ఏడువారాల నగలు ..
పూర్వం రాజకుటుంబానికి చెందిన , మిక్కిలి ధనవంతులైన స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. అవి వారి ఆడంబర ప్రదర్శనకు, గ్రహాల అనుగ్రహమునకు సరిపోయే విధంగా చేయించుకునేవారు. అంటే రోజు కొక గ్రహాన్ననుసరించి ఒకో రకమైన రత్నాభరణాలు ధరించేవారు . వివిధ ఆభరణాలలో జాతి రత్నాలు పరీక్షించి మరీ పొదిగి అద్భుతమైన నగలు తయారు చేసేవారు .అనంతరం నియమ నిష్టలతో పూజలు జరిపి వాటిని శక్తిమంతం చేసి రోజుకో నగ ధరించేవారు. వారంలో ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా చెప్పబడుతుంది. ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నాలతో చేసిన ఆభరణములు ధరిస్తే శుభప్రదం అని అనాదిగా నమ్ముతున్నారు .
రవివారం
ఆదివారం నాడు అధిపతి సూర్యుడు. ఈ రోజు సూర్యుని రంగులో ఉండే కెంపులు పొదిగిన ఆభరణాలు ధరించి , లేత ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించి, తమ కుటుంబమును రక్షించమని సూర్యదేవుని ప్రార్ధిస్తారు
సోమవారం
సోమవారం నాడు అధిపతి చంద్రుడు. ఈ రోజు చంద్రుడి రంగులో ఉండే ముత్యాలు పొదిగిన ఆభరణములు ధరించి చంద్రవర్ణంలో (తెలుపు) ఉండే దుస్తులు ధరించి మానసిక ఆరోగ్యాన్ని, ప్రశాంత జీవనాన్ని కలిగించమని చంద్రుణ్ణి ప్రార్ధిస్తారు.
మంగళవారం
మంగళవారం నాడు అధిపతి అంగారకుడు . ఈ రోజు స్త్రీలు అంగారకుని రంగులో ఉండే పగడపు రంగు వస్త్రాలు ధరించి పగడాలతో చేసిన ఆభరణములతో అలంకరించుకుని శక్తిని ,సౌఖ్యాన్ని ప్రసాదించి , రుణబాధలు లేకుండా చేయమని కుజుడిని ప్రార్దిస్తారు.
బుధవారం
బుధవారం నాడు అధిపతి బుధుడు . ఈ రోజు స్త్రీలు ఆకుపచ్చగా, బుధుడి రంగులో ఉండే ఆకుపచ్చని దుస్తులు ధరించి మరకతం ( పచ్చలు)తో చేసిన ఆభరణములు ధరించి మేధోశక్తిని పెంపొందించి, బుద్ధిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇవ్వమని బుధుడిని వేడుకుంటారు .
గురువారం
గురువారం నాడు అధిపతి గురువు. అతని రంగులో ఉండే లేత పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి కనక పుష్యరాగాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్త్రీలు సంపద, సచ్చీలం పెంపొందాలని గురుడిని ప్రార్దిస్తారు.
శుక్రవారం
శుక్రవారం నాడు అధిపతి శుక్రుడు . ఇతని అనుగ్రహం కోసం తెల్లని రంగులో ఉండే దుస్తులు ధరించి తెల్లని వజ్రాలు పొదిగిన ఆభరణములు ధరించిన స్త్రీలు తమ కుటుంబ జీవనం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని , దాంపత్యం కలకాలం సుఖశాంతులతో వర్దిల్లాలని శుక్రుడిని ప్రార్దిస్తారు .
శనివారం
శనివారం నాడు అధిపతి శని . అతడి శరీరవర్ణమైన నీలం రంగు దుస్తులు ధరించి , నీలంతో చేసిన ఆభరణములు ధరించి తమకు పీడలు , బాధలు లేకుండా చేయమని శనీశ్వరుడిని ప్రార్దిస్తారు.
