Showing posts with label జె.వి.పబ్లికేషన్స్. Show all posts
Showing posts with label జె.వి.పబ్లికేషన్స్. Show all posts

Sunday, 10 December 2017

శతపుస్తక ప్రచురణోత్సవం

అనుకోకుండా ప్రచురణా రంగంలోకి అడుగిడి నాలుగేళ్లు కావస్తోంది.  ఈనాడు జె.వి.పబ్లికేషన్స్ 100 వ పుస్తకావిష్కరణ సంబరాలు జరుపుకుంటోంది.


Saturday, 15 July 2017

J.V.Publications.. An Author's Avenue from Script to Book Publishing...





బ్లాగు రాతలనుండి పత్రికా రచనలు,మాలిక పత్రిక నిర్వహణ.. ఆ తర్వాత ఒక స్నేహితురాలి పుస్తకం, నా వంటల పుస్తకం ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో JV Publications పేరిట పబ్లిషింగ్ సంస్ధను ప్రారంభించిన సంగతి మీకు తెలిసిందే. 2014 లో ప్రారంభమైన ఈ పబ్లికేషన్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం నా "తెలంగాణ ఇంటివంటలు- వెజ్" అలాగే ఆ సంవత్సరంలో చివరిగా వచ్చిన పుస్తకం నా “ తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్”. ఇది ఇరవయ్యవ పుస్తకం. జె.వి.పబ్లికేషన్స్ నుండి ఎందరో ప్రముఖులైన రచయితలు, రచయిత్రుల పుస్తకాలను మంచి క్వాలిటీ, అనువైన ధరలో ప్రచురించడం జరిగింది.
అన్నింటికన్నా ముఖ్యం అచ్చుతప్పులను ఎక్కువ లేకుండా చూడగలిగాను. పబ్లిషర్స్ అనగానే పుస్తకాలు అచ్చువేసివ్వడం మాత్రమే కాకుండా రచయితలకు తమ పుస్తకాల ప్రచురణకు సంబంధించిన సేవలు అందించడమే జె.వి. పబ్లికేషన్స్ ముఖ్య ఉద్ధేశ్యం. రచయిత దగ్గర కంటెంట్, సొమ్ము ఉంటే చాలు. వారి రచనలు పుస్తక రూపంలో అచ్చు వేసి ఆ తర్వాత చేయవలసిన పనుల గురించిన సేవలు అందించడం మా వంతు. ఆ పుస్తక సేవలు ఏమేమిటి అంటే..
1. డిటిపి
2. ప్రూఫ్ రీడింగ్
3. కవర్ డిజైన్
4. ప్రింటింగ్
5. పుస్తకాల షాపులకు పంపడం
6. సమీక్ష కోసం వివిధ పత్రికలకు కాపీలు పంపడం
7. సెంట్రల్ లైబ్రరీకి అప్లై చేయడం
8. చివరిగా eబుక్ చేయడం
ఇందులో పుస్తకానికి సంబంధించిన కాపీరైట్లు రచయిత దగ్గరే ఉంటాయి. ప్రచురణ విషయంలోనే మా సేవలు అందుబాటులో ఉంటాయి. వాటికి తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక తమ పుస్తకాన్ని రచయితలు తమ అభిరుచికి తగినట్టుగా, తమకు పూర్తిగా నచ్చినట్టుగా చేసుకునేలా గైడ్ చేయడం జరుగుతుంది. రచయితకు పూర్తిగా నచ్చిన తర్వాతే పుస్తకం ప్రింటింగ్ కి వెళుతుంది. ఈ పనులన్నీ వీలైనంత తక్కువ ధరలో, నాణ్యంగా, అందుబాటులో ఉండే విధంగా చేయడం జరుగుతుంది. తమ పుస్తకానికి ప్రచారం, ఆవిష్కరణ , అమ్మకాల విషయం రచయిత మాత్రమే చూసుకోవాలి. అది మా బాధ్యత కాదు.
జె.వి.పబ్లికేషన్స్ నుండి వచ్చే ప్రతీ పుస్తకం మంచి క్వాలిటీతో అనుకున్న టైమ్ కి అందజేయడం జరుగుతుంది.. ఎందుకంటే పుస్తక ప్రచురణలో ప్రతీ అంశం నా చేతులమీదుగానే జరుగుతుంది కాబట్టి ఈ హామీ ఇవ్వగలుగుతున్నాను. మీ ఆదరాభిమానాలతో 2014 జనవరి నుండి ఇప్పటివరకు 78 పుస్తకాలను జె.వి.పబ్లికేషన్స్ నుండి ప్రచురించబడ్డాయి అని కాస్త సంతోషంగా, కాస్త గర్వంగా చెప్పగలుగుతున్నాను. జె.వి.పబ్లికేషన్స్ నుండి వచ్చే పుస్తకాలు టైమ్ మీద మంచి డిజైనింగ్ తో రావడానికి కారణం నా టీమ్. డిటిపి ఆపరేటర్ Kothapally Ravi Prabha, డిజైనర్ Ramakrishna Pukkallaగారు.
అంతేకాదు పుస్తకాల మార్కెటింగ్ విషయంలో కూడా కొత్త ఆలోచన చేస్తోంది జె.వి.పబ్లికేషన్స్ .. త్వరలో ఈ విషయమై ప్రకటన కూడా వెలువడబోతోంది.
ఆఫర్: జె.వి.పబ్లికేషన్స్ నుండి వచ్చిన పుస్తకాలు 25కంటే ఎక్కువ కొంటే అవి 50% ధరకే ఇవ్వబడతాయి. ( రచయితల అంగీకారంతోనే )
ఇంతవరకు జె.వి.పబ్లికేషన్స్ నుండి వచ్చిన పుస్తకాలు ఇవి:

