సంగీత (రాగ) లహరి - 2
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన 64 కళల్లో సంగీతం మొదటి స్థానంలో ఉంది. పసిపిల్లలు, పశువులు, పాములు, పక్షులు, మొక్కలు కూడా సంగీతాన్ని విని ఆనందిన్స్తాయని అంటారు. అంతే కాక మ్యూజిక్ థెరపీ వల్ల మానసిక రుగ్మతలను కూడా పోగొట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. "Music is Universal Language" ప్రపంచం అంతటికీ తెలిసిన ఏకైక భాష సంగీతం.
ప్రపంచ సంగీతమంతా ఏడు స్వరాల (సప్తస్వరాలు) మీదే ఆధారపడి ఉంది. సంగీతానికి పునాది ఈ సప్తస్వరాలు.
భారతీయ సంగీతం పాశ్చాత్య సంగీతం
1. స - షడ్జ్యము Do
2. రి - రిషభము Rah
3. గ - గాంధారము Me
4. మ - మధ్యమము Fa
5. ప - పంచమము Soh
6. ద - దైవతము Lah
7. ని - నిషాదము Si
ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు సప్తస్వరాలను ప్రకృతినుంచి ఈ విధంగా అన్వయించినట్లు తెలుస్తోంది.
1. స - నెమలి కూత
2. రి - వృషభ ధ్వని
3. గ - మేక అరుపు
4. మ - క్రౌంచ పక్షి కూత
5. ప - కోకిల స్వనం
6. ద - గుఱ్ఱపు సకిలింపు
7. ని - ఏనుగు ఘీంకరింపు
'స' ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కే విధంగా ఒక్కొక్క స్వరం పెంచుకుంటూ, తగ్గిస్తూ మెట్లు ఎక్కే విధంగా, దిగే విధంగా పాడతారు. దీనినే ఆరోహణ, అవరోహణ క్రమం అంటారు.
అమృతవర్షిణి:
అమృతవర్షిణి-- 66 మేళకర్త చిత్రాంబరి జన్యం. ఉపాంగం. రక్తిరాగం. మూర్ఛన సగ3మ2పని3స - సని3పమ2గ3స. ఈ రాగం పాడి ముత్తుస్వామి దీక్షితులు ఎట్టయాపురంలో వర్షం కురిపించి క్షామాన్ని రూపుమాపారని చెబుతారు.
భాగేశ్రీ
బాగేశ్వరి/బాగేశ్రీ-- 22 ఖరహరప్రియ జన్యం. ఉపాంగం. బాగేశ్వరి హిందూస్థానీలో కూడా అదే పేరుతో పిలువబడుతుంది. మూర్ఛన సగ2మ1ద2ని2స - సని2ద2మ1పద2గ2మ1రి2స
బిళహరి:
బిళహరి-- 29 మేళకర్త ధీరశంకరాభరణ జన్యం. మూర్ఛన సరి2గ3పద2స - సని3ద2పమ1గ3రి2స. భాషాంగం. కొన్ని విశేషప్రయోగాలలో కనబడే కైశికినిషాదం అన్యస్వరం. వేంకటమఖి పద్ధతిలో బిళహరి ఆరోహణలో మధ్యమవక్రరాగం. అంటే ఆరోహణలో సరి2మ1గ3పద2స అని వస్తుంది. ఈ రాగం పాడి చనిపోయినవారిని కూడా బ్రతికించవచ్చు అంటారు.
3 వ్యాఖ్యలు:
chalaa manchi prayatnam jyothi abhinandanalu....prematho..j
sangeetam ante chaalaa ishtam.. kaani vati raagaalu teliyadu. avanni cheppinanduku chaala chaalaa thx andi.
abba yenta baagunnayi
Post a Comment