" చీర " సొగసు చూడ తరమా?
అసలే అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా అలా నడిచివస్తుంటే, చుక్కలన్నీ రాలి ఆమె చీర కొంగులో ఒదిగిపోగా, మలయమారుతంలా ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా తరమా? చీర .. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. వనితను నిలువెల్లా కప్పి ఆమెను దాచిపెట్టి, పెట్టకుండా మరింత అందంగా చూపిస్తుంది. ఈరోజుల్లో అమ్మాయిలు మరీ మాడర్న్ ఐపోవడంతో చీర కట్టడం చాలా తగ్గించారు/ మానేసారు అని అంటారు కాని పెళ్ళిళ్లకు వెళ్లి చూడండి. రంగు రంగుల, తళుకు బెళుకుల చీర కట్టిన అమ్మాయిలతో కళకళలాడిపోతూ ఉంటుంది. నాడైనా, నేడైనా, భారతీయ వనితలకు మరింత వన్నె తెచ్చేది మేలైన చీర. ఎంత అభివృద్ధి చెందినా , ఎన్ని ఆధునిక వస్త్రధారణలైనా ఈ చీరకున్న గొప్పదనం చెక్కుచెదరనిది. అందుకే ఈ చీర అనే అంశం మీద పద్యాలు రాయమని అడగగానే వైవిధ్యమైన పద్యాలు అందించారు జె.కె.మోహనరావుగారు, ఆచార్య ఫణీంద్రగారు, డా.అనిల్ మాడుగులగారు, రవిగారు, టేకుమళ్ల వెంకట్ గారు. ఇక ఈ పద్యాలను విశ్లేషించి అందమైన వ్యాఖ్యానంతోపాటు తనవంతు పద్యాలను ఇచ్చారు బ్నింగారు. ఈ అంశం చీర కు తగినట్టుగా చిత్రాన్ని ఇచ్చారు ఉదయ్ కుమార్ గారు, పద్యాలను రాగయుక్తమైన శ్రవ్యకాలుగా మార్చి ఇచ్చారు పందిళ్ల శేఖర్ బాబుగారు. వీరందరికి మాలిక పత్రిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పద్యాలను విశ్లేషిస్తూ, సిస్తూ బ్నింగారికి చీర మీద ఇంకా ఇంకా పద్యాలు రాయాలనే కోరిక పుట్టింది. అది కూడా శతకం. ఆల్రెడీ పని మొదలెట్టారు. పద్యాలన్నింటిని పుస్తకంగా కూడా వేయిస్తున్నామన్నారు.. బ్నింగారు అభినందనలు.. మేము కూడా పుస్తకం కోసం వెయిటింగ్....
మరి ఈ చీర సొగసు గురించి చదవండి మాలిక పత్రికలో
"చీర" సొగసు చూడ తరమా??
4 వ్యాఖ్యలు:
'చీర్స్'! !
జిలేబి
ఈ శీర్షిక చాలా బాగుగా వ్రాసినారు.
పిక్ అదిరిందండి.....అందరూ ఒకరిని మించి ఒకరు రాసేసారు. అందరికీ అభినందనలు
అందరికీ ధన్యవాదాలు
Post a Comment