Friday, 13 May 2011

చిన్నారి పెళ్లికూతురాయెనే ....




బుడి బుడి అడుగులతో, చిరుమువ్వల సవ్వడితో ఇల్లంతా తిరుగుతూ, అందరిని తన ముద్దు మురిపాలతో కట్టిపడేసిన మా అమ్మాయి దీప్తి ఈరోజు మరో ఇంటికి మహారాణిగా తనకంటూ ఒక కొత్త బంగారు లోకాన్నినిర్మించుకోవడానికి అజయ్ తో వివాహబంధంలో ఒకటవుతుంది. మమ్మల్ని వదిలి వెళ్తుంది అన్న బాధ ఉన్నా తప్పదుగా ఆడపిల్ల ఏనాటికైనా ఆడపిల్లే.. ఇద్దరూ స్నేహితుల్లా కలకాలం కలిసి మెలసి ఉండాలని మీరందరూ కూడా ఈ జంటను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను.




అలాగే ఈ పెళ్లి పాటలు వినేయండి మరి..











38 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్

మీకు అభినందనలు.. దీప్తి అజయ్ లకు శుభాశీస్సులూ జ్యోతి గారు :-)

Vinay Datta

Hearty congratulations you. Happy married life to Deepthi and Ajay.

madhuri and vinay

dhaathri

dear jyothi hearty congratulations to you both parents and blessings to the newly wed couple/may the almighty bestow his divine blessings on them and all of you forever.....love jagaddhatriramateertha

సుధామ

వివాహం నిజంగా అంగరంగ వైభవంగా జరిగింది జ్యోతి గారూ! మీకూ, మీ శ్రీవారికీ,అబ్బాయికీ కూదా అభినందనలు.ఎప్పుడో గానీ దర్శనమీయని ప్రముఖ కథా,నవలా రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి పక్కన కూర్చుని చి.సౌ.దీప్తి వివాహం చూడడం కూడా నాకు ఆనందాన్ని ఇచ్చిన విషయం.నవ దంపతులకు మా శుభాశీస్సులు.

Unknown

Hearty Congratulations Jyothigaru.. Wish both Deepthi and Ajay a wonderful and happy married life.

రవి

వధూవరులకు ఆశీస్సులు.

జయ

Jyothi gaaru, Congrats & I wish them all the best and a lovely life.

బులుసు సుబ్రహ్మణ్యం

వధూవరులకు మా శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేయండి

చిలమకూరు విజయమోహన్

వధూవరులకు శుభాశీస్సులు.

రాజ్యలక్ష్మి.N

Hearty congratulations to you
jyoti garu.

Happy married life to Deepthi and Ajay.

Venkat

వధూవరులకు మా శుభాకాంక్షలు

jaggampeta

కొత్త దంపతుల దాంపత్యం ఆదర్శం గా ఉండాలని ఆశిస్తూ....బ్లాగర్లు అందరి తరుపున శుభాకాంక్షలు

Maitri

My blessings to the newly wed

mOhana

ఆయురారోగ్యములతోడ నందముగను
సంతసమ్ముగ సిరితోడ సరసముగను
నూత్న దంపతులు సదా వినూత్నముగను
బ్రదుకు నట్టుల దీవించు పరమదేవ

- మోహన

జాన్‌హైడ్ కనుమూరి

మీకు అభినందనలు.. దీప్తి అజయ్ లకు శుభాశీస్సులూ

Sharada

మీకూ, చిరంజీవులకూ అభినందనలు జ్యోతి గారూ.
శారద

భావన

దీప్తి కు అజయ్ కు శుభాశిస్సులు. పెళ్ళి హడావుడి అయ్యిందా, అప్పుడే ఎక్కడ పదహారు రోజులన్నా అవ్వాలి కదా అంటావా?

Ennela

Hearty congratulations andee,,The picture is so beautiful...May god bless them.

ఆ.సౌమ్య

నవదంపతులకు అభినందనలు. మీకు కూడా.

మైత్రేయి

జ్యోతిగారు,
మీ అమ్మాయికి అల్లుడి గారికి శుభాభినందనలు.
జంట చూడ ముచ్చటగా ఉన్నది.
ఇంక మీ షడ్రుచులు కొత్త అల్లుడిపై ప్రయోగించండి మరి :)

kaartoon.wordpress.com

మన బాల్యం ఇంకా మరచిపోక అల్లరి చేస్తుంటె పిల్లలు పెద్దవాళ్ళై
ఓ ఇంటి వాళ్లవుతుంటే ఎంత ఆనందం! ఈ ఆనంద సమయాన
మీ ప్రతి ఒక్కరికీ మా ఇంటిల్లిపాది శుబాకాంక్షలు !!

జ్యోతి

వేణూ శ్రీకాంత్, Vinay and Madhuri,dhaatri, ప్రసీద, రవి, జయ,బులుసు గారు, విజయమోహన్ గారు, రాజి, వెంకట్, జగ్గంపేట,kri, John, మోహన, శారద, ఎన్నెల,సౌమ్య, అప్పారావుగారు..

