Tuesday 5 November 2013

" చీర " సొగసు చూడ తరమా?





అసలే అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, చుక్కలన్నీ రాలి ఆమె చీర కొంగులో ఒదిగిపోగా, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా? చీర .. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. వనితను నిలువెల్లా కప్పి ఆమెను దాచిపెట్టి, పెట్టకుండా మరింత అందంగా చూపిస్తుంది. ఈరోజుల్లో అమ్మాయిలు మరీ మాడర్న్ ఐపోవడంతో చీర కట్టడం చాలా తగ్గించారు/ మానేసారు అని అంటారు కాని పెళ్ళిళ్లకు వెళ్లి చూడండి. రంగు రంగుల, తళుకు బెళుకుల చీర కట్టిన అమ్మాయిలతో కళకళలాడిపోతూ ఉంటుంది. నాడైనా, నేడైనా, భారతీయ వనితలకు మరింత వన్నె తెచ్చేది మేలైన చీర. ఎంత అభివృద్ధి చెందినా , ఎన్ని ఆధునిక వస్త్రధారణలైనా ఈ చీరకున్న గొప్పదనం చెక్కుచెదరనిది. అందుకే ఈ చీర అనే అంశం మీద పద్యాలు రాయమని అడగగానే వైవిధ్యమైన పద్యాలు అందించారు జె.కె.మోహనరావుగారు, ఆచార్య ఫణీంద్రగారు, డా.అనిల్ మాడుగులగారు, రవిగారు, టేకుమళ్ల వెంకట్ గారు. ఇక ఈ పద్యాలను విశ్లేషించి అందమైన వ్యాఖ్యానంతోపాటు తనవంతు పద్యాలను ఇచ్చారు బ్నింగారు. ఈ అంశం చీర కు తగినట్టుగా చిత్రాన్ని ఇచ్చారు ఉదయ్ కుమార్ గారు, పద్యాలను రాగయుక్తమైన శ్రవ్యకాలుగా మార్చి ఇచ్చారు పందిళ్ల శేఖర్ బాబుగారు. వీరందరికి మాలిక పత్రిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.


ఈ పద్యాలను విశ్లేషిస్తూ, సిస్తూ బ్నింగారికి చీర మీద ఇంకా ఇంకా పద్యాలు రాయాలనే కోరిక పుట్టింది. అది కూడా శతకం. ఆల్రెడీ పని మొదలెట్టారు. పద్యాలన్నింటిని పుస్తకంగా కూడా వేయిస్తున్నామన్నారు.. బ్నింగారు అభినందనలు.. మేము కూడా పుస్తకం కోసం వెయిటింగ్....


 మరి ఈ చీర సొగసు గురించి చదవండి మాలిక పత్రికలో  


  "చీర" సొగసు చూడ తరమా??

Sunday 3 November 2013

మాలిక పత్రిక నవంబర్ 2013 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head                                      


                              
                  అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు


ఎన్నో కొత్త కొత్త సీరియళ్లు, వ్యాసాలతో మాలిక పత్రిక మరింత మెరుగ్గా మీ ముందుకు వచ్చింది.ఈ వ్యాసాలు మీకు నచ్చుతాయనుకుంటున్నాము. మాలిక పత్రికకు ఎవరైనా తమ రచనలు పంపించవచ్చు. వీలువెంబడి తప్పకుండా ప్రచురిస్తాము. ఇక ఈసారి ఒక ప్రత్యేకమైన వ్యాసం మీకోసం .. "చీర - సొగసు చూడ తరమా " అనే టాపిక్ మీద కొందరు మిత్రుల నుండి పద్యాలను సేకరించి, వాటిని విశ్లేషించి, పద్యాల శ్రవ్యకాలు చేయించి, అందమైన చిత్రంతో మీకు సమర్పిస్తున్నాము. చదవి మీ అభిప్రాయము తెలియజేయగలరు.. ఈ ప్రయోగానికి తమవంతు సహాయాన్ని అందించినవారందరికీ కృతజ్ఞతలు.