స్త్రీలు ఇలా గ్రహాలకు సంబంధించిన పూజలు చేసి, తదనుసార జాతి రత్నాభరణములు ధరించడంలో ఆంతర్యం కుటుంబ శ్రేయస్సు మాత్రమే. మనం ధరించే నవరత్నాలు సహజసిద్ధమైనవి ఐతేనే మనకు సరియైన ఫలితం చెకూరుతుంది . ఏడు వారాల నగల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతిష నిపుణులు , రత్న శాస్త్ర నిపుణులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నమ్మకమైన దుకాణములో కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం.
కనీసం ఆరు గ్రహాల స్థితైనా తమ జాతకంలో బావున్నవారు మాత్రమే ఇలా ఏడు రకాల రత్నాలతో ఆభరణాలు తయారుచేయించుకుని ధరించవచ్చు.అలా కాని పక్షంలో మనం కోరుకునే శాంతిసౌభాగ్యాల్ని అవి ప్రసాదించలేకపోవచ్చు. ఉదాహరణకు తమ జాతకంలో కుజస్థితి బాగాలేని స్త్రీలు పగడాలు పొదిగిన నగలు ధరించడం వల్ల వారి భర్తలకు అరిష్టం. లేదా భూమి తగాదాలూ, ఋతుబాధలూ తీవ్రతరమౌతాయి. అలాగే శుక్రుడు యోగించని స్త్రీలు వజ్రాభరణాలు ధరించడం వల్ల దాంపత్యసౌఖ్యలోపం, వ్యభిచార భావాలు, భర్తతో గొడవలు, విడాకులు, సాటి స్త్రీల మూలంగా అశాంతి, వాహనప్రమాదాలు, పొట్టలో ఇబ్బందులు సంప్రాప్తమౌతాయి. జాతకంలో సరిపడని గ్రహాల రత్నాలని ఉంగరంలో పొదిగించి ధరించే పురుషులకు సైతం ఇదే ఫలితం.
24 వ్యాఖ్యలు:
బాగుందండీ. ఏడువారాలనగలని వినడమే కాని ఈవివరాలు ఇప్పుడే తెలిసాయి. నమ్మకాలమాట ఎలా వున్నా ఆసక్తికరమైన విషయం.
జ్యోతి గారు, నాకూ ఇప్పటివరకు ఏడువారాల నగల గురించి వినడమే కానీ ఇంత వివరంగా తెలీదండి.. నేనింకా ఒకరోజు కాసులపేరు, ఇంకో రోజు చంద్రహారం లాంటివి అనుకున్నా! మీ టపా, అందులోని నగల సెట్స్ అన్నీ సూపర్ :)
చాలా బావుందండీ. ఒక్కటే ఇబ్బంది. మా ఆవిడ ఈ బ్లాగు చూడకుండా వుండాలి.
ఏమ్మా .. మేమిట్లా బతికుండటం ఇష్టం లేదా?
రవి గారన్నది కరక్టు. ఆ ఈనాడు వాడి పుణ్యమా అని మీ బ్లాగు మా ఆవిడకి మొన్నే తెలిసింది. మళ్ళీ మీ బ్లాగు అడ్రస్సు మార్చెయ్యరూ :-)
ఓహో, భలే ఉంది - పీడలు, బాధలు నుండీ ముక్తి,, ఋణబాధలు నుండీ విముక్తి, బుద్ధిని సద్వినియోగం చేసుకోడం, ప్రశాంత జీవనం, సుఖమయ దాంపత్య జీవనం, కుటుంబాన్ని రక్షించుకోటం - ఆశయాలు భలే ఉన్నాయి. ఆ ఆశయాలు నెరవేరాలంటే - ఎంచక్కా ఈ నగలు వదులుకొంటే సరిపోతుందిగా, ఏమంటావక్కా? :)
ఈ ఏడువారాల నగల నుంచి మా ఆవిడ దృష్టి మరలించటానికి,దారి మళ్ళించడానికి మూడు డీవిడిలు మొత్తం తొమ్మిది సినిమాలు వరుసనె చూసిబతకాల్సి వచ్చింది.ఇంత తీవ్రమైన టపాను వదిలేముందు కనీసం మూడు నెలలనోటీసు ఇస్తే తప్ప నా లాంటి బడుగుజీవులు తట్టుకోవటం కష్టం.