మీ ఆశీస్సులకు ధన్యవాదాలు..

జ్యోతి

భావన,,

పదహారు రోజులా?? అంత తీరిక, ఓపికి ఎవరికుంది చెప్పు? నిన్నే అట్లు పోసి, చాట కొట్టి పదహారుపండగ చేసాము. చుట్టాలందరూ వెళ్లిపోయారు..

మైత్రేయి...

మీకో సంగతి చెప్పనా? అసలు నేను షడ్రుచులు వెబ్ సైట్ మొదలెట్టడానికి కారణం మా అల్లుడే..

సుధామగారు, పిలవగానే పెళ్లికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నిజంగా మల్లాదిగారు రావడం అదృష్టమే అనుకుంటాను.

జ్యోతి

మా అమ్మాయి పెళ్లికి విచ్చేసిన బ్లాగు మిత్రులు మాలాకుమార్,శ్రీలలిత, పిఎస్ఎమ్. లక్ష్మి, సుజాత, చింతా రామకృష్ణగారు,రాఘవేంద్ర నూతక్కి, చదువరి, చావా కిరణ్, అన్నింటికి మించి ప్రముఖలు సుధామ, మల్లాది వేంకట కృష్ణమూర్తిగారు( ఆయన ఇచ్చిన బహుమతి అమూల్యం),రెండు రోజుల ముందుగా కెనడా నుంఢి బహుమతి పంపిన ఎన్నెలకు, ముందురోజు పూనేనుంఢి మా ఇంటికి వచ్చిన భమిడిపాటి ఫణిబాబుగారు, మరియు సహృదయంతో ఆశీర్వదించిన మిత్రులందరికి హృదయపూర్వక నమస్కారములు..

సుజాత వేల్పూరి

మల్లాది గారు ఇచ్చిన గిఫ్టేమిటో చెప్పండి, అమూల్యం అని సస్పెన్స్ లో పెడితే ఎలాగ?

జ్యోతి

సుజాతగారు, అన్నిటికంటే అమూల్యమైనది పుస్తకమే కదండి.. మల్లాదిగారు రాసిన రెండు వంటల పుస్తకాలు (నాకు పనికొచ్చేవే), Quiet Moments with God (నాకు చాలా అవసరమైనదే).. ఇచ్చారు..

తృష్ణ

Hearty wishes to the new couple.

ఇందు

Hearty Congratulations Jyothi garu. Happy married life to Deepthi&Ajay :)

Bolloju Baba

i wish them happy married life

మరువం ఉష

నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు.

సంతోషం జ్యోతి - నీకు అభినందనలు.

ఊ, అయితే తద్దులు తీర్చేశారన్నమాట, మరి పదహారు పళ్ళ నోమో? నన్ను పేరంట్రాండ లెక్కల్లో వేయటం మానమాక!

Rajesh Pediredla

Jyothi garu....samethala kosam chusthe me blog kanipinchindhi adubhutham asalu...kotha intiki ochha inka adbhutam....chala bagundhi me blog...me ammai ke na tarupuna subhakanshalu.... :) :)

లత

అభినందనలు జ్యోతిగారూ,నూతన దంపతులకు ఆశీస్సులు

Anonymous

జ్యోతిగారూ, ఇప్పుడే చూశాను శుభవార్త. హృదయపూర్వక అభినందనలు. - మాలతి

జ్యోతి

ఇందు, బొల్లోజు బాబాగారు, రాజేష్, లత ధన్యవాదాలు.
ఉష.. తప్పకుండా నా ప్రియమిత్రులందరికి వాయినాలు ఇప్పిస్తాగా..కలిసినప్పుడు మీకు ఇస్తాలే. (ఒక్కసారైనా కలవకపోతామా అనే ఆశ ఉందిలే..)
మాలతిగారు. ధాంక్స్ అండి.. better late than never.. :))

చిన్నమయ్య

నూత్న దంపతులకి శుభాశీస్సులు. కొత్త కాపురం నిత్య కల్యాణం, పచ్చతోరణంగా వర్ధిల్లాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను. కన్యాదాన ఫలాన్ని వెనకేసుకున్న మీరిరువురికీ అభినందనలు.

ఆవకాయ

మీ అమ్మాయి వంటలు సాక్షి లో చూసాను ఈరోజు. తల్లికి తగ్గ తనయ అన్నమాట :)

జ్యోతి

చెన్నమయ్యగారు ధన్యవాదాలు
తెలుంగిటమ్మాయిగారు, భలే గుర్తుపట్టారండి.. ధాంక్స్.. ఇక రాబోయే కోడలు కాస్తో కూస్తో శంట చేసి పెడితే తిని కూర్చోవాలని ఉంది. :))

sunny

Hearty Congratulations

Deepthi&Ajay

i wish them happy married life

sandhya

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008