్కోడం"కింద ఎప్పుడూ భావించినట్టు నాకయితే తెలీదు. (అన్నట్టు ఇవన్నీ మాటవరసకి కాదు నిజంగానేనండోయ్!)

ఉద్యోగం చేస్తూ కూడా ఆర్థికస్వాతంత్ర్యం లేని భార్యలను కూడా నేనెరుగుదును.

కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళకి వాళ్ళుచేసే పనిబట్టి జీతం ఇస్తేనో, లేదా ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటేనో - అసలు సమస్య తీరిపోతుందని నేననుకోను. నిజమైన దాంపత్యమంటే ఏవిటో భార్యాభర్తలిద్దరూ గుర్తించి, ఒకరిమీద ఒకరు గౌరవంతో కలిసి బతకడమే దీనికి పరిష్కారం. అలాటి దాంపత్యంలోని విలువని గుర్తించి, ఆలాటి ఆలోచనలని ప్రజలలో కలిగించడం సంఘం (అంటే మనమే!) బాధ్యత.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77092902494514185472008-05-16T23:06:00.000+05:302008-05-16T23:06:00.000+05:30అస్సలు నేను చెప్పాలనుకున్న పాయింటు ఎవ్వరు అర్ధం చే...అస్సలు నేను చెప్పాలనుకున్న పాయింటు ఎవ్వరు అర్ధం చేసుకోలేదు. లేదా అర్ధం కానట్టు ఉన్నారా? నేను చెప్పదలుచుకున్నది ఇల్లాలు చేసే పనులకు అంత డబ్బులు ఇవ్వమని కాదు. ఒకవేళ ఖరీదు కడితే అంత అవుతుందంట అని. ఇప్పుడు నా విషయం అడుగుతా చెప్పండి. నేను ఉద్యోగం చేయను. నాకు నెలకు ఎటువంటి ఆదాయం అంటూ లేదు. కాని నేను ఇంట్లో అన్ని పనులు చేస్తాను. పైన చెప్పిన వివరాలలో డ్రైవింగ్ తప్ప (కారు లేదు కాబట్టి). కాని నాకు నా స్వంతం అంటూ నెలకు ఖచ్చితమైన ఆదాయం లేదు. నాకు కావాలంటే మావారిని అడగాలి. లేదంటే ఇంటి ఖర్చులకిచ్చిన వాటిలో మిగిలినవి వాడుకోవాలి. తిండి,బట్ట, తల మీద నీడ, అప్పుడప్పుడు కావల్సినవి (అదీ అడిగినవన్నీ కావు) కొనిస్తే చాలా. నాకంటూ స్వంతంగా ఎదైనా కొనుక్కోవాలి, ఖర్చు పెట్టాలి అంటే మావారు ఇచ్చేవరకు ఆగాలి, లేదా ఇవ్వకుంటే కోరికను అణచివేయాలి.అంతేనా. నేను ఇంట్లో చేసే పనిలో సగం బయట చేస్తే నాకు రెండు వేలు రావా అని నేను అనుకోనా. ఇప్పుడు పిల్లలు పని చేస్తున్నారు.వాళ్ళను అడగాలా నాకు డబ్బులివ్వండి అని. అది వారి కష్టార్జితం. అడగాలంటే నాకు అస్సలు ఇష్టముండదు. నాకు స్వంతానికి ఖర్చులు ఉంటాయని వాళ్ళకు తెలీదా. అడగాలా. అదే నాకు నెలకింత అని ఆదాయం ఉంటే. ఈ పరిస్తితి ఉండదు కదా. ఇప్పుడంటే కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కాబట్టి పర్లేదు. ముందు ముందు శరీరం అన్నింటికి సహకరించదు. పిల్లలు ఎవరి జీవితాలు వారివి,అప్పుడు నాకు మందులు, పళ్ళు లాంటివి అవసరం కావొచ్చు. ఎలా మరి? పిల్లలను అడుక్కోవాలా?

ఇలాంటి అమ్మలు, ఇల్లాల్లు ఎంతో మందిని నేను చూసాను. ఇందులో ఆడ, మగ అనే తేడాలు అవి ఎందుకు? ఎక్కువ తక్కువ అనే ప్రశ్నే లేదు?

