Saturday 29 October 2011

Happy Birthday Friend




గడచిన కాలమెంతో మధురం, మనోహరము..
అయినా ప్రతి వత్సరానికి ఒకసారి వచ్చే
ఈ రోజు మాత్రం మన జీవనఫధంలో ఒక తీయని జ్ఞాపకం.
కొత్త స్నేహితాలు, పాత జ్ఞాపకాలు, కష్టసుఖాలు వెరసి ఒక కర్తవ్యబోధ..

పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా....

ఈ జన్మదినం ఓ సంబరం మాత్రమే కాదు
మరో వత్సరం మన జీవనానికి వేసుకునే ప్రణాళిక
ఎన్నెన్నో ప్రహేళికలు దాటి వచ్చిన ఓ సాదరానుభూతి
మరిన్ని ప్రవల్లికలవైపు ముందుకు సాగే పయనం

ఈ శుభసమయంలో ఒక చిరు కానుక.. సంగీత (రాగ) లహరి టపాలన్నీ మీ కోసమే....

సంగీత (రాగ) లహరి - 1

సంగీత (రాగ) లహరి - 2

సంగీత(రాగ) లహరి - 3

సంగీత (రాగ) లహరి - 4

సంగీత (రాగ) లహరి - 5

సంగీత (రాగ) లహరి - 6

Friday 28 October 2011

సంగీత (రాగ) లహరి - 6

ఇది చివరి భాగం. మొత్తం 28 రాగాలకు సంబంధించిన పాటలను సేకరించగలిగాను. మెల్లి మెల్లిగా ఒక్కో రాగానికి వివరణ చేరుస్తాను. వీలయితే తర్వాత ఈ రాగాలకు సంబంధించిన కీర్తనలు, కృతులు వెతకడానికి ప్రయత్నిస్తాను. :)

నటభైరవి :




శంకరాభరణం :






షణ్ముఖప్రియ :







సింధుభైరవి:




శివరంజని:

Wednesday 26 October 2011

సంగీత (రాగ) లహరి - 5

కల్యాణి






ఖరహరప్రియ




కేదారగౌళ






కీరవాణి






ఖమాస్






మధ్యమావతి






మోహన

మస్తీ , మజా, మ్యూజిక్ జోష్... రేడియో జోష్



http://radiojosh.com/

మధురమైన సంగీతాన్ని ఇష్టపడే వారందరికీ నమస్కారం.

రేడియో జోష్ తరఫున మీకందరికి స్వాగతం... సుస్వాగతం.. ఈసారి దీపావళి పండగ సందర్భంగా దివ్వెల వెలుగులు, టపాసుల సందడితో పాటు మీకోసం మరో ధమాకా రాబోతుంది. మీరంతా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మీ రేడియో జోష్ ఈ రోజు దీపావళినాడు సకల హంగులతో మీ ముందుకు రాబోతుంది. పండగ సంతోషంలో రేడియో జోష్ పాటలతో కూడా ఎంజాయ్ చేయండి. పాటలు వింటూ మీ పని చేసుకోండి.. జస్ట్ ఒక్క క్లిక్‌తో రేడియో జోష్‌ని ఆన్‌లైన్‌లో మీ ముందుకు తీసుకురావస్తున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాము. ఇంతకు ముందు మీరెప్పుడూ కనీ, వినీ ఎరుగని అద్భుతమైన ఆకర్షణలతో మీ ముందుకు వస్తుంది రేడియో జోష్. దీనికోసం అన్ని సన్నాహాలు పూర్తి అయ్యాయి. పండగరోజు మిమ్మల్ని అలరించడానికి ఆనందంలో ముంచెత్తడానికి మా రేడియో జాకీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా రేడియో జోష్ వింటూ మా రేడియో జాకీలతో సరదాగా మాట్లాడుతూ , మా లైవ్ షోస్‌ల్ పాల్గొని చాటింగ్ చేస్తూ ఆనందపు అంచులు అందుకోండి. రేడియో జోష్ 100% సంగీతంతో మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం మాకు ఉంది.