 మీ రచనలు పంపవలసిన చిరునామా : editor@maalika.org

ఇక ఈ నెల మాలిక పత్రిక విశేషాలు..


1. దీపావళి పండగ అనే కాదు పండగలు గురించి సంపాదకీయం
పండగోయ్ పండగ



2.  చీర మీద ఎన్ని పద్యాలో. మీరు కూడా ఓ లుక్కేయండి.. ప్రత్యేక వ్యాసం

చీర సొగసు చూడ తరమా?



3. బాధల బందీ ఐన మనసు వేదన

ఇంకా నేను బతికే వున్నాను 



4.  కొత్తగా మొదలవుతున్న  మెడికల్, సైంటిఫిక్ సీరియల్.

Gausips 1



5. శ్రీమతి అంగులూరి అంజనాదేవిగారి కొత్త సీరియల్ ప్రారంభమవుతుంది.కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్ధితులు అనుకూలించకపోయినా కష్టాలు వచ్చినా భయపడకుండా " నాకింకా మంచి భవిష్యత్తు  ఉంది" అని ముందడుగు వేయాలని లక్ష్యాన్వేష్, దేదీప్య పాత్రల ద్వారా చెప్తున్నారు రచయిత్రి..

మౌనరాగం - 1


6. తెలుగు సినీ ప్రపంచంలోని మహానీయుల గురించి తన అనుభవాలతో కూడిన పరిచయాలను అందిస్తున్నారు ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు. ఈసారి వెన్నెలకంటి గారి గురించి ఏం చెప్తున్నారో మరి..
సరిగమలు - గలగలలు -2


7.  ప్రధానమంత్రి మీద హత్యాప్రయత్నం జరగబోతుందని కలగన్న దిశ ఈ విషయాన్ని అయన వరకు చేర్చడానికి ఎలా ప్రయత్నిస్తుందో సూర్యదేవర రామ్మోహనరావుగారి సంభవం సీరియల్ లో తెలుసుకోండి..

సంభవం -6


8. మీకు ఘజల్స్ అంటే ఇష్టమా?  మరి అబ్దుల్ వాహెద్ గారు ఈ నెలనుండి  ప్రారంభించిన సీరియల్ తప్పకుండా చదవండి. ముందుగా హిందీ కవి షకీల్ బదాయుని గారి గురించి తెలుసుకుందాం.

చిక్కని జ్ఞాపకం - షకీల్ బదాయుని



9.  కొన్ని నెలలుగా మాలికలో వస్తున్న పారశీక చందస్సు గురించి మీరు చదువుతూనే ఉన్నారుగా.. ఈసారి మన్నాడె గురించిన  పాటల గురించి ప్రస్తావిస్తున్నారు జె.కె.మోహనరావుగారు.

ఐ మేరే ప్యారే వతన్ - పారశీక చందస్సు - 6



10.  బ్నింగారి ఆడియోకధలు వింటున్నారా. ఎలా ఉన్నాయి.. ఈసారి ఒక బర్నింగ్ సబ్జెక్ట్ గురించిన కధను చదవండి అంతేకాదు ఆ కధ యొక్క వీడియోని కూడా చూడొచ్చు..

బ్నిం ఆడియో కధలు - 4



11.  సారంగ వారు ప్రచురించిన అనువాద నవల సూఫీ చెప్పిన కధ గురించిన సమీక్ష

'అక్షర పదచిత్రాల మెటాఫర్ మళయాళ' జాలం



12.  పాకిస్తాన్ జైలులో ఉన్న తన తండ్రిని కలుసుకుని , బయటకు తీసుకురావడానికి ప్రనూషతో వెళ్లిన ప్రముఖ నటుడు చైతన్య ఎంతవరకు సఫలీకృతుడయ్యాడో  యండమూరిగారి "అతడే  ఆమె సైన్యం" నవలలోని  ఈ భాగంలో చదవండి.