నిషిగంధ చెప్పినట్టు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యోగం లేని ఇల్లాల్లు ఇంట్లో ఉండి చేసే పనులను గుర్తించండి.అంతే..వాళ్ళకూ ఎన్నో కోరికలు, ఉంటాయి. అది వాళ్ళను మనస్పూర్తిగా నెరవేర్చుకోనివ్వకండి. ఎప్పుడూ ఇంట్లోవాళ్ళకు అన్ని అమర్చిపెట్టడానికే ఉన్నట్టు ప్రవర్తించకండి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18168606372039523172008-05-16T09:50:00.000+05:302008-05-16T09:50:00.000+05:30చదువుకోవడానికి కూడ ఎబ్బేటుగా ఉంటాయి ఇలాంటి వ్యాసాల...చదువుకోవడానికి కూడ ఎబ్బేటుగా ఉంటాయి ఇలాంటి వ్యాసాలు. కాని జీవితం అన్న తరువాత కొన్ని మనం అనుభవంలోకి రాక తప్పవు. అలాంటి వాటిల్లో ఇది ఒహటి.

"ఆ ఆంటీ, అంకుల్ మీద అలా వాళ్ళ ట్రాన్సిస్టర్ని విసిరిపారేస్తున్నది ఎందుకని?", అని అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలి?

తిమ్మాపురంలో తన "బాబు" ఆరోగ్యం గురించి చింతించి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన భువనేశ్వరి "ఆలోచన" (ప్రేమ లేదు దోమా లేదు అంటారా) కి ఎంత వెల కట్టాలి?

గాయని పీ.సుశీల భర్తకి ఎంత విలువగట్టాలి?
ప్రతిదానికి ఇలా వెలగట్టుకుంటూ పొవడేమేనా?
ఎదో తమషాకా?
అసలు ఈ ఆలోచనలన్ని సరైనవేనా?netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77796486319961302602008-05-16T07:55:00.000+05:302008-05-16T07:55:00.000+05:30రాధిక గారితో 100 శాతం ఏకీభవిస్తున్నాను.రాధిక గారితో 100 శాతం ఏకీభవిస్తున్నాను.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21747362001929187272008-05-16T00:15:00.000+05:302008-05-16T00:15:00.000+05:30రాధికా, సరైన పదం 'గుర్తింపు ' :-)రాధికా, సరైన పదం 'గుర్తింపు ' :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37815646757860050822008-05-15T21:50:00.000+05:302008-05-15T21:50:00.000+05:30@venu - మహాశాయా .. USA లోనే కాదు, ఎక్కడైనా ఇంటిపను...@venu - మహాశాయా .. USA లోనే కాదు, ఎక్కడైనా ఇంటిపనుల్లో ఇల్లాలికి చేదోడుగా ఉన్న భర్తలు లేకపోలేదు. వారికి అభినందనలు. కానీ తమరు వక్కాణించిన USAలోనే తరచూ కనిపించే గృహదృశ్యం ఇదే!
http://onamaalu.wordpress.com/2008/04/15/asahayatahasyalu/కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-87239144569812196242008-05-15T21:47:00.000+05:302008-05-15T21:47:00.000+05:30@RSG - సెక్యూరిటీకి సెక్యూరిటీ ఫీలింగ్ కి తేడాం ఏం...@RSG - సెక్యూరిటీకి సెక్యూరిటీ ఫీలింగ్ కి తేడాం ఏంటో సెలవియ్యండి.