జె.వి.పబ్లికేషన్స్ నుండి ఇప్పటివరకు ప్రచురించబడిన పుస్తకాలు
1. తెలంగాణ ఇంటివంటలు . వెజ్ ... జ్యోతి వలబోజు.. రూ. 150
2. తెలంగాణ ఇంటివంటలు. నాన్ వెజ్. జ్యోతి వలబొజు. రూ. 150
3. ఆకుపాట.. శ్రీనివాస్ వాసుదేవ్ రూ. 110
4. ఏ కథలో ఏమున్నదో .. సి.ఉమాదేవి రూ. 75
5. సాగర కెరటం .. సి.ఉమాదేవి రూ. 100
6. కేర్ టేకర్... సి.ఉమాదేవి రూ. 75
7. మంచిమాట.. మంచిబాట .. సి.ఉమాదేవి రూ. 100
8. మాటే మంత్రము.. సి.ఉమాదేవి రూ.100
9. అమ్మంటే.. సి.ఉమాదేవి రూ. 50
10. Avni’s Cook Book.. Avni Bannuru రూ.100
11. అమూల్యం.. నండూరి సుందరీ నాగమణి రూ.150
12. నువ్వు కడలివైతే.. నండూరి సుందరీ నాగమణి రూ. 150
13. నాకు తెలుగు చేసింది.. సత్యసాయి కొవ్వలి రూ. 120
14. పద నిసలు.. సత్యసాయి కొవ్వలి రూ. 150
15. జీవనవాహిని... మంథా భానుమతి రూ. 120
16. అగ్గిపెట్టెలో ఆరుగజాలు.. మంథా భానుమతి రూ. 150
17. హాస్యామృతం . ఆర్.వి.ప్రభు రూ. 75
18. Snapshots.. కె.బి.లక్ష్మి రూ. 50
19. ఎగిరే పావురమా . కోసూరి ఉమాభారతి రూ. 100
20. వేదిక .. కోసూరి ఉమాభారతి రూ. 150
21. ధర్మప్రభ. కొంపెల్ల రామకృష్ణ రూ. 100
22. సిరిసిల్ల రాజేశ్వరి కవితలు. సిరిసిల్ల రాజేశ్వరి రూ. 50
23. తెలుగు కథ. శోభా పేరిందేవి రూ. 300
24. వృధాప్యం వరమా? శాపమా? . శోభా పేరిందేవి రూ. 50
25. కలికి కథలు. వెంపటి హేమ రూ. 300
26. అర్చన. అత్తలూరి విజయలక్ష్మి రూ.200
27. ఆవిరి. స్వాతికుమారి రూ 50
28. ప్రమదాక్షరి కథామాలిక -1 రూ. 100
29. ప్రమదాక్షరి కథామాలిక – 2 రూ. 100
30. ఒక పరి జననం- ఒకపరి మరణం. రామాచంద్రమౌళి రూ. 80
31. స్ఫూర్తి ప్రదాతలు. రామా చంద్రమౌళి రూ. 100
32. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు. రామా చంద్రమౌళి రూ. 100
33. అంతిమం. రామా చంద్రమౌళి రూ. 150
34. ఏకాంత సమూహంలో. రామా చంద్రమౌళి రూ. 80
35. The Silent Stream. Tamirisa Janaki రూ. 80
36. తమిరిశ జానకి మినీ కథలు. తమిరిశ జానకి రూ. 100
37. ఊర్వశి . వారణాసి నాగలక్ష్మి రూ. 30
38. కదంబం. శ్రీనివాస భరద్వాజ్ కిషోర్
39. ఫేస్ బుక్ కార్టూన్స్ . రాజు, లేపాక్షి రూ. 120
40. చిగురాకు రెపరెపలు. మన్నెం శారద రూ. 100
41. మహారాజశ్రీ మామ్మగారు. మన్నెం శారద రూ. 120
42. మన్నెం శారద కథలు. మన్నెం శారద రూ. 200
43. అమృతవాహిని. సుజల గంటి రూ. 150
44. ప్రియే చారుశీలే. సుజల గంటి రూ. 150
45. మనసా ఎటులోర్తునో . సుజల గంటి రూ. 150
46. పునీతులు. సుజల గంటి రూ. 50
47. సప్తపది . సుజల గంటి రూ. 50
48. Into the Crowded Aloneness. Rama Chandramouli
49. Nomadic Nights. Indira Babbellapati
50. అసమాన అనసూయ. వింజమూరి అనసూయాదేవి రూ. 250
51. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు. శ్యామలాదేవి దశిక రూ. 150
52. ‘అమెరి’కలకలం. వంగూరి చిట్టెన్ రాజు రూ. 50
53. కవిత్వంలో నేను. విన్నకోట రవిశంకర్ రూ. 150
54. చెప్పుకుంటే కథలెన్నో. సి.హెచ్. కామేశ్వరి రూ. 150
55. Photo Frame. D.Kameswari రూ. 150
56. శ్రీచక్ర సంచారిణి. పోలంరాజు శారద రూ. 60
57. స్వర్ణకుటీరం. పోలంరాజు శారద రూ. 120
58. బంగారు కంచం. పోలంరాజు శారద రూ. 70
59. రెప్పపాటు ప్రయాణం. పోలంరాజు శారద రూ. 150
60. సంధ్యారాగం. పోలంరాజు శారద రూ. 80
61. సుందరకాండ. నాగజ్యోతి సుసర్ల రూ. 50
62. మహాభారతం. శ్రీనివాసరావు తాతా రూ. 200
63. ఎమ్మెస్వీ కథలు. ఎమ్మెస్వీ గంగరాజు రూ.100
64. అనుబంధాల టెక్నాలజీ. లక్ష్మీ రాఘవ రూ.100
65. స్వప్నసాకారం. వాలి హిరణ్మయిదేవి రూ.150
66. యాత్రాదీపిక. మెదక్ ఆలయాలు. పి.ఎస్.ఎమ్.లక్ష్మి రూ.50
67. చిట్టి చిట్టి మిరియాలు. పాలపర్తి ఇంద్రాణి రూ.50
68. ఇంటికొచ్చిన వర్షం. పాలపర్తి ఇంద్రాణి రూ.40
69. ఱ. పాలపర్తి ఇంద్రాణి రూ.100
70. నీలీ ఆకుపచ్చ. డా.మధు చిత్తర్వు రూ.150
71. పాశుపతం. మంచాల శ్రీనివాసరావు రూ.100
72. సిరిసిరిమొవ్వ . మొవ్వ రామకృష్ణ రూ.100
73. సామాన్యులలో మాన్యులు. శోభా పేరిందేవి
74. అమ్మమ్మ. కొండముది సాయి కిరణ్ కుమార్ రూ. 100
75. అఖిలాశ. జానీ బాషా చరణ్ తక్కెడశిల రూ. 100
76. విప్లవ సూర్యుడు . జానీ బాషా చరణ్ తక్కెడశిల రూ. 100
77. పాలపిట్ట. గంటి ఉషాబాల రూ. 60
78. శోధన. మాలతి దేచిరాజు రూ.100

