Wednesday, August 6, 2014

మాలిక పత్రిక ఆగస్ట్ 2014 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor & Content Head


గత నెలలో మాలిక పత్రిక తరఫున చేసిన ప్రయోగం సఫలం కాదు. ఘనవిజయం సాధించింది. తండ్రి -కూతురు అంశం మీద మరి కొందరు రచయిత్రులు రాయడానికి ముందుకొచ్చారు. సంతోషం.  ఈ కధానికలన్నింటిని గుచ్చి మాలగా అచ్చు వేయించాలని నిర్ణయించడమైనది.. ఇంకా ఎవరైనా ఈ అంశం మీద రాయాలనుకుంటే తప్పకుండా రాసి మాకు పంపండి.. మీకు మాలిక పత్రికనుండి సదా స్వాగతం  లభిస్తుంది..

 మీ రచనలుఅభిప్రాయాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ నెలలోని ప్రత్యేక రచనలు మీకోసం:

01. మెహజబీన్ బానో
02. చిరంజీవ 
03. వర్షంలో గొడుగు
04. చాందినీ (తండ్రి - కూతురు)
05. శాంతి ( తండ్రి - కూతురు)
06. మాలిక పదచంద్రిక - ఆగస్ట్ 2014
07. ముగ్గురు కొలంబస్ లు - సమీక్ష
08. అ.. ఆ... ( చిత్రకవిత)
09. వెటకారియా రొంబ కామెడియా
10, ఓ కవితా  ప్రళయమా...
11. మీరు తలచుకొనండి - నేను కనుగొంటాను
12. రగడలు 
13. మాయానగరం - 6
14. నందికేశుని నోము
15. అనగనగా బ్నిం కథలు 12 
16. మౌనరాగం - 8
17. అండమాన్ డైరీ - 6
18. అమరనాథ్ యాత్ర 

Tuesday, July 29, 2014

మాలిక పత్రిక పదచంద్రిక - జులై 2014 ఫలితాలుజూలై 2014 పద చంద్రిక సమాధానాలు:

జూలై 2014 పదచంద్రిక కి 5 పూరణలు వచ్చాయి.  పూరించినవారు  శ్రీ మాచర్ల హనుమంతరావు గారు, శ్రీమతులు భమిడిపాటి సూర్యలక్ష్మి, బాలాసుందరీ మూర్తి, భీమవరపు రమాదేవి, ఏ.కే. దేవి గార్లు. 
వీరిలో రావు గారు అన్నీ సరిగా పూరించి విజేతలు గా నిలిచారు. వీరికి మా అభినందనలు.  బాలాసుందరి మూర్తి గారు ఎత్తి చూపిన త్వష్ట, నిష్ఠ ల వర్ణక్రమాల్లో తేడా సరైనదే. కానీ గడి కోసం కొద్దిగా సర్దుకు పోవలసి వచ్చింది. ఇలాంటి సర్దుబాట్లు చేసినప్పుడు సాధారణంగా సూచనగా చెప్తోంటాం.  ఇక్కడ చెప్పడం కాస్త సంక్లిష్టం అని చెప్పలేదు.  ధన్యవాదాలు.  సమాధానాలు కింద చూడండి.
భవదీయుడు
సత్యసాయి కొవ్వలి


మాలిక పదచంద్రిక - జూన్ 2014 ఫలితాలుజూన్ 2014 పదచంద్రిక కి నాలుగు పూరణలొచ్చాయి.  వీటిలో కాత్యాయని గారు, రమాదేవిగారు కూడా  అసలు తప్పులు లేకుండా పూరించలేదు. కానీ, వర్ణక్రమ దోషాలలాంటివి  పట్టించుకోకుండా ఉంటే రమాదేవిగారు అన్నీ సరిగా పూరించినట్లు భావించవచ్చు.  అసలు తప్పులు లేకుండా (ఒక వర్ణక్రమం తప్ప) పూరించినవారు శ్రీమతి భమిడిపాటి సూర్యాలక్ష్మి గారు. కేవలం ఒకే తప్పుతో పూరించిన వారు  శ్రీమతి శుభావల్లభ గారు. సూర్యాలక్ష్మి గారు, రమాదేవి గారు విజేతలుగా భావిస్తున్నాము. 


భవదీయుడు సత్యసాయి కొవ్వలిసరియైన పూరణ ఇక్కడ.


Saturday, July 12, 2014

జె.వి పబ్లిషర్స్ నుండి ఆరు పుస్తకాల ప్రచురణ
జె.వి.పబ్లిషర్స్ నుండి ఒకేసారి ఆరు పుస్తకాల ప్రచురణ చేయడం జరిగింది. ఈ పుస్తకాల ఆవిష్కరణ మరి కొద్ది రోజులలో జరగబోతుంది. ఈ ఆరు పుస్తకాలు ఏంటా అంటే??

