సానుభూతిని ఆశించడమంత ఎస్కేపిజం లేదు….
"అయ్యో పాపం తను మాత్రం ఏం చేయగలడు.." "పాపం, తన బ్రతుకు అలా
అయిపోయింది." అంటూ ఇతరులు కురిపించే సానుభూతి మాటల్ని ఆస్వాదించే
వ్యక్తి ఏ దశలోను పైకి రాలేడు. ఒక మనిషి కష్టాల్లొ ఉన్నప్పుడు మనసులో సంబర
పడుతూనే నాలికపై విపరీతమైన జాలిని ప్రదర్శించడం సమాజ సహజమైపోయింది.
పీకలలోతు ఊబిలో కూరుకుపోయినా గుండె నిబ్బరంతో పోరాడూతూ ఉండాలి తప్ప
కావాలని సానుభూతి వ్యక్తపరిచే వ్యక్తులకు దాసోహమైపోతే.. మన పోరాట పటిమని
మనం చేజేతులా చంపుకున్నట్టే అవుతుంది. అవును. ప్రతీ మనిషి జీవితంలోనూ
ఎత్తుపల్లాలు సహజమే! వాటికి నిలువెల్లా నీరుకారిపోవడం, ఎవరి వడిలొ తలపెట్టుకుని
ఏడుద్దామా అని వెంపర్లాడడం మానుకుని మానవ ప్రయత్నంగా ఆ స్థితి నుండి బయటకు
రావడానికి మనం చేయగలిగింది ప్రొడక్టివ్‍గా చేసుకుంటూ పోతే స్వల్పకాలంలోనే అన్నీ
చక్కబడతాయి. తను, తనపై తనకు గల నమ్మకానికి విలువ ఇవ్వని వ్యక్తి అంతర్గతంగా
తనలొ శక్తి సామర్ధ్యాలు ఉన్నా వ్యతిరేక పరిస్థితుల్లో నెట్టుకురాలేడు. శక్తిని మరిచి "ఇంకా
కోలుకోవడం మనవల్లేం అవుతుంది.". అనుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా
కరిగిపోతుంది. పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. అప్పుడు కర్తవ్యం గుర్తెరిగి జీవితం
నావను రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించినా పూర్వపు వైభవస్థితికి రాలేనంతగా పాడై ఉంటుంది…
నల్లమోతు శ్రీధర్
4 వ్యాఖ్యలు:
చాలా ప్రాక్టికల్ గా చెప్పారు
సానుభూతి లో భూతం ఉన్నట్లు గానే అది ఆశించడంలో కూడా స్వార్ధం ఉంది
నిజం నిజం నిజ. సానుభూతి చూపించేవాళ్ళు చాలా ప్రమాదకారులు.
హే...భలేఉంది ఈ వారం బొమ్మ. చల్లనమ్మబోదు... కూడా ...
Post a Comment