ఇక మా రేడియో జాకీల గురించి కొన్ని మాటలు. అందరూ సరదాగా మీ పక్కింటి అబ్బాయి, అమ్మాయిలా ఉంటారు. వసపిట్టలా కబుర్లు చెప్తూ మిమ్మల్ని అలరిస్తారు. మీరు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీకు నచ్చినవారికోసం కూడా ఒక పాట కోరుకోండి. మా రేడియో జాకీలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, కబుర్లు చెప్పండి. అంతులేని ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి.

రేడియో జోష్‌లోని ప్రత్యేక ఆకర్షణలు మీకోసం...

ఈనాడు సెల్‌ఫోన్ కూడా కంప్యూటర్‌లా వాడుతున్నారు. అందుకే మీ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో నిరంతరాయంగా రేడియో జోష్ వింటూ చాటింగ్ చేసేందుకు అవసరమైన ఆపిల్ ఐ్‌ఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఆప్స్ భారతదేశంలో మొదటిసారిగా మీకోసం తయారుచేసాం. ఇది మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే కాల్ చేసి మా రేడియో జాకీలతో పాటు సహ శ్రోతలతో కూడా మాట్లాడొచ్చండోయ్..

అమెరికా, యూరప్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో ఉన్నవారి కోసం కాల్ చేసి మా రేడియో జాకీలతో మాట్లాడదానికి ప్రత్యేకమైన ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసాం.

ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే జోష్‌తో కూడిన లైవ్ చాట్.. మా రేడియో జాకీలతో నేరుగా మాట్లాడటానికి మా సైట్‌లో దానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని హాయిగా ఎప్పుడంటే అపుడు చాటింగ్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇంతేకాకుండా ముందు ముందు మరెన్నో ఆకర్షణలతో 24 గంటలూ మిమ్మల్ని ఆనందింపచేయడానికి రేడియో జోష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది.

మస్తీ, జోష్‌తో నిండిన సంగీతంతో మిమ్మల్ని అలరించడానికి రేడియో జోష్ వచ్చేస్తుంది. కౌంట్‌డౌన్ మొదలైంది. రేడియో జోష్ వింటూ ఉండండి.. మస్త్ మజా.. మస్త్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి. ఈ సంతోషకరమైన వార్తను మీ సంగీతప్రియులైన మీ స్నేహితులతో పంచుకోవడం మరచిపోకండి. ఈ రేడియో యువత కోసమే కాదు అందరి కోసం. పాత, కొత్త , హిందీ, తెలుగు, ఇంగ్లీషు పాటలతో మీరు కోరినట్టుగా అందించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం.


ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయిక్, నటుడు కృష్ణుడు విచ్చేస్తున్నారు.