కథలు, కవితలు, నవలలు, సమీక్షలు, వ్యాసాలు...

మరి రాసింది ఎవరో.... శ్రీమతి సి ఉమాదేవి. Uma Devi

ఈ పుస్తకాలన్నింటికి అందమైన కవర్ డిజైన్లు చేసింది Krishna Ashok


సాగరకెరటం - నవల
కేర్ టేకర్ - నవల
ఏ కథలో ఏముందో - సమీక్షలు
మాటే మంత్రము - కధాసంకలనం
మంచిమాట మంచిబాట - వ్యాసాలు
అమ్మంటే - కవితలు


పుస్తకావిష్కరణ సభకు ఆహ్వాన పత్రిక..

Tuesday, July 1, 2014

మాలిక పత్రిక జులై 2014 సంచిక విడుదలమాలిక పత్రిక జులై 2014 సంచిక విడుదలైంది. ఈసారి పత్రిక ఒక ప్రత్యేకమైన ప్రయోగంతో మీ ముందుకు వచ్చింది. ఒకే అంశం మీద పదిమంది రచయిత్రులు రాసిన కధలను , వాటి విశ్లేషణ, ఆ అంశానికి తగిన చిత్రంతో , మరికొన్ని సాహిత్య ప్రధాన వ్యాసాలతో మిమ్మల్ని అలరిస్తుందని అనుకుంటున్నాము.  తండ్రి - కూతురు అనే ఈ అంశానికి తగినటువంటి కథలు రాసినవారు సి.ఉమాదేవి, పి.ఎస్.ఎమ్ లక్ష్మి, జి.ఎస్. లక్ష్మి, మణి వడ్లమాని, నండూరి సుందరీ నాగమణి, సుజల గంటి, సమ్మెట ఉమాదేవి, బాలా మూర్తి, దమయంతి, వారణాసి నాగలక్ష్మి పాల్గొన్నారు. వీరందరి కధలు విభిన్నంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఈ కధలను విశ్లేషణ చేసినవారు మంధా భానుమతి.. అదే విధంగా జె.కె.మోహనరావుగారు కూడా  పద్యాలతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు.

భానుమతిగారు ఈ కధలను చదువుతూ, విశ్లేషించిన తర్వాత ఇలా అంటున్నారు..
నా మాట—
   తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎంత గొప్పదో.. ఆ ప్రేమ ఎంత అపురూపమయిందో.. అది అందుకున్న వాళ్లకి బాగా తెలుసు. అందుకనే.. మాలిక అంతర్జాల పత్రిక సంపాదకులు, రచయిత్రులని.. ఆ బంధం ఆధారంగా కథానికలు రాయమన్నప్పుడు వెంటనే స్పందించారు మన రచయిత్రులు.
   ఒక్కో కథా వచ్చినప్పుడల్లా నాకు జ్యోతి పంపుతుంటే వెంటనే చదివేశాను.. పాఠకురాలిగా! అందరు రచయిత్రులూ ఆరితేరిన వారే.. ఒక్కొక్కరూ ఎంచుకున్న విషయం.. దేనికదే! అంత మనసుకు పట్టించుకోకుండా చదివేశాను కద.. ఆలోచిస్తే ఇన్ని రకాల నాన్నలుంటారా అనిపించింది. మా నాన్నగారు నన్ను గారం చెయ్యడం, కోపం వస్తే కోప్పడ్డం.. సరిగ్గా  చదవకపోతే కూర్చోపెట్టి పాఠాలు చెప్పడం, ప్రైజులొస్తే పదిమందికీ చెప్పి మురిసిపోడం.. ఇవే తెలుసు నాకు.
   ఇంక సమీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు, ప్రతీ లైనూ, వీలైతే లైనుకీ లైనుకీ మధ్య చదువుతుంటే ఆలోచనలు అంతర్వాహినిలా వచ్చాయి. అవన్నీ క్రమంలో పెట్టి విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను.
   నా అభిప్రాయాలు.. పాఠకులకి ఏమనిపిస్తాయో మరి.. వేచి చూడాల్సిందే!

ఈ సంచికలోని వ్యాసాలు, కధలు:
01. నాన్నకో ఈమెయిల్
02. నాన్న కూతురు
03. దహనం
04. ఓ నాన్న
05. ఓ ఇంటి కథ
06. ఏం బంధాలివి?
07. ఎంత మంచివాడవు నాన్నా?
08. కణ్వ శాకుంతలం
09.  బంధాలు - బాధ్యతలు
10. మీచ్ తుమ్చీ లేక్
11.  పదచంద్రిక
12. తలచుకొనండి - కనుగొంటాను
13. ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార
14. అనగనగా బ్నిం కధలు - రాజయ్య ఇడ్లీ బండి
15. మాయానగరం - 5

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008