Sunday, 2 October 2011

సంగీత (రాగ) లహరి - 1





ఈ నెలలో కొన్ని ప్రత్యేకమైన టపాలు రాయాలనుకుంటున్నాను. అవి సంగీతానికి సంబంధించినవి. మామూలుగా మధురమైన పాటలను ఆస్వాదించడం, మళ్లీ మళ్లీ వినడం చిన్నప్పటినుండి అలవాటు.. రాగాలు అవీ అంతగా తెలీదు. కాని కర్నాటక సంగీతంలో రాగాల ఆధారంగా తయారైని సినిమాపాటల గురించి తెలుసుకోవాలి, రాయాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇది ఇప్పటికి కుదిరింది. ఈ రాగాల పాటలు రాయడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఎప్పుడో రెండు తక్కువ ముప్పై ఏళ్ల క్రింద వదిలేసిన వీణ మళ్లీ తెచ్చుకున్నాను. మరి దానికోసం సంగీతం గురించి తెలుసుకోవాలిగా.. ఇంటో విషయం చివరలో చెప్తాను. ఈ పాటల గురించి ఏడాది క్రింద రహ్మతుల్లాగారు చెప్పారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. సంగీతానికి సంబంధించిన వివరాలను రాఘవ ఇస్తున్నాడు. తప్పులుంటే చెప్పండి. మరిన్ని విషయాలు , వివరణలు కాస్త చెప్పుదురూ... .. ఇది ఒక టపాలా కాకుండా సీరీస్ లా రాద్దామని అనుకుంటున్నా.. ...



భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం. ఈ రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 చక్రాలుగా వర్గీకరిస్తారు. ఇందు నేత్ర అగ్ని వేద బాణ ఋతు ఋషి వసు బ్రహ్మ దిశ రుద్ర ఆదిత్య అని పేర్లు. ఒక్కొక్క సమూహాంలో ఆఱు మేళకర్త రాగాలు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు
ఆరోహణ, అవరోహణలను బట్టి రాగాలను రెండుగా విభజించారు. జనక రాగాలు, జన్య రాగాలు.

జనక రాగాలను మేళకర్త రాగాలు, సంపూర్ణ రాగాలు అంటారు. ఇవి 72 ఉన్నాయి. మేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.

ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలు ఉంటాయి.
ఆరోహణ, అవరోహణలోని సప్తస్వరాలు క్రమ పద్ధతిలో వరుస మారకుండా ఉంటాయి.
ఆరోహణలో ఏఏ అంతర గాంధారాది క్రమం ఉంటే, అవరోహణలో కూడా అదే క్రమం ఉంటుంది.


అన్ని రాగాలు కాకున్నా కొన్ని ముఖ్యమైన రాగాలు ముందు ఎంచుకున్నాను. ఆడియో లేదా వీడియో ఏది వీలైతే అది పెడతాను..

ఆనందభైరవి



సువ్వీ కస్తూరిరంగ - చిల్లరకొట్టు చెట్టెమ్మ
పిలచిన మురళికి - ఆనందభైరవి
పలుకే బంగారమాయెరా - అందాల రాముడు
పలుకే బంగారమాయెరా - శంకరాభరణం
ఆనందభైరవి--22వ మేళకర్త ఖరహరప్రియ జన్యం. వక్రం. భాషాంగం. రక్తిరాగం. మూర్ఛన సగ2రి2గ2మ1పద2పస - సని2ద2పమ1గ2రి2స. కాకలినిషాద, అంతరగాంధార, శుద్ధదైవతములు అన్యస్వరాలు. కాకలినిషాదప్రయోగం నేడు వినబడటంలేదు. అత్యంతప్రాచీనమైన రాగాలలో ఒకటి. జానపదుల పాటలలోనూ వినబడుతుంది. జావళీలూ, పదాలూ, లాలిపాటలూ, పెళ్లిపాటలూ ఈ రాగంలో అధికం. ఈ రాగాన్ని సాధారణంగా నెమ్మదిగా పాడుతారు. అందువలన నృత్యానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాగాన్ని మంద్రస్థాయి నిషాదంకంటె క్రింద పాడకూడదని, సంగీత త్రిమూర్తులలో శ్యామాశాస్త్రిగారు ఈ రాగాన్ని పునరుద్ధరించారనీ అంటారు. త్యాగరాజు ఈ రాగాన్ని కూచిపూడి భాగవతులకు వదిలివేసారనీ ఐతిహ్యం కూడా ఉంది. రీతిగౌళ ఆనందభైరవికి కొంచెం దగ్గరగా ఉండే రాగం.