Wednesday, 14 December 2016

పురాణిక్ తంబోలా - Puranik Tambola


























మీరు ఆటలు ఆడతారా? అంత టైమెక్కడిది? అయినా ఈ వయసులో ఆటలేంటి అంటారా?
ఎప్పుడైనా గ్రూప్ మీటింగులలోకాని. ఏధైనా కుటుంబ, స్నేహ సమావేశాలలో కాని సరదాగా ఆడుకునే తంబోలా ఆట మీకు తెలుసు కదా. చిన్న టికెట్ మీద నంబర్లు ఉంటాయి. నంబర్లు చెప్తుంటే వాటిని కట్ చేయాలి. లైన్ల ప్రకారం ఎవరిది పూర్తైతే వాళ్లు గెలిచినట్టు , డబ్బులొస్తాయి. టాప్ లైన్, మిడిల్ లైన్, బాటమ్ లైన్,ఫుల్ హౌజ్ ఇలా....
ఎప్పుడూ అంకెలేనా. ఇంకాస్త ఇంటరెస్టింగ్ గా, ఇష్టంగా, విజ్ఞానదాయకంగా ఉండే తంబోలా ఆట ఉంటే ఎలా ఉంటుంది.
ఇది మరీ బావుంది. ఇలాటి ఆటలు అసలు ఉంటాయా.. ఉంటే మంచిదేగా. మాకోసం, మా పిల్లలకోసం, పిల్లల పిల్లలకోసం కొనచ్చు, బహుమతిగా కూడా ఇవ్వడానికి బావుంటుంధి.
ఇంతకీ ఈ ప్రత్యేకమైన తంబోలా ధర ఎంత? కొనగలిగేట్టుగానే ఉందా??

తప్పకుండా ఉంది..

ఇది పురాణాలలోని పాత్రల పేర్ల గురించి తెలుసుకుంటూ ఆడుకునే విధంగా ప్రత్యేకంగా తయారుచేయబడ్డ తంబోలా..

ఈ తంబోలా మీకు హైదరాబాదు బుక్ ఫెయిర్ లోని జె.వి.పబ్లికేషన్స్ స్టాల్ 30,31 లో లభిస్తుంది. అదికూడా తక్కువ ధరలోనే.. అసలు ధర రూ.450 అయితే నా స్టాలులో మాత్రం రూ.300 మాత్రమే..

రేపటినుండి మీకు అందుబాటులో ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. మనవళ్లకు పురాణాలగురించి చెప్పడానికి చాలా సులువుగా ఉండే ఆట ఇది. బహుమతిగా కూడా ఇవ్వొచ్చు..

Tuesday, 13 December 2016

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో జె.వి.పబ్లికేషన్స్











డిసెంబర్ 15 నుండి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే 30వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో జె.వి.పబ్లికేషన్స్ స్టాల్ నంబర్ 30, 31 లో నెలవై ఉంటుంది. మీరు మెచ్చిన మీకు నచ్చిన రచయితల పుస్తకాలెన్నో ఈ స్టాలులో లభిస్తాయి.
ప్రస్తుతం ఉన్న మనీ ప్రాబ్లమ్ కి కూడా సులువైన ఉపాయాలను సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటిలాగే. మీకు ఇష్టమున్న పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.
ఈ పుస్తక ప్రదర్శన ప్రతీరోజు మద్యాహ్నం రెండు గంటలనుండి రాత్రి 8.30 వరకు. శని, ఆదివారాలు, హాలిడేస్ లలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 8.30 వరకు

Saturday, 10 December 2016

Books from J.V.Publications



Feeling Proud to announce that I have brought out 67 books from J.V.Publications from 2014 Jan to 2016 Dec... All the books were well appreciated and praised for its quality and beautiful cover designs. I am very happy to have a good team of dtp operator, graphic designer and printers who understand and work as per my requirements and time maintenance..

2014 జనవరిలో ప్రారంభించిన ఈ పుస్తక ప్రచురణలో మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ, నేర్చుకుంటూ, మెరుగు పరుచుకుంటూ వీలైనన్ని తక్కువ తప్పులతో, అందంగా, మంచి క్వాలిటీతో ఇంతవరకు 67 పుస్తకాలను ప్రచురించిడం జరిగింది. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఈ రంగంలోకి ప్రవేశిస్తాను అని. కాని చేపట్టిన పని మాత్రం పర్ఫెక్టుగా చేస్తాను. అంతేకాక నా మీద అభిమానంతో కాక నమ్మకంతో తమ పుస్తకాల పని అప్పగించిన రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగని తప్పులు జరగలేదని కాదు. జరిగాయి. వాటివల్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నాను.

ఇంతవరకు ప్రచురించిన 67 పుస్తకాల లిస్టు ఇది. హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో దాదాపు చాలా పుస్తకాలు ఉంటాయి. రాలేనివారు కోరిన పుస్తకాలను వారి ఇంటికి కూడా పంపడం జరుగుతుంది.