అతడే ఆమె సైన్యం - 5



13.  జయదేవ్ గారు దీపావళి కార్టూన్లతో మోత మోగించారో, నవ్వుల దీపాలు వెలిగించారో మీరే చూడండి.

జయదేవ్ గీతపదులు -  4



14.  మంధా నానుమతి

భానుమతిగారు సాహిత్యకధలను పరిచయం చేస్తున్నారుగా. ఈసారి విక్రమార్కుని విజయం గురించిన గాధ చెప్తున్నారు.

విక్రమార్కుని విజయం


15.  గతనెలలో ప్రారంభమైన లేఖాంతరంగంలో సరళ రాసిన ఉత్తరానికి సరోజ ఏమంటుందో మరి ఈ భాగంలో చూద్దాం..

లేఖాంతరంగం - 2



16. హిందూ పురాణాలలోనూ, రామాయణ మహాభారతాలలో కనబడే కొన్ని అభూతకల్పనల మీద ఒక satire. గురించి చెప్తున్నారు రవి..

ధూర్తాఖ్యానం 



17.  ఉత్తమ కధగా బహుమతి పొందిన ఒక కధ గురించి  సమగ్రంగా చర్చిస్తున్నారు చిత్ర (రామారావు) గారు.

ఉప్పెక్కడ తీపి


18. కొత్తపల్లి రాముగారు కొన్ని నీతిపద్యాల గురించి వివరిస్తున్నారు.

విద్యా వినితో రాజా హి ప్రజానాం వినయేరత

 






Saturday 2 November 2013

"చీర" సొగసు చూడ తరమా??



పండగ సీజన్.. కొత్త బట్టలు.. ఇక ఆడవాళ్లు అంటే కొత్త చీరలు. అదేంటోగాని ఈ ఆడాళ్లకు ఎన్ని చీరలున్నా మళ్లీ ఇంకోటి కొనాలనిపిస్తుంది. పండగలకు, పబ్బాలకు మాత్రమే కాదు ఉత్తుత్తిగా కూడా చీరలు కొనేస్తుంటారు. మగవాళ్లకు లేని ఛాయిస్ లేడీస్ కు ఉంది.. కాదనగలరా?? పెద్ద పండగలకు ఒకరకం చీరలు, చిన్న పండగలకు మరో రకం. బర్త్ డేలకు వేరే, బారసాలకు వేరే, ఇంట్లో ఐతే వేరే, హోటల్ లో ఐతే వేరే, చుట్టాలింట్లో ఐతే ఒకరకం. ఫ్రెండ్స్ ఇంట్లో ఐతే ఒక రకం. మామూలుగా మధ్యతరగతి వాళ్లింటికి వెళ్తే ఒక రకం, హై క్లాస్ వాళ్లింటికి వెళ్తే వేరే రకం.. ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకం, మార్కెట్టుకు, సూపర్ మార్కెట్టుకు వెళ్లినప్పుడు మరో రకం..... ఏ అవసరం లేకున్నా చీరలు కొనాల్సిందే.. షాపుల్లో కొనేదే కాక, ఇంటికి వచ్చి ఇన్‌స్టాల్మెంట్ లో అమ్మే చీరలు వేరే.. వయసు ప్రకారం కొనే చీరలు కూడా వేర్వేరుగా ఉంటాయండోయ్..ఇలా ఇన్ని సందర్భాలకుగాను కొనే చీరలు నచ్చడం అంత వీజీ కాదు. చీర డిజైన్ నచ్చితే రంగు నచ్చదు లేదా అంచు కుదరలేదనిపిస్తుంది. అన్నీ కుదిరితే బట్ట అంత నాణ్యంగా అనిపించదు. అది కూడా కుదిరితే ధర దగ్గర బేరం కుదరదు. ఇలా అన్నీ పర్ఫెక్టుగా కుదిరితేగాని ఒక చీర ఎంపిక పూర్తికాదు మరి. మగాళ్లకు ఈ విషయం అర్ధం కాదు. వాళ్లకు సొంతంగా వెతికే ఓపిక ఉండదు. వెతుక్కుంటున్న భార్య వెంట ఉండడానికి అస్సలు ఓపిక ఉండదు. అందుకే ఆడాళ్ల షాపింగుల మీద జోకులేస్తారు, కార్టూన్లేస్తారు. ఏమంటారు??? సరేగాని ఈ చీరల సోది ఎందుకని అనుకుంటున్నారు కదా.. ఎక్కడ చూసినా కళకళలాడిపోతుంటేనూ... లేడీస్ అందరూ చీర షాపింగ్ అని తెగ బిజీగా తిరిగేస్తుంటేూ...... 



