Thursday, October 29, 2015

Happy Birthday My Friend....



May the sunshine of happiness always shine above you.
May the dove of peace rest over you and live in your home.
May the dense forest of love surround you all year round.
Best wishes to my beloved friend for an amazing year ahead…
Happy Birthday Friend….

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ ... ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఆ దేవుడు మనకిచ్చాడు. కాని మనకు మాత్రమే సొంతం పరిమితమైన స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే వదిలిపెట్టాడు. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడు వెన్నుతట్టి నడిపే స్నేహితుడిని నువ్వే వెతికి పట్టుకో.పదిలంగా చూసుకో అని మనకు ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చాడు ఆ దేవదేవుడు. అదీకాక నీ స్నేహితులను గురించి చెప్పు , నీ గురించి సమస్తం నేను చెప్తాను అని ఎవరో మహానుబావుడు అన్నాడు కూడా. చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుంది అని చెప్పలేము. ఆ బంధాలను మనం భద్రంగా చూసుకోలేమో కూడా. కాని ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి ప్రతిఫలం లేకుండా , ఆడా - మగా, పేదా గొప్ప అనే తారతమ్యాలు ఉండవు.
మనం జీవితప్రయాణంలో కలిసిన ప్రతివారిని ,లేదా పలకరించి కొన్ని సార్లు ముచ్చట పెట్టిన ప్రతీవాళ్లని అంత తేలికగా స్నేహితులుగా చేసుకోలేము కదా. "మై ఫ్రెండ్" అని కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే పేర్కొంటాము. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపట్టి దానిని పారద్రోలడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అంతవరకు మనని వదలరు. నేను ఎప్పుడు నీ వెంట ఉన్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చేది స్నేహితుడే.  నిజంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా స్నేహం చేసి మన మంచిని మాత్రమే కోరుకునే ఆ స్పెషల్ ఫ్రెండ్స్ మనకే తెలీని, మనలోదాగి ఉన్న ప్రతిభని గుర్తించి , దానిని బయటకు తీస్తారు. అలాగే ఎప్పటికప్పుడు మనని ఓ కంట కనిపెడుతూ ఎక్కడైనా తప్పటడుగు పడితే వెంటనే హెచ్చరించి సరిచేస్తారు.  దిగులుగా ఉంటే డిస్టర్బ్ చేసి మూడ్ మారుస్తారు.. మార్చుకునేలా చేస్తారు. అంతటి అద్భుతమైన స్నేహితులను పొందడం నిజంగా మన అదృష్టం.
జీవితపు ప్రయాణంలో మనకు లక్షలు, కోట్ల కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని పొందడం ,దాన్ని పదిలంగా భద్రపరుచుకోవం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం అంటే జస్ట్  బ్రతకడానికే తప్ప మనఃస్పూర్థిగా, అన్ని ఆనందాలను అనుభవిస్తూ సంతోషంగా జీవించడం కాదు అని నా అభిప్రాయం..
ఒక గురువులా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా  అవసరమైన వేళ నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే, సరైన దారిని వెతుక్కునేలా చేసే ఒక స్పెషల్ ఫ్రెండ్ పుట్టినరోజు సంధర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు..
హ్యాపీ బర్త్ డే మిత్రమా...

Friday, October 23, 2015

సృజనస్వరం



జ్యోతిగారు మీరు సృజనస్వరం ప్రోగ్రామ్ లో గెస్ట్ గా రావాలండి...

నేనా??.. ఎబ్బే!!! నాకంత సీను లేదు. సినిమా అస్సలే లేదండి.. ఏదో నాకిష్టమైనవి నేర్చుకుంటూ, కాసిన్న రాసుకుంటూ, కాసిన్న వండుకుంటూ కాలం గడిపేస్తున్నాను.. ఐనా మురళీకృష్ణగారు మీరు రచయితలను పరిచయం చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న వ్యాసాలు తప్ప.నేను రచయితను కాదుగా.. కథలు రాయను. కవితలు రాయను. ఒక్క బహుమతి కూడా రాలేదు.. ఒక్క పుస్తకం కూడా అచ్చేయలేదు.. మీ గెస్ట్ లిస్టులో నేను సరిపోనండి..

అలా ఎందుకనుకుంటారు.. రచయిత అంటే కథలు, నవలలు రాసేవాళ్లు. పోటీల్లో బహుమతులు సంపాదించేవారే కాదు. మీరు రైటర్ ఎందుకు కాదు.. 