Books from J.V.Publications
jyothivalaboju@gmail.com,


1. తెలంగాణ ఇంటివంటలు – వెజ్ - జ్యోతి వలబోజు .
2. తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్ – జ్యోతి వలబోజు .
3. ఆకుపాట – శ్రీనివాస్ వాసుదేవ్ -
4. ఏ కథలో ఏమున్నదో – సి.ఉమాదేవి
5. సాగర కెరటం - సి.ఉమాదేవి
6. కేర్ టేకర్ - సి.ఉమాదేవి
7. మాటే మంత్రము - సి.ఉమాదేవి
8. మంచిమాట – మంచి బాట - సి.ఉమాదేవి
9. అమ్మంటే - సి.ఉమాదేవి
10. Avni’s Cookbook - Avni
11. అమూల్యం - నండూరి సుందరీ నాగమణి
12. నువ్వు కడలివైతే – నండూరి సుందరీ నాగమణి
13. నాకు తెలుగు చేసింది – సత్యసాయి కొవ్వలి
14. జీవనవాహిని - మంథా భానుమతి
15. అగ్గిపెట్టెలో ఆరుగజాలు – మంథా భానుమతి
16. హాస్యామృతం - ఆర్.వి. ప్రభు
17. Snapshots – కె.బి.లక్ష్మీ
18. ఎగిరే పావురమా – కోసూరి ఉమాభారతి
19. వేదిక - కోసూరి ఉమాభారతి
20. ధర్మప్రభ - కొంపెల్ల రామకృష్ణ
21. తెలుగు కథ - శోభా పేరిందేవి
22. వృద్దాప్యం వరమా? శాపమా? – శోభా పేరిందేవి
23. కలికి కథలు – వెంపటి హేమ
24. అర్చన – అత్తలూరి విజయ
25. ఆవిరి – స్వాతికుమారి
26. ప్రమదాక్షరి కథామాలిక – 1
27. ప్రమదాక్షరి కథామాలిక – 2
28. ఒక పరి జననం – ఒక పరి మరణం - రామా చంద్రమౌళి
29. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు - రామా చంద్రమౌళి
30. స్ఫూర్తిప్రదాతలు – రామా చంద్రమౌళి
31. అంతిమం – రామా చంద్రమౌళి
32. ఏకాంత సమూహంలో – రామా చంద్రమౌళి
33. తమిరిశ జానకి మినీ కథలు – తమిరిశ జానకి
34. The Silent Stream – Tamirisa Janaki
35. ఊర్వశి – వారణాసి నాగలక్ష్మి
36. కదంబం – శ్రీనివాస భరద్వాజ్ కిషోర్
37. ఫేస్ బుక్ కార్టూన్స్ – రాజు, లేపాక్షి
38. చిగురాకు రెపరెపలు – మన్నెం శారద
39. మహారాజశ్రీ మామ్మగారు- మన్నెం శారద
40. మన్నెం శారద కథలు
41. అమృతవాహిని – సుజల గంటి
42. ప్రియే చారుశీలే – సుజల గంటి
43. మనసా ఎటులోర్తునో – సుజల గంటి
44. పునీతులు – సుజల గంటి
45. సప్తపది – సుజల గంటి
46. Into the Crowded Aloneness – Rama chandramouli
47. Nomadic Nights – Indira Babbellapati
48. అసమాన అనసూయ – వింజమూరి అనసూయాదేవి
49. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – శ్యామలాదేవి దశిక
50. “ అమెరి“కలకలం – వంగూరి చిట్టెన్ రాజు
51. కవిత్వంలో నేను – విన్నకోట రవిశంకర్
52. చెప్పుకుంటే కథలెన్నో – సి.హెచ్. కామేశ్వరి
53. Photo Frame
54. శ్రీచక్ర సంచారిణి – పోలంరాజు శారద
55. స్వర్ణకుటీరం - పోలంరాజు శారద
56. బంగారు కంచం – పోలంరాజు శారద
57. రెప్పపాటు ప్రయాణం – పోలంరాజు శారద
58. సంధ్యారాగం – పోలంరాజు శారద
59. సుందరకాండ – నాగజ్యోతి సుసర్ల
60. మహాభారతం – శ్రీనివాసరావు తాతా
61. ఎమ్మెస్వీ కథలు – ఎమ్మెస్వీ గంగరాజు
62. అనుబంధాల టెక్నాలజీ – లక్ష్మీ రాఘవ
63. స్వప్నసాకారం – వాలి హిరణ్మయిదేవి
64. మెదక్ ఆలయాలు – పి.ఎస్.ఎమ్.లక్ష్మీ
65. చిట్టి చిట్టి మిరియాలు – ఇంద్రాణి పాలపర్తి
66. ఇంటికి వచ్చిన వర్షం – ఇంద్రాణి పాలపర్తి
67. ఱ – ఇంద్రాణి పాలపర్తి

Friday, 23 September 2016

నట్టింటి నుంచి నెట్టింట్లోకి - నవతెలంగాణ

 

ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మరిచిపోయిందంట ఈగ. నేను కూడా అదే విధంగా చదువు, సంధ్య ఏమీ లేదు. నాకేమీ రాదు. భర్త, పిల్లలు, ఇల్లు ఇదే నా జీవితం. ఇంతకంటే ఏం చేయగలనులే అంటూ, అనుకుంటూ సాధారణంగా గడిపాను. కాని పదేళ్ల క్రితం మొదలుపెట్టి, క్రమంగా ఊహించని ఎన్నో మలుపులు తిరిగిన నా జీవితంలో నా పేరును ఎన్నో హంగులతో కనుగొనగలిగాను.
మరి నా ఈ జీవనపయనపు ముచ్చట్లను మరోసారి చదువుతారా??


 


Tuesday, 30 August 2016

జె.వి.పబ్లికేషన్స్ - వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా...





 మన జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు పరిచయమవుతారో, నమ్మకమైన, ఆత్మీయమైన స్నేహం ఎందుకు కలుగుతుందో అర్ధం కాదు. తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది..



2010 లో హైదరాబాదులో రెంఢవ మహిళా రచయితల సమావేశాలు జరిగాయి. నాకు తెలిసిన చాలామంది రచయిత్రులు పాల్గొంటున్నారు. వాళ్లతో పరిచయం లేకున్నా కనీసం చూడొచ్చు వాళ్లు మాట్లాడేది వినొచ్చు అన్న కుతూహలం ఉన్నా కూడా పాల్గొనలేదు.. అలాగే వంగూరి చిట్టెన్ రాజుగారు చాలా గొప్ప వ్యక్తి, తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు అమెరికాలో, మన దేశంలో కూడా నిర్వహిస్తున్నారని తెలుసు. కాని ఆయన నిర్వహించే సభలకు వెళ్లడానికి, వెళ్లి కూర్చోనే అర్హత నాకు లేదు. ఎందుకంటే అప్పటికి మాలిక పత్రిక మొదలెట్టలేదు, పబ్లిషింగ్ లేదు.. ఏదో మామూలు బ్లాగర్ ని మాత్రమే.. అని అనుకునేదాన్ని. కాని అదే చిట్టెన్ రాజుగారితో కలిసి వంగూరి ఫౌండేషన్ వారి పుస్తకాల ప్రచురణ చేయడం, మొన్నటి సభలో రాజుగారితో కలిసి మొదటి వరసలో కూర్చోవడం. ఒక పబ్లిషర్ గా స్టేజ్ మీద కూర్చోవడం... అంతా ఒక కలగా ఉండింది. ...



