Friday, 14 October 2011

సంగీత(రాగ) లహరి - 3

ఈసారి నుండి రాగానికి సంబంధించి తెలుగు, హిందీ, తమిళ్ పాటలు చేరుస్తున్నాను..


బృందావన సారంగ


హిందూస్థానీ సంప్రదాయంలో సరి2మ1పని3స-స ని2పమ1రి2ని3స మూర్ఛనతో పాడే ఈ రాగం కర్ణాటక సంప్రదాయంలో సరి2మ1పని3స-సని2పమ1రి2గ2రి2స మూర్ఛనతో ఖరహరప్రియ జన్యంగా పరిగణింపబడుతుంది. దీనికి అత్యంత దగ్గరగా ఉండే బృందావనిని గాంధారం లేకుండా పాడుతారు. ఆరోహణలో కాకలి నిషాదం, అవరోహణలో కైశికి నిషాదం రావటం వల్ల ఈ రాగానికి ప్రత్యేకమైన అందం చేకూరుతుంది. మధ్యాహ్నసాయంకాలాలలో పాడదగిన రాగం. ఈ రాగం శృంగారరసానికి చక్కగా సరిపోతుంది.





చక్రవాకం

భక్తినీ, కరుణారసాన్నీ ఆవిష్కరించగలిగిన రాగాలలో చక్రవాకం ఒకటి. హిందూస్థానీలో ఆహిర్ భైరవ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కర్ణాటకసంప్రదాయంలో అగ్ని చక్రానికి చెందినది, 16వ మేళకర్తరాగం. దీక్షితర్ సంప్రదాయంలో దీనికి తోయవేగవాహిని అని పేరు. చక్రవాకంలోని మధ్యమాన్నీ నిషాదాన్నీ షడ్జంగా పాడితే క్రమంగా సరసాంగి ధర్మవతి రాగాలు ఆవిష్కరింపబడుతాయి. దీనికి సమానమైన ప్రతిమధ్యమరాగం రామప్రియ. ఈ రాగపు జన్యాలు బిందుమాలిని, మలయమారుతం, వలజి మొదలైనవి.




చంద్రకౌంస
రాత్రిపూట పాడదగిన రాగం. రిషభపంచమరహితం. కీరవాణి జన్యం. సగ2మ1ద1ని3స - సని3ద1మ1గ2మ1గ2సని3స. అవరోహణను సని3ద1మ1గ2స అని పాడడం కూడా కద్దు. ఈ రెండవ మూర్ఛనను అనుసరించి, హిందోళంలో కైశికి నిషాదానికి బదులు కాకలి నిషాదం పాడితే చంద్రకౌంస్‌గా వినబడుతుంది.





చారుకేశి


0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008