Date : Wednesday 26th

October 2011

Time : 11.00 Am

Venue: Hotel Kens ,

Near Ratnadeep Super Market,

Srinagar colony ,

Hyderabad

Saturday 22 October 2011

సంగీత (రాగ) లహరి - 4

1. దర్బారీ కానడ





2. దేశి





3. హంసధ్వని




4. హిందోళం





5. జయజయవంతి





6. కానడ





7. కాఫీ

Thursday 20 October 2011

ఆన్‌లైన్‌లో ఆకాశవాణి


ఆన్‌లైన్‌లో ఆకాశవాణి


సంగీతం మన జీవితంలో ఒక భాగం. ఇది అందరూ ఒప్పుకునే సత్యం.. అది శాస్త్రీయ సంగీతమైనా, భక్తి సంగీతమైనా, సినిమా పాటలైనా మనసును ఉల్లాసపరుస్తాయి అని ఒప్పుకోక తప్పదు. ఉదయం ఆరు గంటలకే భక్తిసంగీతంతో నిద్ర లేపే రేడియో లేదా ఆకాశవాణి భారతీయులు అందరికీ సుపరిచితమే. కొన్నేళ్ల క్రింద ఒక చెక్కపెట్టెలోనుండి మాటలు, పాటలు వస్తుంటే వింతగా చూసేవారు. కాని నేడది చాలామందికి జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక టేబిల్ మీద ఉండే పెద్ద రేడియో పెట్టె నేడు మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ ద్వారా కోట్లాదిమందిని అనుక్షణం వెన్నంటే ఉంటుంది. పాటలు వింటూ పని చేసుకోవడం ఒక వ్యసనంలా మారింది అని చెప్పవచ్చు. మధురమైన సంగీతంతో మనసును సేద తీర్చి ఆహ్లాదాన్ని ఇచ్చే మధురమైన వ్యసనం ఇది. అందుకే ఈనాడు ప్రతీ మొబైల్ ఫోన్‌లో FM రేడియో తప్పకుండా ఉంటుంది. ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో ఎన్నో FM రేడియో చాన్నెళ్లు, ఇంటర్‌నెట్ రేడియోలు పెరిగిపోతున్నాయి అని చెప్పవచ్చు. విస్తృతంగా పెరిగిన అంతర్జాల వినియోగంతో కొందరు ఔత్సాహికులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కొత్త రేడియో ఛానెళ్లు మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. బస్సులో వెళుతున్నా, కారులో వెళుతున్నా మొబైల్ ద్వారా పాటలు వింటున్నారు చాలా మంది. ఈ FM రేడియోలు మన దేశంలోనే అందుబాటులో ఉన్నాయి. కాని విశ్వవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులైన తెలుగువారు తమ కంప్యూటర్ ద్వారా వివిధ రేడియోల ద్వారా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది.


దేవరాగం విత్ భారతి, నేను ప్రతీక, ముద్దుగా గుడ్‌మార్నింగ్ చెప్పే సునయన, క్రిష్, ఫాహద్, బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్... వీళ్లందరూ నాయకులు కారు, సినీ ప్రముఖులు కారు ఐనా ఈనాడు ఎంతోమందికి పరిచయం. రోజూ వీరి మాటను అందరూ వింటున్నారు. ఆనందిస్తున్నారు. ఎదురుచూస్తున్నారు.. ఎవరు వీళ్లు?? తెలుగు FM చానెల్స్ ద్వారా ఇరవై నాలుగు గంటలూ తమ మాటలతో , మధురమైన పాత కొత్త పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అందుకే రోజు రోజుకు రేడియో వినియోగం పెరిగిపోతుందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్ మాత్రమే కాదు. చిన్న చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లలో కూడా రేడియో ద్వారా మంచి పాటలను వినిపిస్తున్నారు. మరి హైదరాబాదులో మాత్రమే వినగలిగే తెలుగు FM చానెళ్లు రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ FM, రెయిన్‌బో FM, వివిధభారతి మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్లో ఇక్కడ http://www.voicevibes.net/ వినొచ్చు. కానీ ఖర్చులేదు. సభ్యత్వం తీసుకునే పని లేదు. ఇదేకాక తెలుగు పాటలు వినిపించే రేడియో ప్లేయర్లు లభించే సైట్లు కూడా బోలెడు ఉన్నాయి.