 ఎందరో మహా మహానుభావులు..... వారి సరసన చిన్ని పబ్లిషర్..






ఎడంపక్కనుంచి...గాయని సుచిత్ర, గాయకుడు రామకృష్ణ, భగీరధ్, ఖదీర్ బాబు, వంశీరామరాజు, వంగూరి, రావి కొండల రావు గారు, తనికెళ్ళ భరణి, ద్వానా శాస్త్రి, జ్యోతి వలబోజు, ఆవుల మంజులత గారు, తెన్నేటిసుధాదేవి గారు.

చిట్టెన్ రాజుగారి అమెరి'కలకలం' పుస్తకావిష్కరణ ..

కొసమెరుపు: ఆవిష్కరణ కాగానే ముగ్గురు వంద చొప్పున మూడు వందల పుస్తకాలు కొనేసారు. రేపు సెకండ్ ప్రింట్ కి ఇవ్వాలి.
పుస్తకం రిలీజ్ అయిన మరుసటిరోజే సెకండ్ ప్రింట్ అంటే హిట్ టాక్ అన్నట్టే కదా..

నిజంగా ఈ బుజ్జి పుస్తకం (కొన్ని మొబైల్ ఫోన్లకంటే చిన్నగా) భలే ముద్దుగా ఉంది. చేతిలో పట్టుకోవడానికి, జేబులో పెట్టుకోవడానికి, పర్సులో పడేసుకోవడానికి, ప్రయాణాలప్పుడు ఈజీగా ఓ ఐదారు నవళ్లు లేదా కథల పుస్తకాలు బాగులో వేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్టులుగా కాని , ఇంటికి వచ్చినవాళ్లకు ఊరికే అలా ఇవ్వడానికి బావుంది.. ఇది నా మాట కాదు. అతిధుల మాట.. మరి ఇంత మంచి క్వాలిటీతో అందంగా ఉన్న ఈ పుస్తకం వెల యాభై రూపాయిలే కదా. మంచి హోటల్ కి వెళితే కప్పు కాఫీ రాదు ఈ ధరలో....

కొనండి. కొనిపించండి.. కొని బహుమతిగా ఇవ్వండి. అందరికీ సంతోషంగా ఉంటుంది.

ఇదే స్ఫూర్తితో వందకంటే తక్కువ ఉంటే పుస్తకాలను ఇదే సైజులో వేయాలని నా ఆలోచన..

Thursday, 7 January 2016

విజయ ప్రస్థానం - జె.వి.పబ్లికేషన్స్



ఈ జీవితం చాలా విచిత్రమైంది. ఎన్నో ఆశలు, ఎన్నో మలుపులు, కష్టాలు, నష్టాలు, మిత్రులు, శత్రువులు.. కృంగిపోతే నామరూపాల్లేకుండా పోతాం. అదే నిలదొక్కుకుని, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడితే తప్పకుంఢా గెలుపు సొంతమవుతుంది. ఎంత సక్సెస్ సాధించినవారైనా, ఎంత గొప్పవారైనా వారికి విజయం అంత సులువుగా చేతికందదు. నిలబడదు. నిజాయితీగా, కష్టపడి సాధించినదాన్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు కాని అసాధ్యం కూడా కాదు..

అసలు నాకంటూ ఒక అస్తిత్వం ఏముందని నన్ను నేను ప్రశ్నించుకుని, నాకంటూ ఒక దారిని ఏర్పరుచుకుంటూ మధ్యలో కలిసి ఆత్మీయులైన మిత్రుల సాయంతో ముందుకు సాగుతున్నాను. అసలు కలలో కూడా ఊహించని పనులు చేయగలుగుతున్నాను అంటే ఇందులో నా ఒక్కదాని శ్రమ లేదు. ఎవరికైనా ముందుగా కావలసింది కుటుంబం నుండి సహకారం, ప్రోత్సాహం. అది నాకు పూర్తిగా లభించడం వల్లనే ఈనాడు ఇన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాను. మధ్య మధ్య ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అవి లైట్... వాటిని పక్కన పెట్టి ముందుకు సాగిపోవడమే.కొన్ని సమస్యలు లైట్ తీసుకుని మర్చిపోవడం కుదరదు. అలాంటప్పుడు వాటికి వీలైనంత తక్కువ ప్రాముఖ్యం ఇస్తే మనకే మంచిది అని నేనంటాను. నమ్ముతాను.. పాటిస్తున్నాను కూడా..
ఈ సోదంతా ఎందుకంటారా?? నాకూ ఒక కెరీర్ ఉండాలి, ఉండగలదు, ఉంటుంది అని అనుకోలేదెప్పుడు. డబ్బులకంటే పరిశ్రమించడమే పెట్టుబడి అని నమ్ముతూ జె.వి.పబ్లికేషన్స్ సంస్ధను రెండేళ్ల క్రితం ప్రారంభించాను. అది కూడా పూర్తిగా తెలుసుకుని కాదు. తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ఒక్కో పుస్తకం ప్రచురణ బాధ్యతలు సమర్ధవంతంగా పూర్తి చేయగలిగాను అని ధైర్యంగా చెప్పగలను. ఈ ప్రచురణ విషయాలన్నీ నేనే చూసుకొవడం వల్ల ప్రతీది పర్ఫెక్టుగా నాకు నచ్చి, రచయిత సంపూర్ణంగా ఇష్టపడేలా చేస్తున్నాను. నా జె.వి.పబ్లికేషన్స్ నుండి వరుసగా ఒకటి తర్వాత ఒక పుస్తకం చేయాలంటే ఒక టీమ్ వర్క్ ఉండాలి. డిటిపి ఆపరేటర్, కవర్ డిజైన్, ప్రింటర్, గ్రాఫిక్ డిజైనర్, రచయిత, నేను కలిసి పని చేస్తేనే పుస్తకం అనుకున్నట్టుగా, మంచి క్వాలిటీతో . తక్కువ సమయంలో, తక్కువ తప్పులతో తయారవుతుంది. ఈ విషయంలో జె.వి.పబ్లికేషన్స్ డిజైనర్ గా Ramakrishna Pukkallaగారు, డిటిపి ఆపరేటర్ Kothapally Ravi Prabhaగారు నాతో సమానంగా పరుగులు పెడుతూ, నాకు నచ్చినట్టుగా వర్క్ చేస్తున్నారు. వారి సాయం లేకుంటే ఇన్ని పుస్తకాలు చేయగలిగేదాన్ని కాదు. అలాగే కొన్ని పుస్తకాలకు ప్రముఖ ఆర్టిస్టులు చిత్రాలు కూడా తీసుకోవడం జరుగుతుంది.. ..


