జె.వి.పబ్లికేషన్స్ నుండి నవ్వుల నజరానా “ ఫేస్‌బుక్ కార్టూన్లు”
అతివేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోని నలుమూలలనున్న వారందరి మధ్య దూరాన్ని తగ్గించి ప్రతీక్షణం అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది అని అందరూ ఒప్పుకునే విషయమే. అనుకున్న క్షణంలోనే వేలమైళ్ల దూరాన ఉన్నవారితో మాట్లాడవచ్చు. చూడవచ్చు, చర్చించవచ్చు. ఇలాటి దూరాన్ని మరింత దగ్గరగా చేసి, ఎందరినో కలిపిన ఒక అద్భుతమైన అంతర్జాల మాధ్యమం - ఫేస్‌బుక్.. ఈనాడు స్కూలు పిల్లలనడిగినా చెప్తారు ఫేస్‌బుక్ అంటే ఏంటో. అంతగా అలవాటుపడిపోయారందరూ. ఇప్పుడు కంప్యూటర్, లాప్టాప్ లో మాత్రమే కాకుండా మొబైల్, ఐపాడ్ వంటి చిన్న సాధనాలలో కూడా అంతర్జాలం ఉపయోగించుకోగలిగే సదుపాయం ఉండడంవల్ల ఇంటి అడ్రస్ ,మెయిల్ అడ్రస్ లాగా ఫేస్‌బుక్ ఐడి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఆర్టిస్టులు, చిత్రకారులు, నటులు, కార్టూనిస్టులు, కళాకారులు... ఇలా అందరూ తమ తమ ఆసక్తి మేరకు ఫేస్‌బుక్ ని ఉపయోగించు కుంటున్నారు. సృజనాత్మకత ఉన్న కళాకారులకైతే ఇది ఒక వరంలాంటిది అని చెప్పవచ్చును. తమ కళను తమదైన శైలిలో పదిమందితో పంచుకోవడం. వచ్చిన ప్రశంసలు, విమర్శలతో మరింత మెరుగుపరచుకోవడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం జరుగుతోంది.
అలాటి కోవలోకి వస్తారు ప్రముఖ కార్టూనిస్టులు రాజుగారు, లేపాక్షిగారు. ప్రముఖులు అంటే ప్రపంచమంతా తెలిసిన పెద్దవారు, గొప్పవారు, టీవీలు, పేపర్లలో కనిపించేవారు అని కాదు. వారి కార్టూన్ల ద్వారా ఫేస్‌బుక్ లో సంచలనం సృష్టిస్తూ ప్రతీరోజూ వారి కార్టూన్లకోసం ఎదురుచూసేలా చేస్తున్నవారు, అందరి అభిమానాన్ని పొందినవారు ప్రముఖులే కదా.. కార్టూనిస్టులుగా వీరిద్దరూ కేవలం అందరినీ నవ్వించడానికి ఏదో ఒక పిచ్చి కార్టూన్లు వేయడం కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా విభిన్నమైన అంశాలమీద తమదైన శైలిలో కార్టూన్లు వేసి నవ్విస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు. ఈ కార్టూనిస్టులు, వారిని వారి బొమ్మలను ఇష్టపడే వారందరూ కలుసుకునే ఒకే వేదిక ఫేస్‌బుక్. మరి అదే ఫేస్‌బుక్ మీద వేసిన కార్టూన్లు ఇంకెంత సంచలనాన్ని సృష్టించి ఉండాలంటారు. ఫేస్‌బుక్ ఒక వ్యసనంగా మార్చుకున్న వారందరికోసం, వారందరిమీద వేసిన ఫేస్‌బుక్ కార్టూన్లను ఒక దగ్గర చదవడం అందరికీ ఇష్టమే. ఒకరైతే సరి ఒకరికి మరొకరు కలిస్తే ఏముంది. ఢమాల్..
ఈ కార్టూనిస్టుల గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పను. వారి బొమ్మలే వారిని పరిచయం చేస్తాయి. ఫేస్‌బుక్ మీద వారిద్దరూ వేసిన కార్టూన్లను ఒకే పుస్తకంగా చేసి అందరికీ నవ్వులు పంచాలనే ఆలోచన చేసింది జె.వి.పబ్లికేషన్స్. మా సంస్థ ద్వారా వస్తున్న మొదటి స్వంత పుస్తకం రాజు ఈఫూరిగారు, లేపాక్షి రెడ్డిగారు వేసిన ఫేస్‌బుక్ కార్టూన్ల పుస్తకం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం..
ఇదే మా నవ్వుల నజరానా
అన్ని పుస్తకాలలాగా కాకుండా ఇద్దరు ఉద్ధంఢుల కార్టూన్లని ఒక వినూత్నమైన రీతిలో అందజేస్తున్నాం. Two in One అన్నట్టుగా ఒక వైపునుండి రాజుగారు, ఒక వైపునుండి లేపాక్షిగారు తమదైన కవర్, ప్రొఫైల్, కార్టూన్లతూ మిమ్మల్ని అలరించబోతున్నారు..
రాజు ఈపూరి ..... లేపాక్షి
నిన్ననే ప్రింటింగ్ కి వెళ్లిన ఫేస్‌బుక్ కార్టూన్ల పుస్తకానికి ఫేస్‌బుక్ మిత్రులకు ముఖ్యంగా రాజుగారు, లేపాక్షిగారి మిత్రులందరికీ పబ్లిషర్ తరఫున నెలరోజులవరకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ కార్టూన్ల పుస్తకం ఖరీదు రూ.120. ప్రత్యేక ఆఫర్ గా మీకు రూ 100 కే, పోస్టల్ చార్జెస్ లేకుండా మీ ఇంటికే పంపబడుతోంది... పుస్తకాలు కావలసినవాళ్లు ఎన్ని కాపీలు కావాలన్నది, మీ చిరునామా నా మెయిల్ అడ్రస్ కు పంపగలరు. పుస్తకం మార్కెట్లోకి రాకముందే మీ సొంతం చేసుకోండి మరి..
jyothivalaboju@gmail.com
జ్యోతి వలబోజు
CEO , జె.వి.పబ్లికేషన్స్
1 వ్యాఖ్యలు:
హా. హా ..జ్యోతీ.. పుస్తకం చదవకుండానే నవ్వు వచ్చేస్తోంది. కార్టూనిస్టులకూ, ప్రచురించిన మీకూ అభినందనలు. J.V.publications నుంచి వచ్చిన ప్రథమ ముద్రణ విజయవంతం కావాలని ఆశిస్తూ, మరెన్నోఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ మొదటిమెట్టు ఆలంబన కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను. Wish you all the best. God bless you.
Post a Comment