ఆభేరి





మధురం మధురం సమయం - భార్యాభర్తలు
నా కంటి పాపలో నిలిచిపోరా - వాగ్దానం
నిండు చందమామ - బంగారు తిమ్మరాజు
ఒకటే హృదయం కోసము - చదువుకున్న అమ్మాయిలు
రారా కౌగిలి చేర - పిడుగు రాముడు

అభేరి-- 20 మేళకర్త నఠభైరవి జన్యం. ఉపాంగం. మూర్ఛన సగ21పని2 - సని22పమ12రి2. నగుమోము గనలేని నా జాలి తెలసి అన్న త్యాగరాజకృతి రాగంలోదే. ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన మల్లీశ్వరి చిత్రంలోని ఆకాశవీథిలో హాయిగా ఎగిరేవు పాట కూడా ఇదే రాగంలో ఉంది. హిందూస్థానీ సంప్రదాయంలో దీనికి భీంపలాస్ అని పేరు. కర్ణాటకసంప్రదాయంలోనే దీనికి కర్ణాటకదేవగాంధారి అని మరో పేరు ఉంది.


ఇంకా ఎన్నో రాగాలు మరెన్నో సినీ గీతాలు ముందు ముందు...

7 వ్యాఖ్యలు:

prabhakar

very nice idea jyothi garu...naa daggara oka collection of details ye ye raagalalo ye ye patalu vasthayo (konni net lonchi theesukunnanu..konni nenu add chesanu..meeku help avuthundanukunte aa details meeku pampisthaa...andulo only raagam peru aa raagam lo Ee songs vuntayo list untundi anthey...poorthi lyrics gaani..video gaani vundadu..OK

మరువం ఉష

మంచి ఆలోచన జ్యోతి. ఇలాగే ఈమాట లో "రాగలహరి" పేరిట శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న గారి రచనలు వచ్చాయి - నాకవి చాలా చాలా సమాచారాన్నిచ్చాయి. నీ వ్యాసాలు మరింత పుష్టిని కూరుస్తాయని అనుకుంటూ.. ఆల్ ద బెస్ట్...

కొత్త పాళీ

మంచి ఆలోచన. అభినందనలు.
త్యాగయ్య సినిమా నించి పెట్టిన తునకలో పోతన భాగవతం నుండి నల్లని వాడు పద్యానికి ఆ పిల్లలు చేసిన అభినయం మహా ముచ్చట గొలుపుతుంది.
ఆభేరి - మన తెలుగు జాతీయ గీతం మా తెలుగు తల్లికీ, శ్రుతిలయలు సినిమాలో ప్రఖ్యాతిగాంచిన పాట తెలవారదేమో స్వామీ కూడా ఆభేరిలోనే ఉన్నాయి.

జ్యోతి

ప్రభాకర్ గారు ధన్యవాదాలు. మీరు పంపిన ఫైల్ అందింది..

ఉష... ధాంక్స్. ఈ వ్యాసాలు వెతికి పట్టుకున్నాను. తప్పకుండా చదువుతాను.

కొత్తపాళీగారు మీరు చెప్పింది నిజమే. మా తెలుగుతల్లి పాట ఆభేరిలో ఉంది. నేను సినిమాపాటలు మాత్రమే అనుకున్నా కాబట్టి బుల్లెట్ సినిమాలో ఉన్న ఈ పాట కోసం చాలా వెతికాను దొరకలేదు. ప్రైవేట్ ఐతే టంగుటూరి సూర్యకుమారి పాట ఉంది నా దగ్గర. మళ్లీ ట్రాక్ సైడ్ అవుతుందని పెట్టలేదు. మళ్లీ ట్రై చేస్తాను. తెలవారదేమో స్వామి పాట కూడా దొరకలేదండి. ఈ పాటలు వెతికి ఒక చోట పెట్టడానికి చాలా టైమ్ పట్టింది. మళ్లీ ట్రై చేయాలి.
ఇంకో ఐడియా కూడా వచ్చింది ఈ రాగాల ఆధారంగా ఉన్న కృతులు, కీర్తనలు కూడా చేరుద్దామా అనుకుంటున్నా.. రాగాల గురించి శోధిస్తుంటే ముందు శ్యామశాస్తి, త్యాగయ్య కృతులు , కీర్తనలే కనిపించాయి. చూడాలి..

Nrahamthulla

బాగుంది.కొనసాగించండి.

Ennela

baagundandee

sai sravya varali kovvali

wow!! jus' luvd it!!!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008