మస్తీ , మజా, మ్యూజిక్ జోష్... రేడియో జోష్
http://radiojosh.com/
మధురమైన సంగీతాన్ని ఇష్టపడే వారందరికీ నమస్కారం.
రేడియో జోష్ తరఫున మీకందరికి స్వాగతం... సుస్వాగతం.. ఈసారి దీపావళి పండగ సందర్భంగా దివ్వెల వెలుగులు, టపాసుల సందడితో పాటు మీకోసం మరో ధమాకా రాబోతుంది. మీరంతా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మీ రేడియో జోష్ ఈ రోజు దీపావళినాడు సకల హంగులతో మీ ముందుకు రాబోతుంది. పండగ సంతోషంలో రేడియో జోష్ పాటలతో కూడా ఎంజాయ్ చేయండి. పాటలు వింటూ మీ పని చేసుకోండి.. జస్ట్ ఒక్క క్లిక్‌తో రేడియో జోష్‌ని ఆన్‌లైన్‌లో మీ ముందుకు తీసుకురావస్తున్నందుకు మేమెంతో గర్వపడుతున్నాము. ఇంతకు ముందు మీరెప్పుడూ కనీ, వినీ ఎరుగని అద్భుతమైన ఆకర్షణలతో మీ ముందుకు వస్తుంది రేడియో జోష్. దీనికోసం అన్ని సన్నాహాలు పూర్తి అయ్యాయి. పండగరోజు మిమ్మల్ని అలరించడానికి ఆనందంలో ముంచెత్తడానికి మా రేడియో జాకీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా రేడియో జోష్ వింటూ మా రేడియో జాకీలతో సరదాగా మాట్లాడుతూ , మా లైవ్ షోస్‌ల్ పాల్గొని చాటింగ్ చేస్తూ ఆనందపు అంచులు అందుకోండి. రేడియో జోష్ 100% సంగీతంతో మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం మాకు ఉంది.
ఇక మా రేడియో జాకీల గురించి కొన్ని మాటలు. అందరూ సరదాగా మీ పక్కింటి అబ్బాయి, అమ్మాయిలా ఉంటారు. వసపిట్టలా కబుర్లు చెప్తూ మిమ్మల్ని అలరిస్తారు. మీరు కాల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీకు నచ్చినవారికోసం కూడా ఒక పాట కోరుకోండి. మా రేడియో జాకీలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, కబుర్లు చెప్పండి. అంతులేని ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి.
రేడియో జోష్‌లోని ప్రత్యేక ఆకర్షణలు మీకోసం...
ఈనాడు సెల్‌ఫోన్ కూడా కంప్యూటర్‌లా వాడుతున్నారు. అందుకే మీ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో నిరంతరాయంగా రేడియో జోష్ వింటూ చాటింగ్ చేసేందుకు అవసరమైన ఆపిల్ ఐ్‌ఫోన్ మరియు ఆండ్రాయిడ్ ఆప్స్ భారతదేశంలో మొదటిసారిగా మీకోసం తయారుచేసాం. ఇది మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే కాల్ చేసి మా రేడియో జాకీలతో పాటు సహ శ్రోతలతో కూడా మాట్లాడొచ్చండోయ్..
అమెరికా, యూరప్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో ఉన్నవారి కోసం కాల్ చేసి మా రేడియో జాకీలతో మాట్లాడదానికి ప్రత్యేకమైన ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసాం.
ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే జోష్‌తో కూడిన లైవ్ చాట్.. మా రేడియో జాకీలతో నేరుగా మాట్లాడటానికి మా సైట్‌లో దానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని హాయిగా ఎప్పుడంటే అపుడు చాటింగ్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం. ఇంతేకాకుండా ముందు ముందు మరెన్నో ఆకర్షణలతో 24 గంటలూ మిమ్మల్ని ఆనందింపచేయడానికి రేడియో జోష్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది.
మస్తీ, జోష్‌తో నిండిన సంగీతంతో మిమ్మల్ని అలరించడానికి రేడియో జోష్ వచ్చేస్తుంది. కౌంట్‌డౌన్ మొదలైంది. రేడియో జోష్ వింటూ ఉండండి.. మస్త్ మజా.. మస్త్ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి. ఈ సంతోషకరమైన వార్తను మీ సంగీతప్రియులైన మీ స్నేహితులతో పంచుకోవడం మరచిపోకండి. ఈ రేడియో యువత కోసమే కాదు అందరి కోసం. పాత, కొత్త , హిందీ, తెలుగు, ఇంగ్లీషు పాటలతో మీరు కోరినట్టుగా అందించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాం.
ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి తెలుగు సినీ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయిక్, నటుడు కృష్ణుడు విచ్చేస్తున్నారు.
Date : Wednesday 26th
October 2011
Time : 11.00 Am
Venue: Hotel Kens ,
Near Ratnadeep Super Market,
Srinagar colony ,
Hyderabad
2 వ్యాఖ్యలు:
ఇంకొన్ని గంటల్లో లైవ్ లోకి రాబోతుందండీ! రేడియో జోష్ మీద మీ టపా బాగుంది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
Post a Comment