పుణుకులు
1.
రాజు దగ్గర ఒక చిలుక ఉంది కాని అది ఎప్పుడు మంచి మాటలు మాట్లాడదు. అన్నీ పోకిరి మాటలే.ఒక రోజు రాజు వాళ్ళ బాస్ ని భోజనానికి పిలిచాడు. ఈ చిలుక మాటలు బాస్‌కి కోపమొస్తుందని, తన స్నేహితుడు శర్మ దగ్గరున్న రెండు చిలుకలు తీసుకొద్దామని వెళ్ళాడు. ఆ చిలుకలు ఎంచక్కా సూక్తులు, భక్తి గీతాలు పాడుతూ ఉంటాయి. ఆ చిలుకలున్న పంజరం తెచ్చి తన ఇంట్లో చిలుక ఉన్న పంజరం పక్కనే పెట్టాడు. అప్పుడు ఆ రెండు చిలకలు అనుకున్నాయి : మనము ఇప్పటికి సరైన చోటికి వచ్చాము. ఇక భక్తిగీతాలు, సూక్తులు పాడవలసిన పని లేదు" ఎందుకలా అన్నాయి. ఎందుకంటే రాజు దగ్గరున్నది ఆడ చిలుక, ఆ వచ్చినవి రెండు మగచిలుకలు. అదీ సంగతి.
2.
కిషోర్ తన మిత్రుడు రమేష్ ఇంటికి వచ్చాడు.
" ఏంట్రా రమేష్! అలా దిగాలుగా కూర్చున్నావ్?"
" ఏం చేయనురా? నాకో పెద్ద చిక్కొచ్చి పడింది"
" నీకేంట్రా? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడివి. హాయిగా ఉండక"
" అక్కడే వచ్చింది చిక్కంతా. ఒకరు వెజిటేరియన్, మరొకరు నాన్ వెజిటేరియన్."
" ఇంకేంటి మరి హాయిగా ఎంజాయ్ చేయక"
" ఎంజాయా! పాడా! రోజు ఒకరికి వెజ్, మరొకరికి నాన్ వెజ్ వంటలు చేయలేక చచ్చిపోతున్నాను "
3.
మనకు ఎన్నో పండగలు ఉన్నాయి. దసరాకి కొత్త బట్టలు, దీపావళికి టపాసులు, ఉగాదికి పచ్చడి, బొబ్బట్లు, సంక్రాంతికి అరిసెలు , చక్కిలాలు అలా. కాని ఒక పండగ మాత్రం తాళం చెవులకు సంబంధించింది. అదేంటి???
9 వ్యాఖ్యలు:
తాళంచెవులా.....? చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీస్తాము కాబట్టి వినాయకచవితేమో అని అనుకుంటున్నా. సరైనదో కాదో మీరే చెప్పాలి.
అన్ని పండగలూ తాళం చెవులకి సంబంధించినవే .. బొక్కసం తెరవక పోతే పండగే లేదుగా :-)
పై రెండు సమాధానాలు సరి కావు. కొత్తపాళిగారు, ఏ పని చేయాలన్నా బొక్కసం తెరవాల్సిందే కదా. మరి కాస్త ఆలోచించండి..
రాఖీ పండగ. అందులో కీ ఉందా లేదా??
nenu sri rama navami anukunnaanu.emdukamTea bhajanalu ceastuu taalam cevulu vaayistaarugaa.
రాధిక
సిటీలో అలా భజన చేయరుగా మరి..
అన్యాయమండీ, మునక్కాడల్లో కర్రలూ, రాఖీలో తాళంచెవులూ...
జ్యోతి గారు రాఖీ అంత ఆమోదయోగ్యంగా లేదు. మనం కీ అంటాం కాని ఖీ అనం కదా.....
తెరెసాగారు,
నా సంగతి మీకు తెలుసుగా ఏది తిన్నగా చెప్పను, సులువుగానే ఉంటాయి కాని ఎక్కడో చిన్న మెలిక ఉంటుంది.
వరూధినిగారు,
నిజమే. రాయడంలో రాఖీ అంటాం. కాని మాట్లాడటంలో రాకీ.. అందుకే తాళంచెవులు అన్నాను.
Post a Comment