తెలుగువన్ వారు నిర్వహిస్తున్న http://www.toucheradio.com/ లో అమెరికా, లండన్, ఇండియా, ఆస్ట్రేలియా సమయాలకనుగుణంగా రేడియో ఏర్పాటు చేయబడింది. ఇందులో live radio కూడా ఉంది. అలాగే TORi లో రేడియో పాటలు మాత్రమే కాకుండా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇళయరాజా, పాట పాటలు, కొత్త పాటలు మొదలైన పేర్లతో ఇతర ప్రోగ్రాంలు కూడా అందిస్తున్నారు. ఈ మధ్యే మొదలైన మరో రేడియో మనసుతో manasutho.com .. ఈ రేడియోలో మధురమైన పాటలు ఆగకుండా వినిపిస్తూనే ఉంటారు. అంతే గాక యుగళగీతాలు, సోలో గీతాలు, ప్రేమ గీతాలు అంటూ వివిధ విభాగాలు కూడా పొందుపరిచారు నిర్వాహకులు. మరో తెలుగు రేడియో ( ఇది Internet Explorer లో మాత్రమే పని చేస్తుంది) http://livetvchannelsfree.in/teluguradio.html.. ఇక్కడ తెలుగుతో బాటు మరి కొన్ని భారతీయ బాషలలోని పాటలు వినే అవకాశం ఉంది. నెటిజనులలో బాగా ప్రాచుర్యం పొందిన మరో రేడియో http://www.radiokhushi.com/ ఇందులో తెలుగు, హిందీ బాషలలో రేడియోలు ఉన్నాయి. తెలుగు విభాగంలో మీరు కోరిన పాటలు, హిట్ పాటలు, భక్తి సంగీతం, అభినందనలు మొదలైన వర్గాలుగా పాటలను అందిస్తున్నారు. తెలుగు పాటలను అందించే మరో రేడియో http://www.telugufms.com/ ఇందులో రేడియో మాత్రమే కాక ప్రముఖ సంగీత దర్శకులు పాటలు కూడా అందిస్తున్నారు. ఇందులో ఇరవైకి పైగా వివిధ విభాగాలు ఉన్నాయి. మరో కొత్త రేడియో చానెల్ http://radiojosh.com/ ఇందులో తెలుగు హిందీ పాటలు వినొచ్చు .. ప్రతీ ఇంట్లో కంప్యూటర్ ఉన్న ఈ రోజుల్లో అంతర్జాల అనుసంధానంతో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలుగు పాటలు వినే అవకాశం ఉంది . అది కూడా పైసా ఖర్చు లేకుండా... అంతే కాకుండా రాగా, చిమట మ్యూజిక్ సైట్లలో కూడా తెలుగుపాటల ప్లేయర్లు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంప్యూటర్ తెరిచేసి హాయిగా తెలుగు పాటలు వింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు చేసుకోండి..

Friday 14 October 2011

సంగీత(రాగ) లహరి - 3

ఈసారి నుండి రాగానికి సంబంధించి తెలుగు, హిందీ, తమిళ్ పాటలు చేరుస్తున్నాను..


బృందావన సారంగ


హిందూస్థానీ సంప్రదాయంలో సరి2మ1పని3స-స ని2పమ1రి2ని3స మూర్ఛనతో పాడే ఈ రాగం కర్ణాటక సంప్రదాయంలో సరి2మ1పని3స-సని2పమ1రి2గ2రి2స మూర్ఛనతో ఖరహరప్రియ జన్యంగా పరిగణింపబడుతుంది. దీనికి అత్యంత దగ్గరగా ఉండే బృందావనిని గాంధారం లేకుండా పాడుతారు. ఆరోహణలో కాకలి నిషాదం, అవరోహణలో కైశికి నిషాదం రావటం వల్ల ఈ రాగానికి ప్రత్యేకమైన అందం చేకూరుతుంది. మధ్యాహ్నసాయంకాలాలలో పాడదగిన రాగం. ఈ రాగం శృంగారరసానికి చక్కగా సరిపోతుంది.





చక్రవాకం

భక్తినీ, కరుణారసాన్నీ ఆవిష్కరించగలిగిన రాగాలలో చక్రవాకం ఒకటి. హిందూస్థానీలో ఆహిర్ భైరవ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కర్ణాటకసంప్రదాయంలో అగ్ని చక్రానికి చెందినది, 16వ మేళకర్తరాగం. దీక్షితర్ సంప్రదాయంలో దీనికి తోయవేగవాహిని అని పేరు. చక్రవాకంలోని మధ్యమాన్నీ నిషాదాన్నీ షడ్జంగా పాడితే క్రమంగా సరసాంగి ధర్మవతి రాగాలు ఆవిష్కరింపబడుతాయి. దీనికి సమానమైన ప్రతిమధ్యమరాగం రామప్రియ. ఈ రాగపు జన్యాలు బిందుమాలిని, మలయమారుతం, వలజి మొదలైనవి.




