మాలిక పత్రిక జూన్ 2024 సంచిక విడుదల
మాలిక పాఠకులు, మిత్రులు, రచయితలకు సాదర ఆహ్వానం... మండే ఎండలనుండి ఉపశమనము కలిగిస్తూ వానజల్లుల హోరు మొదలైంది. ఇది చిరుజల్లుల వరకైతే అందరికీ హాయిగా, ఆనందంగానే ఉంటుంది. కాని అది భీభత్సంగా మారినప్పుడు అందరికీ కష్టమే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏ కాలమైనా సాధారణంగా ఉంటే అంతా బావుంటుంది. తీవ్రంగా మారినప్పుడే ఇబ్బందులు మొదలై అమ్మో అనుకుంటాం. కాలానుగుణంగా ఆహారం, ఆహార్యం అన్నీ మారతాయి. మల్లెల కాలం చివరికొచ్చింది. సన్నజాజుల సువాసనలు మొదలయ్యాయి వాన జల్లులకు తోడుగా... ఏది ఏమైనా కాలం ఆగదు... మాలిక పత్రికలోని వివిధ అంశాలు మీకు నచ్చుతున్నాయని నా నమ్మకం. కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, సినిమాలు, సంగీతం, యాత్రలు.. ఇన్ని అంశాలతో మరోమారు మీ ముందుకు వచ్చింది జూన్ మాసపు మాలిక. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు విశేషాలు:
1. సుందరము సుమధురము – తాను నేను మొయిలు మిన్ను
2. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -10
4. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 11
5. తెల్ల కాగితం
6. అమ్మమ్మ – 57
10. క్షమించు నాన్నా!
11. నేస్తం
13. ప్రత్యేకత
0 వ్యాఖ్యలు:
Post a Comment