@తాడేపల్లి గారు - మగవాళ్ళని పప్పు సుద్దలు అన్నందుకే మీ మనసు నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి. It was a little exaggeration, a figure of speech, used to drive the point home. నాకు పరిచయమున్న పెళ్ళైన మగవారిలో పప్పుసుద్దలు - పప్పుసుద్దలు కాని వారూ సుమారు 50-50 నిష్పత్తిలో ఉన్నారు.
పెళ్ళి అన్నాక భార్యా భర్తా ఇద్దరూ తమ తమ పాత్రలు పోషించాలి, తమ బాధ్యతలు నిర్వర్తించాలి, ఒకరికొకరు తోడు అని గనక మీ ఉద్దేశం ఐతే నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను.
మీరు చెప్పిన ఐదు ప్రశ్నలనే పిల్లలున్న ఒక వితంతు స్త్రీకి, పెళ్ళికాకుండా పిల్లని కన్న ఇంకొక స్త్రీకి అన్వయించి చూడండి. స్త్రీకి సమాజం ఎలాంటి రక్షణ ఇస్తోంది అనేది తెలుస్తుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73839669156040241272008-05-15T21:41:00.000+05:302008-05-15T21:41:00.000+05:30అరె అంత తక్కువ జీతమా?నేను నా జీతమంతా మా ఆవిడకు జీత...అరె అంత తక్కువ జీతమా?

నేను నా జీతమంతా మా ఆవిడకు జీతం కింద ఇచ్చేస్తున్నానే. అయితే మా బాసు దేవి నాకు చాలా బాకీ అన్నమాట.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49116054950446309872008-05-15T21:04:00.000+05:302008-05-15T21:04:00.000+05:30ఆడాళ్ళు గొప్పా?? మగ వాళ్లు గొప్పా?? అనే ఈ సోది సొల...ఆడాళ్ళు గొప్పా?? మగ వాళ్లు గొప్పా?? అనే ఈ సోది సొల్లు చర్చలు, నా చిన్నప్పటి నుండి వింటున్నవే.. ఎవరి జీవితాలలోను మార్పు లేదు.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-23078244201906059412008-05-15T21:01:00.000+05:302008-05-15T21:01:00.000+05:30ఈ ఆదాయ వ్యయాల లెక్కలు వదిలేయండి. ఈ మద్యన జరిగిన అ...ఈ ఆదాయ వ్యయాల లెక్కలు వదిలేయండి. ఈ మద్యన జరిగిన అన్ని సంఘటనలలో ఆడ వాళ్లు చనిపోయారా?? మగ వాళ్లు చనిపోయారా?? అది చెప్పండి.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72267028204951281082008-05-15T20:43:00.000+05:302008-05-15T20:43:00.000+05:30ఆడవాళ్ళు చేసే ఇంటిపని విలువని గుర్తించాలని అనడం చా...ఆడవాళ్ళు చేసే ఇంటిపని విలువని గుర్తించాలని అనడం చాలా సబబైన విషయమే! అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే దాన్ని డబ్బుతో విలువకట్టడం అన్నది నాకు మింగుడుపడని విషయం. ఉద్యోగాలు చేసేవాళ్ళని, వాళ్ళు తెచ్చే జీతాన్నిబట్టే విలువకట్టడం లాంటిదే ఇదీను.
"విలువ"కట్టడానికి డబ్బు తప్ప మనకి వేరే ఏ ప్రమాణాలు లేవా?!కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31687066116481492422008-05-15T20:36:00.000+05:302008-05-15T20:36:00.000+05:30అంకెలు మరీ దారుణం గా వున్నాయండి.పక్కన బ్రేకెట్లలో ...అంకెలు మరీ దారుణం గా వున్నాయండి.పక్కన బ్రేకెట్లలో రాసినవి నిజమే కదా.పురుషులకు నిజాలు తెలియచెప్పడం వరకు ఓకే.కానీ ఇవన్నీ పనిమనుషులు కూడా చేస్తారు.మరి ప్రేమ మాటేమిటి అని మనం అడిగితే, మరి భర్తలు పంచే ప్రేమ మాటేమిటి?కాబట్టి ప్రేమకి ప్రేమ చెల్లు.వాళ్ళు మనకు సెక్యూరిటీ ఇస్తుంటే మనం వాళ్ళకి సమాజం లో మనం ఒక స్టేటస్ గా వుంటున్నాము.[స్టేటస్ సరయిన పదం కాదనుకుంటాను.ఏదో వేరే మాట వుంది.కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు]కాబట్టి అది,ఇది చెల్లు.
మనం చేసినపనికి మనకి ఇవ్వాల్సినదానిలో మన తిండికి,బట్టలకి,ఇతరత్రా అవసరాలకి పోనూ మహా అయితే మనకి నెలకి ఒక వెయ్యో, రెండువేలో వస్తాయి .అంతే.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-42327464362882533102008-05-15T18:56:00.000+05:302008-05-15T18:56:00.000+05:30ఈ రోజు రేడియో మిర్చిలో అనుకుంటాను, ఇదే టాపిక్క్ మీ...ఈ రోజు రేడియో మిర్చిలో అనుకుంటాను, ఇదే టాపిక్క్ మీద, యాంకర్ అందరినీ ఇదే ప్రశ్న అడిగింది... ఆడవాళ్ళు అందరూ టైమ్స్ వాడు రాసినదానికి దగ్గర దగ్గర అంకెలనే చెప్పారు.. మగవాళ్ళు ఆ ప్రోగ్రామ్లో మాట్లడడానికి లేదు ఎందుకంటే దాని పేరే లేడీస్ కాలనీ!మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45060723146011302932008-05-15T17:23:00.000+05:302008-05-15T17:23:00.000+05:30నేనేమైనా అతిగా రాసి ఉంటే. సరిహద్దులు దాటి ఉంటే క్ష...నేనేమైనా అతిగా రాసి ఉంటే. సరిహద్దులు దాటి ఉంటే క్షమించండి.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67151168037777849492008-05-15T14:20:00.000+05:302008-05-15T14:20:00.000+05:30మగవాడు ఆడదానికి సెక్యూరిటీ కాదనేముందు కొన్ని ప్రశ్...మగవాడు ఆడదానికి సెక్యూరిటీ కాదనేముందు కొన్ని ప్రశ్నలు :