ఏడువారాల నగలు అనగా ఏడు ఏళ్ళు నలభైతొమ్మిది నగల గురించి చెప్తారనుకుని బీపీతెచ్చుకున్న నాకు కాస్త ఉపశమనం ఇచ్చినందుకు థాంక్స్.అంటె ఏడువారాల నగలు ఇచ్చిన జర్కు సామాన్యమైనదని నా భావన కాదు.కాకపోతే మా ఆవిడతో పాటు బ్లాగులు చదివే అవకాశం మాత్రం పోయింది జ్యోతి గారు.
త్వరలో నిషిగంధ గారి స్వంత ఏడువారాల నగలు చూడగలరు కొందరు,
పప్పు నాగరాజు గారికి నా భేషరతు మద్దతు
అయ్యో పాపం.. ఐనా మీ ఆడాళ్ళు ఆ నగలు వేసుకునేదీ మీకోసం, కుటుంబం కోసమే కదా!! కాని ఈ సెంటిమెంట్ మగాళ్ళకి గండం కదా.. చివర్లో ఇచ్చిన హెచ్చరిక చదవించండి. మేలు కలుగుతుంది.
అసలు నాకు కూడా ఏడువారాల నగలు అని వినడమే కాని వివరాలు తెలీదు. చాలా డిజైన్ల నగలేమో , రోజూ వేరు వేరుగా ధరిస్తారేమో అనుకునేదాన్ని. కాని వంశీమాగంటి గారు తమ బ్లాగులో ఏడువారాల నగల గురించి అడిగినప్పుడు, కొన్ని జ్యోతిష్య పుస్తకాలు(మావారివి)లలో తెలుసుకుని, జాలంలో కూడా తిరిగి ఈ వివరాలు సరైనవే అని నిర్ధారించుకుని బ్లాగులో రాసేముందు మన తాడేపల్లిగారికి చూపించి పబ్లిష్ చేసాను.
ముఖ్య గమనిక : వారం రోజుల వరకు ఈ టపా ఎత్తేయను...
ఏడువారాల నగలంటే తెలుసు గానీ వాటి విశిష్టత,ఎందుకు వేసుకుంటారని తెలియదు.చాలా విషయాలు తెలియచెప్పారు.నెనర్లు.
మగ బ్లాగర్లందరికీ ఒక విషయం చెప్పలనుకుంటున్నాను.నిజానికి తెలివయిన మగాడు/భర్త తన భార్యకు నగలు కొనడానికి బాధ పడడు.ఎందుకంటే బంగారం ధరలు రోజు రోజు కీ పెరుగుతాయి తప్పించి కుప్పకూలిపోవడం వుండదు.ఇది ఒక గొప్ప పెట్టుబడి మార్గం.భార్యను సంతోష పెట్టినట్టుంటుంది.అలాగే తన డబ్బు బంగారం రూపంలో పెరుగుతూనే వుంటుంది.
మావారు ఒక రకం గా అదృష్టవంతులు.ఎందుకంటే నేనసలు నగలు అడగనుగా.మరో రకం గా దురదృష్ట వంతులు.ఎందుకంటే ధర తక్కువ గా వున్నంత కాలం ఏమీ మాట్లాడలేదు. రేపెప్పుడో బుద్ది పుట్టి ఇన్నాళ్ళూ ఎలాగూ కొనలేదు ఇప్పుడయినా కొనండి అని అడిగాననుకోండి... ..
