Monday, December 7, 2009

తాడేపల్లిగారికి జన్మదిన శుభాకాంక్షలు


కలగూరగంపతో మనకందరికీ సుపరిచితులైన తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్మాత కరుణ మీపై , మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను.


తాడేపల్లి గారు రాసే టపాలతో అందరికీ ఒకలాంటి భయం, బెరుకు ఉండేది. కామెంటాలంటే కూడా జంకే.. కాని గత సంవత్సరం జరిగిన బ్లాగర్ల దినోత్సవం, పుస్తకప్రదర్శనలో కలిగిన తాడేపల్లిగారి పరిచయం మరువలేనిది. ఆయన రాత మాత్రమే కాస్త ఘాటుగా ఉంటుంది .కానీ మాట మొదలెడితే అలా వింటూ ఉండిపోవాల్సిందే. ప్రతీ విషయానికి సమాధానం ఉంటుంది. ఏదీ కాదనలేము. పుస్తక ప్రదర్శనలో ఎంతో మందికి తెలుగు గురించి విడమరిచి చెప్పారు. బ్లాగు గుంపులో సహాయం చేయడానికి ముందుంటారు. కాని తన గురించి మాత్రం "నేను తప్ప పుట్టాను ' అంటారు. అయినా కాని అందరికి ఎన్నో విషయాల్లో సహాయం చేసే తాడేపల్లిగారికి బ్లాగర్లందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పద్యం రాసింది చింతా రామకృష్ణగారు. వారికి ధన్యవాదాలు.

23 వ్యాఖ్యలు:

మంచు

తాడేపల్లి గారు - హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

చిలమకూరు విజయమోహన్

విజ్ఞానగని తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

జాహ్నవి

తాడేపల్లి గారు - హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

విశ్వ ప్రేమికుడు

తాడేపల్లి గారు - హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Anonymous

అందఱికీ హృదయపూర్వక నెనరులు. ప్రత్యేకించి జ్యోతిగారికి, ఎందుకంటే ఆవిడ బ్లాగ్‌లోకంలో చాలామందికి గురుతుల్యులు. Friend, guide and philosopher.

నన్ను, నా లోటుపాట్లనీ మూడున్నఱేళ్ళ నుంచి ఓర్పుతోను, దయతోను భరిస్తూ ఉన్న తెలుగుబ్లాగ్‌లోకానికి సగౌరవ అభివాదములు. బ్లాగుల్లో నా అభివ్యక్తి (expression) మఱింత మింగుడుపడేలా, నాగరికంగా ఉండడానికి కృషి చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

--తాడేపల్లి

చింతా రామ కృష్ణా రావు.

ఆర్యా!లలితా సుబ్రహ్మణ్యా! హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

తాడేపల్లి కులోద్భవా! వర గుణా! తత్వజ్ఞ!ధన్యాత్ముడా!
శ్రీ లాలిత్యము, చిత్త శుద్ధియు శుభశ్రీభావనల్ రూపుగా
మేలైనట్టి మిమున్ సృజించె నిలపై మేల్జేయగా బ్రహ్మ.మా
మేలుంగూర్చెడి మిమ్ము బ్రోచుత సదా మేల్గూర్చుచున్ దైవమున్.

Shiva Bandaru

తాడేపల్లి గారు - హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

రవి

ఆయన మాటలు చాలా సార్లు చివుక్కుమనిపించినా, ఆయన మీద గౌరవం తగ్గట్లేదు. ఎందుకో మరి!

తాడేపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

లక్ష్మి

పోయిన యేడాది బుక్ ఎగ్జిబిషన్ లో కలిసేవరకూ నేను కూడా తాడేపల్లి గారి గురించి అమ్మో ఈయన మాట చాలా పదును, చాలా ఘాటుగా రాస్తారు అనే అనుకునేదాన్ని. కానీ అక్కడ కలిసిన తర్వాత నా అభిప్రాయం మొత్తంగా మారిపోయింది. నడిచే విజ్ఞాన భాండాగారం, నిరాడంబరత ఆయన ప్రతేయ్కత. జ్యోతిగారి బ్లాగు ముఖం గా తాడేపల్లి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

karthik

తాడేపల్లి గారు - హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

స్వర్ణమల్లిక

తాడేపల్లి గారూ, మీకు హ్రుదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు.

కొండముది సాయికిరణ్ కుమార్

తాడేపల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

sunita

తాడేపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

కొత్త పాళీ

లలితాబాలసుబ్రహ్మణ్యంగారూ, మీరు నూరేళ్ళు చల్లగా ఉండి, మీ ఆలోచనలు మరింత పదును దేరి, మీ కలానికి మరింత వడి కల్గి, మన భాషకి, సంస్కృతికి, దేశానికి, మనవారికి ఇతోధికంగా సేవచేసే శక్తి ఆ అమ్మవారు మీకనుగ్రహించు గాక.

జ్యోతి

తాడేపల్లిగారు,

మా అందరి తరఫున ఒక వినతి. మన్నించక తప్పదు. ప్రతినెలకొకటన్నా ఆడియో టపా వేయండి. రాతతో పాటు మాట చేరిస్తే బావుంటుంది.

baleandu

తాడేపల్లి గారు - హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Kalpana Rentala

తాడేపల్లి గారికి,
జన్మదిన శుభాకాంక్షలు. మాట కటువుగా వున్నవారి మనస్సు వెన్న అంటారు.. మీరు కూడా ఆ కోవలోకే చెందుతారనుకుంటాను. మీరు మీలాగే వుండండి. అదే మీ ప్రత్యేకత.

Sravya V

తాడేపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

మాలా కుమార్

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారికి ,
జన్మదిన శుభాకాంక్షలు .

రాజేశ్వరి నేదునూరి

taDE palli gAriki janma dina SubhA kAMkshalu

రాజేశ్వరి నేదునూరి

#Tel
tADE palli gAriki janma dina SubhA kAMkshalu. #Tel

వేణూశ్రీకాంత్

తాడేపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

పరిమళం

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008