౧. మీకొక కూతురుంటే ఆమెని ఒక మగవాడికిచ్చి పెళ్ళిచేస్తారా ? సమాజానికిచ్చి పెళ్ళి చేస్తారా ?

౨.సమాజమంటే ఏమిటి ? వ్యక్తులే కదా ? మగవాడు వ్యక్తి కాదా ?

౩. మీ కూతురికి ఏదైనా సమస్య వస్తే ఆమె దాని గుఱించి ముందు తన భర్తతో చెప్పుకుంటుందా ? సమాజంతో చెప్పుకుంటుందా ?

౪. మీ కూతురికి పిల్లలు పుడితే వాళ్ళ ఆలనా పాలనా మీ అల్లుడు చూస్తాడా ? సమాజం చూస్తుందా ?

౫. ఒకవేళ మీ అల్లుడు చనిపోతే మీ కూతురికి ఇన్సూరెన్సు డబ్బూ ఆస్తులూ మీ అల్లుడి నుంచి సంక్రమిస్తాయా ? సమాజం నుంచి సంక్రమిస్తాయా ?

తొందఱపడి మగవాళ్ళే మగవాళ్ళ గుఱించి నీచంగా మాట్లాడ్డం అనే పోకడ నేనీ మధ్య గమనిస్తున్నాను. ఇది ఆడవాళ్ళకు ఎంతవఱకు ఆమోదయోగ్యమౌతుందో నాకు తెలియదు. కాని నా వైపునుంచి తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేయక తప్పడంలేదు. మంచీమర్యాదా ఆడజాతి పట్ల చూపించినట్లే మగజాతి పట్ల కూడా చూపించమని మనవి చేస్తున్నాను.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91831194110657350302008-05-15T11:14:00.000+05:302008-05-15T11:14:00.000+05:30కొత్తపాళీగారు, నేను సెక్యూరిటీ అనలేదు... సెక్యూరిట...కొత్తపాళీగారు, నేను సెక్యూరిటీ అనలేదు... సెక్యూరిటీ ఫీలింగ్ అన్నాను. చుట్టూఉన్న సమాజం సెక్యూరిటీ ఫీలింగ్ ఇవ్వదనుకుంటా... Infact it works the otherway around.

నేను.. నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అన్న ఫీలింగ్ వల్ల వచ్చే నిశ్చింత గురించి నేను అన్నది.

సగంమంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేది అందుకే అని ఎక్కడో చదివాను.RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.com