నన్ను అభిమానిస్తూ, అభినందిస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తున్న మిత్రులందరికీ... నా రచనలు, వంటలు, పుస్తకాలు, బుక్ ఫెయిర్, టీవీ షో లకు ఇంటినుండి పూర్తి సహకారాన్ని ఇస్తున్న మావారికి కూడా మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను..
శుభం భూయాత్.
మీ జ్యోతి వలబోజు...


ఈ క్రమంలో ఇప్పటివరకు అంటే జనవరి 2014 నుండి డిసెంబర్ 2015 వరకు జె.వి.పబ్లికేషన్స్ నుండి అచ్చైన 40 పుస్తకాలు ఇవి.. ఇంకా మూడు ప్రింట్ కి వెళ్లబోతున్నాయి..నన్ను నమ్మి తమ పుస్తకాల పని అఫ్పజెప్పిన Chitten Raju Vanguriగారికి, ఎందరో ప్రముఖ రచయితలు, రచయిత్రులకు ధన్యవాదాలు. నేను చేసిన పుస్తకాలన్నీ అందంగా, మంచి క్వాలిటీతో ఉన్నాయని ప్రశంసించారు.. షుక్రియా..

Books Published by J.V.Publications.

1. తెలంగాణ ఇంటివంటలు – వెజ్ – జ్యోతి వలబోజు
2. ఆకుపాట – శ్రీనివాస్ వాసుదేవ్
3. సాగర కెరటం - సి.ఉమాదేవి
4. కేర్ టేకర్
5. మాటే మంత్రము
6. అమ్మంటే..
7. మంచి మాట – మంచి బాట
8. ఏ కథలో ఏముందో.
9. సిరిసిల్ల రాజేశ్వరి కవితలు - రాజేశ్వరి
10. కదంబం – శ్రీనివాస భరద్వాజ కిషోర్
11. ఊర్వశి - వారణాసి నాగలక్ష్మీ
12. ప్రమదాక్షరి కథామాలిక
13. తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్ – జ్యోతి వలబోజు
14. ధర్మప్రభ – కొంపెల్ల రామకృష్ణ
15. అమూల్యం – నండూరి సుందరీ నాగమణి
16. హాస్యామృతం – ఆర్.వి.ప్రభు
17. నాకు తెలుగు చేసింది – సత్యసాయి కొవ్వలి
18. జీవన వాహిని – డా. మంథా భానుమతి
19. ఎగిరే పావురమా - ఉమాభారతి
20. ఫేస్ బుక్ కార్టూన్స్ – లేపాక్షి, రాజు
21. పాశుపతం – మంచాల శ్రీనివాసరావు
22. నీలి – ఆకుపచ్చ – డా.మధు చిత్తర్వు
23. మహాభారతం – తాతా శ్రీనివాసరావు
24. కలికి కథలు – వెంపటి హేమ
25. వృధాప్యం వరమా? శాపమా? – డా.శోభా పేరిందేవి
26,. తెలుగు కథ
27. స్పూర్తి ప్రదాతలు – రామా చంద్రమౌళి
28. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు
29. అంతిమం
30. ఒకపరి జననం –ఒకపరి మరణం
31. ఒక ఏకాంత సమూహంలోకి
32. చిగురాకు రెపరెపలు – మన్నెం శారద
33. అగ్గిపెట్టెలో ఆరుగజాలు – డా.మంథా భానుమతి
34. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు 2 – శ్యామల దశిక
35. అమృతవాహిని - సుజల గంటి
36. ప్రియే చారుశీలే
37. ప్రమదాక్షరి కథామాలిక – తరాలు అంతరాలు
38. అసమాన అనసూయ – వింజమూరి అనసూయాదేవి
39. అర్చన – అత్తలూరి విజయ
40. ఆవిరి – స్వాతి బండ్లమూడి

Thursday, 10 September 2015

మహాభారతము - తాతా శ్రీనివాసరావు




జె.వి.పబ్లికేషన్స్ నుండి రాబోతున్న తర్వాతి పుస్తకం మహాభారతం.




 బెంగాలీనుండి తెలుగులోకి అనువదింపబడిన ఈ పుస్తకంలో ఆదిపర్వం నుండి విరాట పర్వం వరకు సవివరంగా రాసారు శ్రీ తాతా శ్రీనివాసరావుగారు.
కవర్ డిజైన్: వాసు చెన్నుపల్లి Vasu Chennupalli
పేజీలు: 448
ధర: 200
కినిగెలో ఈ పుస్తకం ఉచితంగా లభిస్తుంది.. కాని ఇప్పుడే కాదు...

నీలీ - ఆకుపచ్చ (భూమికి పునరాగమనం)

జె.వి.పబ్లికేషన్స్ నుండి వస్తోన్న కొత్త సైన్స్ ఫిక్షన్ నవల

నీలీ - ఆకుపచ్చ
(భూమికి పునరాగమనం)


