మాలిక పత్రిక పదచంద్రిక - ఆగస్టు 2014 ఫలితాలు
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. అగస్టు 14 పదచంద్రికకి అనూహ్య స్పందన
వచ్చింది. సమాధానాలు కింద ఇచ్చాం. పూరణలు పంపినవారు శ్రీ మాచర్ల హనుమంతరావు,
శ్రీమతులు బాలసుందరిమూర్తిగారు, భీమవరపు రమాదేవిగారు, కాత్యాయనీదేవిగారు,
శుభావల్లభగారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు మరియు పగడాల తేజస్వినిగారలు. వీరిలో మొదటి ఐదుగురు అంటే శ్రీ మాచర్ల హనుమంతరావు,
శ్రీమతులు బాలసుందరిమూర్తిగారు, భీమవరపు రమాదేవి గారు, కాత్యాయనీదేవి గారు,
శుభావల్లభ గారు, యమకరెక్టుగా
నింపారు. ఒకరకంగా చెప్పాలంటే వారి పూరణలు
మా కీ సొల్యూషను తో దాదాపు పూర్తిగా సరిపోయాయి. J చదరంగంలో వాడే చెక్ లేదా షా –రెండింటినీ
కరెక్టుగానే పరిగణించాం. అగస్టు 14 గడిలో
4 అడ్డం ఆధారం ఇవ్వడం మర్చిపోయినా (క్షమించగోరుతున్నా) సరిగా పూరించారంటే, ముందు ముందు ఏ ఆధారాల్లేకుండానే కూడా
పూరించేయగలరేమో మన పాఠకులు :) సత్యసాయి కొవ్వలి
విజేతలకు అభినందనలు... బహుమతులు త్వరలో అందుతాయి.. ఆలస్యానికి మన్నించాలి..