Thursday 3 March 2022

మాలిక పత్రిక మార్చ్ 2022 సంచిక విడుదల

 

 
 
Jyothivalaboju
Chief Editor and Content Head
 
 
 
పాఠక మిత్రులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు మాలిక పత్రిక తరఫున హార్ధిక స్వాగతం.  
 
ప్రపంచ వ్యాప్తంగా  ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితికి  చేరుకుంటుందన్న శుభవార్త హర్షణీయం..అందరూ బాగుండాలి. అందులో మనముండాలి.

మాలిక పత్రికలో అందరినీ అలరించే కథలు, వ్యాసాలు, కవితలు, సీరియల్స్, సమీక్షలు, కార్టూన్లు తీసుకొస్తున్నాము. ఇందులో ప్రముఖ రచయితలు, రచయిత్రులెందరో ఉన్నారు. అలాగే ఔత్సాహికులకు మాలిక ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. అప్పుడప్పుడు పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. 
ఈ సారి ఒక కొత్త ప్రయోగంలాటి పోటీ మీకోసం. 
మణికుమారి గోవిందరాజులగారి సీరియల్  'ధృతి' పాఠకులను అలరిస్తోంది. ఎంతో ఆసక్తిగా సాగుతోన్న ఈ సీరియల్ ఈసారి తొమ్మిదవ భాగం ప్రచురింపబడింది. వచ్చే మాసం ఏఫ్రిల్ సంచిక కోసం పదవ భాగం రచయిత్రి రాయరు, ఈ సీరియల్ ని క్రమం తప్పకుండా చదువుతోన్న పాఠకులే రాయాలి.. ఇన్ని భాగాలు చదివిన మీరు వచ్చే పదవ భాగం ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఆలోచించి రాయండి.. వర్డ్ లో  మూడు లేదా నాలుగు పేజీలు ఉండాలి. తర్వాత పదకొండవ భాగం రచయిత్రి అందుకుంటారు. ఈ సీరియల్ నిర్మాణంలో మీరు కూడా పాల్గొంటున్నారన్నమాట.. అంతే కాదు. ఈ పోటీకి వచ్చిన కథాభాగాలన్నీ రచయిత్రి చదివి చాలా బాగున్నదని అనిపించిన రచనకు బహుమతిగా రూ.1000 ఇవ్వాలనుకుంటున్నారు. 
ఇంకెందుకు ఆలస్యం . త్వరపడండి.. ఈ ప్రయోగం రచయిత్రికి, పాఠకులకు కూడా ఒక ఛాలెంజ్ లాంటిది.. 
ధృతి సీరియల్ చదవడానికి ఈ లంకె ని చూడండి
 
 
 మీరు రాసిన పదవ భాగం కథను ఈ చిరునామాకు maalikapatrika@gmail.com కు మార్చ్  15 వరకు పంపించాలి.. త్వరపడండి.


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com



 
 
 
 
 
 
 
 
 

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008