Friday, 30 September 2011

చిత్రకల్పన చాటువులు

చిత్రకల్పన చాటువులు

ఒక నంబర్ మనసులో అనుకోండి. దానికి అది కలపండి, ఇది తీసేయండి అని ఆ నంబర్ చెప్పేస్తారు. ఆ ఆట గుర్తుందా. మీరు ఆడారా?? అలాంటిదే తెలుగు సాహిత్యంలో కూడా ఉంటే ఎలా ఉంటుంది?? మన మనసులో అనుకున్నది అవతలి వ్యక్తి చెప్పేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అదెలా? అంటే...అలా చెప్పే మాయమంత్రం ఉందని చెప్పేయొచ్చు.ఇవి మెదడుకు వ్యాయామాన్నిచ్చి, బుద్ధికుశలతను పెంచే మెళకువలు మాత్రమే. అలాంటి ఒక ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

ఇది దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి పద్యం..

సీ.
1. అరిభయంకర చక్రకరి రక్షసాగర
చాయ శ్రీ కర్బుర సాటియుగళ

2. నాళీక సన్నిభ నయన యండజ వాహ
వాణీశ జనక వైభవ బిడౌజ!

4. రాజీవ మందిరా రమణ బుధద్రక్ష
వరజటి స్తుత శౌరి వాసుదేవ!

8. భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమ గరుడ

16. దోష శైలేశ శశిద్రక్ష ద్రుహిణ హేళి


ఇప్పుడు తెలుగులో ఉన్న 56 అక్షరాల్లో ఏదైనా ఒకటి మనసులో తలుచుకోండి.. తర్వాత పైన పద్యంలో ఆ అక్షరం ఏయే పాదాలలో ఉందో చెప్పండి చాలు.. మీరు అనుకున్న అక్షరం నేను చెప్తాను..
అ, ఙ్, ఞ్, మాత్రం వదిలేయండి. న - ణ, ల - ళ, ర - ఱ లకు తేడా ఉండదు..

ఇదెలా అంటే క్రింద 1 నుండి 2 వరకు సెలెక్ట్ చేసి చూడండి..



1. పరిష్కార వాక్యం ఇది..
అన్నయ్య తోటి విస్సాప్రగడ కామరాజు భాషించు హేళి దాక్షిణ్యశాలి

అ - 1
న్న - 2
య్య - 3
తో - 4
టి - 5
వి - 6
స్సా - 7
ప్ర - 8
గ - 9
డ - 10
కా - 11
మ - 12
రా - 13
జు - 14
భా - 15
షిం - 16
చు - 17
హే - 18
ళి – 19
దా – 20
క్షి - 21
ణ్య- 22
శా - 23
లి - 24


ఎదుట వ్యక్తి తలుచుకున్న అక్షరం ఉన్న పాదాల నంబర్లను కూడగా వచ్చిన నంబరును ఈ వాక్యంలో చూసుకుని దానిపక్కన ఉన్న అక్షరం చెప్పండి అంతే...ఉదా... ఎదుట వ్యక్తి 'ర' అనుకున్నాడనుకోండి. అది 1, 4, 8, పాదాలలో ఉంది. ఆ నంబర్లను కూడితే 13 వస్తుంది. పైన పైన పరిష్కార వాక్యంలో 13 పక్కన ఉన్న అక్షరం ర... ఈజీగా ఉంది కదా..
2.

2 వ్యాఖ్యలు:

శశి కళ

చాలా బాగున్ది..చిన్నప్పుడు సినిమా పెర్లతొ ఆదుకొనె వాళ్ళం..

రాధేశ్యామ్ రుద్రావఝల

నమస్కారం అండీ..!
చాలా మంచి పద్యాన్ని దానిలోని పజిల్ నీ పరిచయం చేసారు ధన్యవాదాలు.
16 నెం. పాదం లో రెండు వాక్యాలు ఉండాలేమో అనుకుంటున్నాను. ఉదా. కి చ తలుచుకున్నా మనుకోండి. పరిష్కార వాక్యం ప్రకారం 17వ అక్షరం ’చ’. కానీ మీరిచ్చిన సీస పద్యం లో ’చ’ కేవలం ఒకటవ పాదం లో మాత్రమే ఉంది. అదే 16వ పాదం లో ఇంకో వాక్యం ఉండి, దానిలో’చ’ కలిగి ఉంటే లెక్క సరిపోయేది.
తప్పైతే సరి చేయగలరు.. (పద్యాన్ని కాదు, నన్నే..!)
జవాబులోని అక్షరాలను హైడ్ చేసిన మీ ఐడియా చాలా బాగుంది.
- రాధేశ్యామ్ (http://radhemadhavi.blogspot.in)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008