చంద్రకౌంస
రాత్రిపూట పాడదగిన రాగం. రిషభపంచమరహితం. కీరవాణి జన్యం. సగ2మ1ద1ని3స - సని3ద1మ1గ2మ1గ2సని3స. అవరోహణను సని3ద1మ1గ2స అని పాడడం కూడా కద్దు. ఈ రెండవ మూర్ఛనను అనుసరించి, హిందోళంలో కైశికి నిషాదానికి బదులు కాకలి నిషాదం పాడితే చంద్రకౌంస్‌గా వినబడుతుంది.





చారుకేశి


Saturday 8 October 2011

సంగీత (రాగ) లహరి - 2


సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన 64 కళల్లో సంగీతం మొదటి స్థానంలో ఉంది. పసిపిల్లలు, పశువులు, పాములు, పక్షులు, మొక్కలు కూడా సంగీతాన్ని విని ఆనందిన్స్తాయని అంటారు. అంతే కాక మ్యూజిక్ థెరపీ వల్ల మానసిక రుగ్మతలను కూడా పోగొట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. "Music is Universal Language" ప్రపంచం అంతటికీ తెలిసిన ఏకైక భాష సంగీతం.


ప్రపంచ సంగీతమంతా ఏడు స్వరాల (సప్తస్వరాలు) మీదే ఆధారపడి ఉంది. సంగీతానికి పునాది ఈ సప్తస్వరాలు.


భారతీయ సంగీతం పాశ్చాత్య సంగీతం


1. స - షడ్జ్యము Do


2. రి - రిషభము Rah


3. గ - గాంధారము Me

4. మ - మధ్యమము Fa

5. ప - పంచమము Soh


6. ద - దైవతము Lah


7. ని - నిషాదము Si



ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు సప్తస్వరాలను ప్రకృతినుంచి ఈ విధంగా అన్వయించినట్లు తెలుస్తోంది.


1. స - నెమలి కూత


2. రి - వృషభ ధ్వని


3. గ - మేక అరుపు


4. మ - క్రౌంచ పక్షి కూత


5. ప - కోకిల స్వనం


6. ద - గుఱ్ఱపు సకిలింపు


7. ని - ఏనుగు ఘీంకరింపు


'' ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కే విధంగా ఒక్కొక్క స్వరం పెంచుకుంటూ, తగ్గిస్తూ మెట్లు ఎక్కే విధంగా, దిగే విధంగా పాడతారు. దీనినే ఆరోహణ, అవరోహణ క్రమం అంటారు.



అమృతవర్షిణి:

అమృతవర్షిణి-- 66 మేళకర్త చిత్రాంబరి జన్యం. ఉపాంగం. రక్తిరాగం. మూర్ఛన సగ32పని3స - సని3పమ23స. ఈ రాగం పాడి ముత్తుస్వామి దీక్షితులు ఎట్టయాపురంలో వర్షం కురిపించి క్షామాన్ని రూపుమాపారని చెబుతారు.



భాగేశ్రీ


బాగేశ్వరి/బాగేశ్రీ-- 22 ఖరహరప్రియ జన్యం. ఉపాంగం. బాగేశ్వరి హిందూస్థానీలో కూడా అదే పేరుతో పిలువబడుతుంది. మూర్ఛన సగ212ని2స - సని221పద221రి2



బిళహరి:


బిళహరి-- 29 మేళకర్త ధీరశంకరాభరణ జన్యం. మూర్ఛన సరి23పద2స - సని32పమ13రి2స. భాషాంగం. కొన్ని విశేషప్రయోగాలలో కనబడే కైశికినిషాదం అన్యస్వరం. వేంకటమఖి పద్ధతిలో బిళహరి ఆరోహణలో మధ్యమవక్రరాగం. అంటే ఆరోహణలో సరి213పద2స అని వస్తుంది. ఈ రాగం పాడి చనిపోయినవారిని కూడా బ్రతికించవచ్చు అంటారు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008