అంగారక యాత్ర ముగించుకుని హనీ ఆమ్రపాలి భూమికి తిరిగొచ్చాడు. అసలు కుజగ్రహానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒక కలని నిజం చేసుకోవాలని. ఎన్నో సంవత్సరాల నుంచి స్వప్నాలలో ప్రత్యక్షమై అతన్ని ఆకర్షించి, శాసించి కుజగ్రహానికి రప్పించుకుంది అందాలరాశి అయిన 'సయోనీ'. ఆమెపై మోజుతో అక్కడికి వెళ్ళిన హనీ భ్రమలు తొలగిపోతాయి, అరుణ భూముల చక్రవర్తి సమూరా చేతిలో బందీ అవుతాడు. కుజుడి మీద ఉన్న ఒలింపస్‌ శిఖరం మీద దాచబడి ఉన్న అమరత్వం ప్రసాదించే ఔషధాన్ని తెచ్చి తనకివ్వాలని ఒత్తిడి చేస్తాడు సమూరా. ఎలాగొలా దాన్ని తెచ్చిస్తాడు హనీ. ఆ తరువాత మానవ కాలనీకి, మాంత్రిక రాజ్యం అరుణ భూములకి మధ్య ఎప్పట్నించో ఉన్న వైరం అకస్మాత్తుగా యుద్ధ రూపంలోకి మారడంతో, హనీ ఆ యుద్ధంలో పాలుపంచుకుంటాడు. కుజగ్రహపు మాంత్రికుల వద్ద శిక్షణ పొంది విశ్వశక్తిని కరతలామలకం చేసుకుంటాడు హనీ. ఈ క్రమంలో తనలో జన్యుసంబంధమైన ప్రత్యేక శక్తి వుందని, అది తనకి పుట్టుకతోనే లభించిందని తెలుసుకుంటాడు. అమృత ఔషధం తాగితే శక్తులు నశిస్తాయన్న నిజాన్ని దాచిపెట్టి, సమూరా ఆ ఔషధాన్ని సేవించేలా చేస్తాడు హనీ. దాంతో విశ్వాన్ని జయించాలన్న తన ఆశయం నెరవేరకపోయేసరికి హనీ మీద పగ పడతాడు సమూరా. కుజుడి మీద మానవులకి, అరుణ భూముల పాలకులకి మధ్య సంధి కుదిర్చి, అరుణ భూములకు తన స్నేహితుడు మీరోస్‌ని ప్రభువుగా చేస్తాడు హనీ. కుజగ్రహంమీద మానవులు హనీని సత్కరిస్తారు.. కాని చివరికి వాళ్ళు కూడా హనీని అనుమానించి వెంటాడుతారు. గురుడి ఉపగ్రహం గ్వానిమెడ్‌ నుంచి వచ్చిన ఏనిమాయిడ్‌‌ని మానవ సైనికాధికారి జనరల్‌ గ్యానీ అశ్వశాలనుంచి రక్షించే క్రమంలో మానవులకీ శత్రువవుతాడు. ఎలాగొలా తప్పించుకుని భూమికి చేరుతాడు.
తిరిగొచ్చాకా, ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా తన ఉద్యోగంలో కొనసాగుతూంటాడు. అయినా గ్రహాంతర దుష్ట మాంత్రికులు అతనిని వెంటాడడం ఆపరు. అతని గదిలో దొంగతనం జరుగుతుంది, అతని జీవితమే ప్రమాదంలో పడుతుంది. గ్రహాంతర దుష్ట మాంత్రికులే కాకుండా, ఎర్త్ కౌన్సిల్ కూడా హనీ ఆమ్రపాలికి అడ్డు తగులుతూనే ఉంటుంది.. భూమి మీద విశ్వశక్తిని ప్రయోగించడం నిషేధించిన కారణంగా ఎర్త్ కౌన్సిల్ హనీని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది.

"కుజుడి కోసం" నవలకిది అద్భుతమైన కొనసాగింపు నీలీ - ఆకుపచ్చ... కథాస్థలం ఈసారి భూగ్రహం! హానీని వెంటాడి వేధించి పాపిష్టి పనులకు వాడుకోవాలని చూస్తారు కుజగ్రహపు దుష్ట మాంత్రికులు. అయితే ఇప్పుడు కూడా హనీదే గెలుపు..

చదవండి... మరో లోకాలకి తీసుకెళ్ళే ఈ సైన్స్ ఫిక్షన్‌ని!

డా. చిత్తర్వు మధుగారు రచించిన సైన్స్ ఫిక్షన్ నవల "కుజుడి కోసం"కి కొనసాగింపుగా వస్తోన్న కొత్త పుస్తకం... నీలీ – ఆకుపచ్చ నవల త్వరలో మీ ముందుకు రాబోతుంది.

Tuesday, 11 August 2015

పాశుపతం .. ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్





ఏకైక అగ్రదేశం అమెరికాను చక్రబంధంలో ఇరికించి, ప్రపంచశక్తిగా ఎదగాలని చైనా వేస్తున్న ఎత్తుగడలేంటి?
అమెరికాను దివాలా తీయించాలనుకుంటున్న దాని కొత్త ఫైనాన్సియల్ వెపన్ ఏంటీ?
ఆసియా, ఆఫ్రికా, యూరపులను ఏ రాజనీతితో ఎలా కలుపుతోంది? ఈ కొత్త ఎత్తుగడలకు అమెరికా దగ్గర ఉన్న సమాధానాలేంటి?
పనిలోపనిగా ఇండియా చుట్టూ చైనా జాగ్రత్తగా పేరుస్తున్న మిలిటరీ ట్రాప్ ఏంటి?
చిన్నా చితకా దేశాల్ని మిలిటరీ స్థావరాలుగా మార్చుకుంటున్న దాని స్ట్రాటజీ ఏంటి?
హిందూ మహాసముద్రం దాని యుద్ధవేదిక ఎలా కాబోతోంది?
ఈ చక్రవ్యూహాన్ని చేధించేందుకు ఇండియా రూపొందించుకున్న ఆయుధమేంటి?
రాజకీయ దిద్దుబాటు చర్యలేంటి?
ప్రధాని కాగానే నరేంధ్ర మోడి దేశాలన్నీ ఎందుకు చుట్టివస్తున్నారు?
చైనా, పాకిస్థాన్ గూఢచారులు హైదరాబాదులో ఎందుకు తిష్టవేశారు?
ఓ సాదాసీదా లేడీ డిటేక్టివ్ వాళ్లను ఎలా చిత్తు చేసింది?
................
అంతర్జాతీయ గూఢచర్యంపై వెలువడిన తొలి తెలుగు నవల ఇది.
కఠిన వాస్తవాలను వివరిస్తూ మిమ్మల్ని ఆలోచింపజేసే అసలైన స్పై థ్రిల్లర్ ఇది..

జె.వి.పబ్లికేషన్స్ నుండి వస్తున్న మరో ప్రచురణ... మంచాల శ్రీనివాసరావుగారు రచించిన “ పాశుపతం“.. త్వరలో మీముందుకు రాబోతోంది.


