మాలిక పత్రిక మే నెల 2024 సంచిక విడుదల
మాలిక మిత్రులు, పాఠకులు, రచయితలకు మాలిక పత్రిక మే నెల 2024 సంచికకు స్వాగతం... సుస్వాగతం... మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు..
మన తెలుగువారింట ప్రస్తుతం ఏం జరుగుతోంది.. మండే ఎండల్లో కాని, ప్రాణాలు తీసే కరోనా విలయతాండవ వేళ కాని, ఆరు నూరు నూరు పదహారైనా మానని ఒకే ఒక ప్రహసనం మీకు తెలుసు కదా.. అదేనండి ఆవకాయ..
గోవిందుడు అందరివాడేలే లాగే ఆవకాయ మన అందరిదీ...
ఒకటా రెండా నాలుగా.. అబ్బబ్బా... కొబ్బరి మామిడి, నాటు కాయలు, జలాల్ కాయలు, గులాబీ.. ఇలా పేరు ఏదైనా ఉన్నదొక్కటే మామిడికాయ. కాని ఎన్ని రకాల ఆవకాయలో... నేను పేర్లు చెప్పనులెండి..
చెప్పాలంటే ఆవకాయ ఒక ఎమోషన్ మనందరికీ.. కొందరు ఇప్పటికే ఈ కార్యక్రమం పూర్తి చేసి, తిరగ కలిపి, రుచి చూడడం, విదేశాల్లో పిల్లలకు కొరియర్ చేయడం మొదలైపోయింది కూడా.. ఇంకా కొందరు ఎండలు ఇంకొంచెం ముదిరితే ఇంకొంచెం మంచి కాయలు వస్తాయి. అప్పుడు పెడదాము అనుకుంటున్నారు నాలాగ.. ఈ రోజుల్లో ఆవకాయలు చాలా సులువుగా దొరికేస్తున్నాయి. అయినా మనమే రంగంలోకి దిగి, కారం పొడులు, ఉప్పు, ఆవ,మెంతి, జీలకర్ర, వెల్లుల్లి, కాయలు, ఇంగువ అన్నీ శ్రేష్టమైనవి చూసి, కొనుక్కొచ్చి ఇంట్లో చేయకపోతే తృప్తిగా ఉండదంటే ఉండదు.
అదన్నమాట సంగతి..
మాలిక పత్రికకోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు విశేషాలు.
2. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు 10
3. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8
4. ఎత్తుకు పై ఎత్తు… చిత్తు చిత్తు!
7. బాలమాలిక – మంచి తల్లిదండ్రులంటే…
9. జీవనయానం
11. యస్.వి. రంగారావు
12. ఏది పొందడానికి ఏం కోల్పోతున్నావు?
13.మధ్యతరగతి మందహాసం – నవలా సమీక్ష
0 వ్యాఖ్యలు:
Post a Comment