ప్రతి చిత్రం.. నాలోపలి ఒక అలసట లేని నది..! ---- ఒక ఆర్టిస్టు అంతరంగం
ఒక చిత్రం చూడగానే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన స్పందన కలుగుతుంది.. ఆ భావాలు, భావనలు ఆ చిత్రకారుడి ఆలోచనలతో ఏకీభవించవచ్చు లేదా విభిన్నంగా ఉండొచ్చు. తన మనసులోని ఆలోచనలకు, భావాలకు, సంఘర్షణలకు రచయిత తన రాతలలో ఒక రూపాన్నిస్తే, చిత్రకారుడు వాటిని తన చిత్రంలో పొందుపరుస్తాడు. ఆర్టిస్ట్ తన చిత్రంలోని భావాలకు అక్షరరూపం కూడా ఇస్తే… ఆతని చిత్రంలో ఆ భావాలన్ని అద్భుతంగా ప్రతిఫలిస్తాయి.. కళ ఒకరి సొత్తు కాదు. కాని ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రత్యేకమైన కళ ఉంటుంది. అది కొందరు జీవనోపాధిగా మార్చుకుంటారు. మరికొందరు తమ జీవితానికి అన్వయించుకుంటారు. ఈ చిత్రకారుల చేతుల్లో ఏం మాయ ఉందో? ఏం మంత్రం ఉందో కాని వాటినుండి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అలా జాలువారతాయి. చిత్రాలు గీయడం అంత సులువైన పని కాదు. ప్రతీ చిత్రంలోని ఒక్కో గీత కూడా ప్రాణం పోసుకుని మనకు ఎన్నో ముచ్చట్లు చెబుతాయి. ఎందుకంటే అవి ఆ చిత్రకారుడి చేతిలోని కుంచెనుండి కాక అతని మనసు నుండి వచ్చినవి కాబట్టి. మనీకోసం వేసిన చిత్రాలు పోస్టర్స్ అవుతాయి, ఆత్మతో సమ్మిళితమైన మనసుతో వేసిన చిత్రాలు పెయింటింగ్స్ అవుతాయని చిత్రప్రేమికులందరూ అంగీకరించే మాట.. అది రోడ్డు మీద గీసిన దేవుడి చిత్రమైనా, కాన్వాస్ మీద గీసిన బొమ్మైనా కావొచ్చు..
ఎవరన్నారు చిత్రాలు మాటలాడలేవని? నిశితంగా పరిశీలిస్తే ఆ చిత్రాలు చెప్పే కధలెన్నో, కబుర్లెన్నో… కళాప్రేమికుల హృదయాలను కొల్లగొట్టి, మధురమైన జ్ఞాపకాలను వెలికితీసే రంగులు, గీతలు ఎన్నో ఎన్నెన్నో..ఇలా ఎన్నో రంగుల మేళవింపుతో వేసిన తన విభిన్నమైన చిత్రాలతో ఇటీవల హైదరాబాదులో చిత్రప్రదర్శన ఏర్పాటు చేసిన చిత్రకారుడు కృష్ణ అశోక్ గారితో చిన్న మాటామంతి.. అతని మాటలలో అతనిగురించి, అతని కళ గురించి తెలుసుకుందాం.
http://magazine.saarangabooks.com/2014/02/05/ప్రతి-చిత్రం-నాలోపలి-ఒక-అ/
ఇటీవల హైదరాబాదులో Beyond Coffee లో చిత్రప్రదర్శన జరిగిన సమయంలో Krishna Ashokగారితో చేసిన మొట్టమొదటి ప్రత్యక్ష ఇంటర్వ్యూ.....