Wednesday, 5 August 2015

జె.వి.పబ్లికేషన్స్ నుండి నవ్వుల నజరానా “ ఫేస్‌బుక్ కార్టూన్లు”




అతివేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం  ప్రపంచంలోని నలుమూలలనున్న వారందరి మధ్య దూరాన్ని తగ్గించి ప్రతీక్షణం అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది అని అందరూ ఒప్పుకునే విషయమే.  అనుకున్న క్షణంలోనే వేలమైళ్ల దూరాన ఉన్నవారితో మాట్లాడవచ్చు. చూడవచ్చు, చర్చించవచ్చు. ఇలాటి దూరాన్ని మరింత దగ్గరగా చేసి, ఎందరినో కలిపిన ఒక అద్భుతమైన అంతర్జాల మాధ్యమం - ఫేస్‌బుక్.. ఈనాడు స్కూలు పిల్లలనడిగినా చెప్తారు ఫేస్‌బుక్ అంటే ఏంటో. అంతగా అలవాటుపడిపోయారందరూ. ఇప్పుడు కంప్యూటర్, లాప్టాప్ లో మాత్రమే కాకుండా మొబైల్, ఐపాడ్ వంటి చిన్న సాధనాలలో కూడా అంతర్జాలం ఉపయోగించుకోగలిగే సదుపాయం ఉండడంవల్ల  ఇంటి అడ్రస్ ,మెయిల్ అడ్రస్ లాగా ఫేస్‌బుక్ ఐడి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఆర్టిస్టులు, చిత్రకారులు, నటులు, కార్టూనిస్టులు, కళాకారులు... ఇలా అందరూ తమ తమ ఆసక్తి మేరకు ఫేస్‌బుక్ ని ఉపయోగించు కుంటున్నారు. సృజనాత్మకత ఉన్న కళాకారులకైతే  ఇది ఒక వరంలాంటిది అని చెప్పవచ్చును. తమ కళను తమదైన శైలిలో పదిమందితో పంచుకోవడం. వచ్చిన ప్రశంసలు, విమర్శలతో మరింత  మెరుగుపరచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం జరుగుతోంది.

అలాటి కోవలోకి వస్తారు  ప్రముఖ కార్టూనిస్టులు రాజుగారు, లేపాక్షిగారు. ప్రముఖులు అంటే ప్రపంచమంతా తెలిసిన పెద్దవారు, గొప్పవారు, టీవీలు, పేపర్లలో కనిపించేవారు అని కాదు. వారి కార్టూన్ల ద్వారా ఫేస్‌బుక్ లో సంచలనం సృష్టిస్తూ ప్రతీరోజూ వారి కార్టూన్లకోసం ఎదురుచూసేలా చేస్తున్నవారు, అందరి అభిమానాన్ని పొందినవారు  ప్రముఖులే కదా.. కార్టూనిస్టులుగా  వీరిద్దరూ కేవలం అందరినీ  నవ్వించడానికి ఏదో ఒక పిచ్చి కార్టూన్లు వేయడం కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా విభిన్నమైన అంశాలమీద తమదైన శైలిలో కార్టూన్లు వేసి నవ్విస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు. ఈ కార్టూనిస్టులు, వారిని వారి బొమ్మలను ఇష్టపడే వారందరూ కలుసుకునే ఒకే వేదిక  ఫేస్‌బుక్. మరి అదే ఫేస్‌బుక్ మీద వేసిన కార్టూన్లు ఇంకెంత సంచలనాన్ని సృష్టించి ఉండాలంటారు.  ఫేస్‌బుక్ ఒక వ్యసనంగా మార్చుకున్న వారందరికోసం, వారందరిమీద వేసిన ఫేస్‌బుక్ కార్టూన్లను ఒక దగ్గర చదవడం అందరికీ ఇష్టమే. ఒకరైతే సరి ఒకరికి మరొకరు కలిస్తే ఏముంది. ఢమాల్..

ఈ కార్టూనిస్టుల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పను. వారి బొమ్మలే వారిని పరిచయం చేస్తాయి. ఫేస్‌బుక్ మీద వారిద్దరూ వేసిన కార్టూన్లను ఒకే పుస్తకంగా చేసి అందరికీ నవ్వులు పంచాలనే ఆలోచన చేసింది జె.వి.పబ్లికేషన్స్. మా సంస్థ ద్వారా వస్తున్న మొదటి స్వంత పుస్తకం రాజు ఈఫూరిగారు, లేపాక్షి రెడ్డిగారు వేసిన ఫేస్‌బుక్ కార్టూన్ల పుస్తకం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
                     నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం..
                                                   ఇదే మా నవ్వుల నజరానా

అన్ని పుస్తకాలలాగా కాకుండా ఇద్దరు ఉద్ధంఢుల కార్టూన్లని ఒక వినూత్నమైన రీతిలో అందజేస్తున్నాం. Two in One అన్నట్టుగా ఒక వైపునుండి రాజుగారు, ఒక వైపునుండి లేపాక్షిగారు తమదైన కవర్, ప్రొఫైల్, కార్టూన్లతూ మిమ్మల్ని అలరించబోతున్నారు.. 





 నిన్ననే ప్రింటింగ్ కి వెళ్లిన ఫేస్‌బుక్ కార్టూన్ల పుస్తకానికి ఫేస్‌బుక్ మిత్రులకు  ముఖ్యంగా రాజుగారు, లేపాక్షిగారి మిత్రులందరికీ పబ్లిషర్ తరఫున నెలరోజులవరకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ కార్టూన్ల పుస్తకం ఖరీదు రూ.120. ప్రత్యేక ఆఫర్ గా  మీకు రూ 100 కే, పోస్టల్ చార్జెస్ లేకుండా మీ ఇంటికే పంపబడుతోంది... పుస్తకాలు కావలసినవాళ్లు ఎన్ని కాపీలు కావాలన్నది, మీ చిరునామా నా మెయిల్ అడ్రస్ కు పంపగలరు. పుస్తకం మార్కెట్లోకి రాకముందే మీ సొంతం చేసుకోండి మరి..
jyothivalaboju@gmail.com

జ్యోతి వలబోజు
CEO , జె.వి.పబ్లికేషన్స్

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008