మాలిక పత్రిక డిసెంబర్ 2013 సంచిక విడుదల
మాలిక పత్రిక ఈ సంవత్సరంలో డిసెంబర్ 2013 సంచిక విడుదల అయింది. ఈ సంచికలో మీకు నచ్చే, మీరు మెచ్చే సీరియళ్లు, పుస్తక సమీక్షలు, కవితలు చోటు చేసుకున్నాయి. జనవరినుండి మరిన్ని కొత్త శీర్షికలు మిమ్మల్ని అలరించగలవు.
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org
మాలిక పత్రిక ఈ నెల సంచికలోని విశేషాలు:
0. పుస్తకాల పండగ గురింఛిన సంపాదకీయం
పుస్తకం హస్తభూషణం
1. బ్నింగారు రచించగా ఝాన్సీ గళంలో ఈ సారి పెళ్లానికి ప్రేమలేఖ గురించి ఏం చెప్తున్నారో మరి
పెళ్లానికి ప్రేమలేఖ
2. పసుపులేటి గీతగారు అద్దం గురించి చెప్పే ముచ్చట్లు
అద్దం
3. ఈసారి మోహనరావుగారు మధుశాల గురించి చెప్తున్నారు.
మధిర - మధుశాల
4. శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి సీరియల్ లో దేదీప్య, అభిరాంల మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిందా..
మౌనరాగం - 2
5. అబ్దుల వాహెద్ గారు ఈసారి కూడా షకీల్ బదాయూనీ గజల్స్ వివరిస్తున్నారు.
గజల్స్ - షకీల్ బదాయూనీ
6. మంధా భానుమతిగారు చారిత్రక సాహిత్య కధలలో ఈసారి అఫురూపమైన స్నేహం గురించి చెప్తున్నారు.
తెలుగు వెలుగుల స్నేహం
7. గాసిప్స్ కాదు ఉపయుక్తమైన Gausips అంటూ స్త్రీలలోని గర్భాశయ సమస్యలగురించి వివరాలు అందిస్తున్నారు డా.గౌతమి.
గర్భాశయపు సమస్యలు -1
8. ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారి కొత్త పుస్తకం గురించి జి.ఎస్.లక్ష్మిగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు...
కొంచెం ఇష్టం - కొంచెం కష్టం
9. మీకు కవితలు తెలుసుకదా. పెద్ద కవితలు, చిన్న కవితలు కాక ఏకవాక్య కవితలను రచించి వాటిని ఒక పుస్తకంలా అచ్చువేసారు. మరి ఆ పుస్తకం గురించి జగద్ధాత్రి ఏం చేప్తున్నారో చూడండి..
ఏకవాక్యం రసాత్మకం
10. మీకు హైదరాబాదు చుట్టుపక్కల ఎన్ని సందర్శనీయమైన ఆలయాలు ఉన్నాయో తెలుసా. ఒక్కరోజులోనే ఆ ఆలయాలకు వెళ్లి రావొచ్చు కూడా . నమ్మట్లేదా. ఐతే ఈ పుస్తకం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
యాత్రాదీపిక
11. సంగీత దర్శకుడు సురేష్ మాధవపెద్దిగారు ఈసారి సరిగమలు-గలగలలులో పెండ్యాల నాగేశ్వరరావుగారి గురించి తన అనుభవాల గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
సరిగమలు - గలగలలు 3 - పెండ్యాల
12. ప్రధానమంత్రిమీద హత్యాయత్నం జరగబోతుందని చెప్పడానికి దిశ ఎంతగా ప్రయత్నించిన జరగవలసిన దారుణం జరిగిపోయింది.
సంభవం - 7
13. పాకిస్తాన్ లో చిక్కుపడ్డ చైతన్య, ప్రనూష మొదలైనవారు క్షేమంగా తిరిగివచ్చారా? అక్కడే సైన్యం చేతిలో హతమయ్యారా? ఈ సీరియల్ చివరిభాగంలో చదవండి..
ఆతడే ఆమె సైన్యం - 6
1 వ్యాఖ్యలు:
ఎప్పుడూ విందును నోటికి అందించే జ్యోతి ఈ డిసెంబర్ మాలికలో ' పుస్తక ' విందు కావించడం హర్షించదగిన విషయం.
Post a Comment