ఏమోనండి..చూద్దాం... ఎప్పుడైనా ఏదైనా పుస్తకం ప్రింట్ ఐతే కాస్త అర్హత వచ్చిందని అనిపిస్తే తప్పకుండా వస్తాను.
ఇలా రెండేళ్ల క్రింత నుండి కస్తూరి మురళీకృష్ణగారు అడుగుతూ ఉన్నారు.. ఎలాగైతేనేమి లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ లో అనుకుంటా ఎలాగూ ఒక పుస్తకం (తెలంగాణ వంటలు - వెజ్) రాసాను కదా అని సృజనస్వరంలో పాల్గొంటానని ప్రోగ్రామ్ రికార్డింగ్ కూడా చేసాను. కాని ముందే చెప్పా. నాకు రాయడం తప్ప మాట్లాడ్డం రాదు ముఖ్యంగా మైకు ముందు అన్నా. పర్లేదు మిమ్మల్ని నేను మాట్లాడేలా చేస్తాను అని నమ్మకంగా చెప్పారు మురళీకృష్ణగారు.. ఇక ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుతూ గంట ఎలా గడిచిపోయిందో తెలీలేదు. దీనికోసం నేను ప్రిపేర్ అయ్యిందేమీ లేదు. జస్ట్ అలా మాట్లాడేసాను.. కాని తెల్లారి ఏం మాట్లాడిందీ గుర్తులేదు..

సో ఇవాళ రాత్రి తెలుగు వన్ వారి టోరి రేడియోలో సృజనస్వరంలో నా గురించి నేను మాట్లాడింది వినండి మరి.. నా గురించి చాలామందికి తెలియని చాలా విషయాలున్నై ఇందులో.. ఈ ప్రోగ్రామ్ లో నేను చేస్తానన్న విషయం ఆల్రెడీ విజయవంతంగా పూర్తి చేయడమైంది. అదేంటో తెలుసుకోండి..


నా ఫ్రెంఢ్స్ కి చిన్న పరీక్ష:
సుమారు ఐదారేళ్లుగా నాకు పరిచయమున్న కస్తూరి మురళీకృష్ణగారు అవసరమైనవేళ ఎన్నసార్లు నాకు సాయం చేసి ప్రోత్సహించారు.. ధైర్యం చెప్పారు. కాని నన్ను అతిధిగా పిలిచినందుకైనా నేను ఆయన్ని గురించి గొప్పగా మాట్లాడకుండా కేర్ నాట్ అన్నట్టు ఒకచోట మాట్లాడాను.. (ప్చ్.. భయం లేకుండా నిజం మాట్లాడటం నాకున్న మంచి దురలవాటు...)అదేంటో కనుక్కుని ఇక్కడ కామెంట్ పెట్టిన మొదటి వ్యక్తికి నా ఫేస్బుక్ కార్టూన్స్ పుస్తకం ఉచితంగా పంపిస్తాను...

October 23rd, 2015 at
11.30 pm - 12.30 am (IST),
2 pm - 3 pm (EDT),
7 pm - 8 pm (UK),
10 pm - 11 pm (UAE).


Tune in to TORi live,

http://www.teluguoneradio.com/

http://www.teluguone.com/devices/


Sunday, October 18, 2015

ఈనాడులో దసరా స్పెషల్స్

ఇవాళ్టి ఈనాడులో తెలంగాణ ప్రాంతపు దసరా వంటకాలు



ఈనాడు రుచి - అభిరుచి

Monday, October 5, 2015

మాలిక పత్రిక అక్టోబర్ 2015 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head

అందరినీ అలరిస్తున్న రచనలతో అక్టోబర్ మాలిక పత్రిక విడుదలైంది. ప్రమదాక్షరి కథామాలిక పేరుతో ఒకే అంశం మీద మహిళా రచయితలతో చేస్తున్న ప్రయోగం సఫలమైంది. ఎన్నో విభిన్నమైన కథలు వచ్చాయి..
మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org

అక్టోబర్ 2015 సంచికలో:

00. అక్షర సాక్ష్యం
01. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
02. అ'మ్మా'యి
03. నిరంతరం నీ ధ్యానంలో
04. తొలగిన మబ్బులు
05. ఇదో పెళ్లి కథ
06. గెలుపు కోసం
07. శంభునటనం
08. మలయ సమీరం
09. దసరా మామూళ్లు
10. దసరా స్పెషల్స్
11. ఆత్మకు వినబడే పాట
12. భ్రమర వ్యసనం
13.అనగా అనగా Rj వంశీ
14. చిగురాకు రెపరెపలు
15. కళ్యాణి రాగం
16. మన వాగ్గేయకారులు 4
17. మాయానగరం 19
18. శుభోదయం 3
19. రాయలసీమ కథలు - సమీక్ష
20. Dead People Dont Speak 9
21. ఆరాధ్య 13

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008