అసలే అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా?
 
చీర భారతీయ సంప్రదాయ వస్త్రాలంకరణ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవింపబడి, ప్రశంసించబడుతుంది. చీర కట్టిన ఇంతి ఒకచోట గౌరవంగా నమస్కరించాలనిపిస్తే మరొకచోట మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చీర స్త్రీని పూర్తిగా కప్పేసినా ఆమె అందాన్ని కనిపించీ, కనిపించక దాస్తూ,  చూపిస్తుంది. అందుకే ఇది పాతకాలపు ముసలమ్మ కట్టే ఆరు గజాల చీర మాత్రమే  కాదు చాలా "sexy outfit అని కూడా పేరుపొందింది. కాదంటారా? చీరలంటే ఆడవాళ్లకు ఉన్న మోజు అంతా ఇంతా కాదు. వేర్వేరు సంధర్భాలకొఱకు తీరైన చీరలు కొనడం అంటే మహా ఇష్టం వాళ్లకు. ఎన్ని మాడర్న్ డ్రెస్సులు వచ్చినా ఈ చీరకు సాటి రావుగా.. రోజంతా జీన్సులు, పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా పండగలు, పెళ్ళిళ్లు, శుభకార్యాలలో అమ్మాయిలు కూడ సంప్రదాయకంగా చీరలోనే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నాడైనా, నేడైనా "చీర" సొగసు చూడ తరమా?

ఇదే చీర అనే టాపిక్ మీద మాలిక పత్రిక ఒక వినూత్నమైన ప్రయోగం తలపెట్టింది. (ఇలాంటి ప్రయోగం ఇది రెండోసారి. మొదటిది కవిత్వంలో ఏకాంతం). కాని ఈసారి  ఈ ప్రయోగం పద్యాలతో.. చీర మీద మీకు నచ్చినట్టుగా పద్యాలు రాయమని అడుగగా  టేకుమళ్ల వెంకట్, జె.కె.మోహనరావు, అనిల్ మాడుగుల, రవి Env, ఆచార్య ఫణీంద్రగార్లను అడగగా వారు వెంటనే స్పందించి ఎన్నో విభిన్నమైన అంశాలతో చీరను ముడివేసి పద్యాలు రాసి ఇచ్చారు. సరే పద్యాలు వచ్చేసాయి. తర్వాత సంగతేంటి? ఈ పద్యాలను విశ్లేషించమని ప్రముఖ రచయిత, కార్టూనిస్ట్  బ్నిం గారిని కోరగా వాయెస్ అన్నారు. తన వంతు పద్యాలు కూడా రాసారు. చిత్రకారులు ఉదయ్ కుమార్‌గారు ఈ టాపిక్ కి తగ్గట్టుగా మరింత అందమైన చిత్రం ఇవ్వగా. పందిళ్ల  శేఖర్‌బాబుగారు పద్యాలను రాగయుక్తంగా స్వరపరిచారు.

మరి ఇన్ని విశేషాలతో తయారైన ఈ పద్యనీరాజనాన్ని చదవాలంటే  రేపటివరకు ఆగాల్సిందే .. మరో విషయం. ఈ పద్యాలను విశ్లేషిస్తుండగా మరో అద్భుతమైన ఆలోచనకు రూపకల్పన చేయడం జరిగింది. దాని గురించి బ్నిం గారే చెప్తారు.. 

http://magazine.maalika.org


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008