ప్రమదాక్షరి/జె.వి.పబ్లికేషన్స్ స్టాలు - Hyderabad Book Fair 2015
సూపర్ బంపర్...
ప్రతీ సంవత్సరం డిసెంబరులో జరిగే హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు మహిళా రచయిత్రులు కలిసి నిర్వహిస్తున్న ప్రమదాక్షరి స్టాలులో పుస్తకాల అమ్మకాల కంటే పాఠకులు, రచయిత్రుల పరిచయాలు ముఖ్య ఉద్ధేశ్యంగా గత సంవత్సరం ఘన విజయం సాధించిన సంగతి మీకందరికీ తెలుసు.అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ప్రమదాక్షరి పేరిట మూడు స్టాల్స్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మరి కొందరు రచయితలు, రచయిత్రులు ప్రమదాక్షరి స్టాలులో పాల్గొంటున్నారు. ముందు చెప్పినట్టే అమ్మకాలకంటే పుస్తకాన్ని పాఠకులకు మరింత చేరువ చేయడం , పాఠకులను ప్రత్యక్షంగా కలిసి పరిచయం చేసుకుని చర్హించడం చేయాలనుకుంటున్నాము.
ఈసారి ప్రత్యేక సాహితీ ప్రాంగణంలో ప్రతీరోజు పుస్తకావిష్కరణలు, ముఖాముఖీ కార్యక్రమాలు. వేర్వేరు అంశాల మీద చర్చా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరి ఈసారి సూపర్ బంపర్ ