Happy Birthday My Friend....
May the sunshine of happiness always shine above you.
May the dove of peace rest over you and live in your home.
May the dense forest of love surround you all year round.
Best wishes to my beloved friend for an amazing year ahead…
Happy Birthday Friend….
May the dove of peace rest over you and live in your home.
May the dense forest of love surround you all year round.
Best wishes to my beloved friend for an amazing year ahead…
Happy Birthday Friend….
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?
అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ ... ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఆ దేవుడు మనకిచ్చాడు.
కాని మనకు మాత్రమే సొంతం పరిమితమైన స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే
వదిలిపెట్టాడు. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడు వెన్నుతట్టి నడిపే
స్నేహితుడిని నువ్వే వెతికి పట్టుకో.పదిలంగా చూసుకో అని మనకు ఒక మహత్తరమైన అవకాశం
ఇచ్చాడు ఆ దేవదేవుడు. అదీకాక నీ స్నేహితులను గురించి చెప్పు , నీ గురించి సమస్తం నేను చెప్తాను అని ఎవరో మహానుబావుడు అన్నాడు కూడా.
చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుంది అని
చెప్పలేము. ఆ బంధాలను మనం భద్రంగా చూసుకోలేమో కూడా. కాని ఇద్దరు స్నేహితుల మధ్య
ఎటువంటి ప్రతిఫలం లేకుండా , ఆడా - మగా, పేదా గొప్ప అనే తారతమ్యాలు ఉండవు.
మనం జీవితప్రయాణంలో కలిసిన ప్రతివారిని
,లేదా పలకరించి కొన్ని సార్లు ముచ్చట పెట్టిన
ప్రతీవాళ్లని అంత తేలికగా స్నేహితులుగా చేసుకోలేము కదా. "మై ఫ్రెండ్"
అని కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను మాత్రమే పేర్కొంటాము. నిజమైన స్నేహితులు అంటే
మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపట్టి దానిని పారద్రోలడానికి తమ శాయశక్తులా
ప్రయత్నిస్తారు. అంతవరకు మనని వదలరు. నేను ఎప్పుడు నీ వెంట ఉన్నాను అనే
మనోధైర్యాన్ని ఇచ్చేది స్నేహితుడే. నిజంగా
ఎటువంటి ప్రతిఫలం లేకుండా స్నేహం చేసి మన మంచిని మాత్రమే కోరుకునే ఆ స్పెషల్
ఫ్రెండ్స్ మనకే తెలీని, మనలోదాగి ఉన్న ప్రతిభని గుర్తించి ,
దానిని బయటకు తీస్తారు. అలాగే ఎప్పటికప్పుడు
మనని ఓ కంట కనిపెడుతూ ఎక్కడైనా తప్పటడుగు పడితే వెంటనే హెచ్చరించి సరిచేస్తారు. దిగులుగా ఉంటే డిస్టర్బ్ చేసి మూడ్ మారుస్తారు..
మార్చుకునేలా చేస్తారు. అంతటి అద్భుతమైన స్నేహితులను పొందడం నిజంగా మన అదృష్టం.
జీవితపు ప్రయాణంలో మనకు లక్షలు,
కోట్ల కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన
స్నేహాన్ని పొందడం ,దాన్ని పదిలంగా భద్రపరుచుకోవం చాలా
ముఖ్యం. లేకపోతే జీవితం అంటే జస్ట్ బ్రతకడానికే
తప్ప మనఃస్పూర్థిగా, అన్ని ఆనందాలను అనుభవిస్తూ సంతోషంగా
జీవించడం కాదు అని నా అభిప్రాయం..
ఒక గురువులా, శ్రేయోభిలాషిగా,
మార్గదర్శిగా అవసరమైన వేళ నేనున్నానంటూ
ధైర్యాన్నిచ్చే, సరైన దారిని వెతుక్కునేలా చేసే ఒక స్పెషల్ ఫ్రెండ్ పుట్టినరోజు
సంధర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు..
హ్యాపీ బర్త్ డే మిత్రమా...