జ్యోతి గారూ..బావుంది మీ టపా...మీరు శోధించి రాసిన ఈ అందమయిన టపాకు ఋణశేషంగా ఏడువారాల నగల గురించి నేను సేకరిస్తున్న మరి కొన్ని ఇతర విశేష వివరాలు తీరిక వెంబడి పంపిస్తాను...
ఆడవాళ్ళు నగలు ధరిస్తే భర్తలకు ఒరిగేదేమీ లేదు. అలాగని తరిగేదీ ఏమీ లేదు. స్త్రీ తనని తాను అలంకరించుకోవడం భర్తను ఆకర్షించి సంతానాన్ని పొందడానికి ఒక సాధనంగా మనువు తన ధర్మశాస్త్రంలో వర్ణించాడు. అంతకంటె ఆయనక్కూడా అందులో పరమార్థమేమీ గోచరించలేదు. ఈ రోజుల్లో స్త్రీల సౌభాగ్యం భర్తతో ముడిపడినది కాదు. భర్త చనిపోయినా ఇప్పుడు భారతీయ నారీమణులు అలంకరించుకుంటూనే ఉన్నారు. బంగారం ఒక ఆస్తి అనడంలో సందేహం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కాని అవసరంలో కాస్త అప్పుపుట్టే అవకాశం ఉంది.
ఒక మనిషి దగ్గర ఏడు వారాల నగలు ఉండడం ఒక సామాజిక హోదాని తెలియజేస్తుంది. అయితే ఏ రాయి పడితే ఆ రాయిని ఎవరు పడితే వాళ్ళు ధరించడంలో ఉన్న ప్రమాదాలు అనుభవైక వేద్యం.
టపా చాలా బాగుంది. ఎందుకీ ఇంత గోల. ఫ్యాన్సీ షాప్ లో ట్రై చేయండి. వందకి ౩ సెట్స్ వస్తాయి.
chala bagundi
7 varala nagalu gurinchi stories lo chadivanu.. ippudu chusanu ...Thx Jyothi Garu
అమ్మా! జ్యోతిగారూ!
ఏడు వారారాల నగలు మీరేర్పడంగ
చూపి ధరియించు విధమును చూపినారు.
నేను వ్రాసిన వ్రాతకు ప్రాణమిచ్చి
నట్టులున్నది మీ బ్లాగు నయతనొప్పి.
ధన్యవాదములు.
హలో జ్యోతిగారూ,,నేను మీకు కొత్త కాని మీరు నాకు కాదు..మీ ప్రతి రచనని మొదటినుండి చదువుతున్నాను..సాక్షి న్యూస్ పేపర్ లో మీ వంటకాలు కూడా...అన్నిటిలోకి ఏడువారాల నగలు...చాలా అందంగా వున్నాయి,ఎప్పుడో మా నాన్నమ్మగారి దగ్గర వుండేవట....వినడమే కాని మాకు తెలియవు...సౌశీల్య ద్రౌపది గురించి చాలా బాగా వ్రాసారండి....రియల్లీ ఐ అప్ప్రిషియేట్ యు..
రుక్మిణిగారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు..
eduvaaraala nagalu ante emito ippude thelusukunnaanu . thanks
Vamsi Garu,
I have seen your comments, that you have some additional details about yedu varala nagalu. its really appreciate if you share with me.
Thanks a lot
Gowre
bagunnai..o sari maa variki ee post chupinchaali :P:)
USA vachina 4 yrs lo modati saari nenu telugu chadivaanu.Andulo meeru vivarinchina Yedu Vaarala Nagalu venuka daagi unna ardham chaala bagundi. Ee blog nenu thappakunda maa vaariki chupisthanu :P :)
wow , its really great to know about each day and each stone . Thanks andi for giving such lovely description/information on these things
Hai,
i am new to this site. very intresting. give me some more comments for eduvarala nagalu.
Hmm..really informative
Post a Comment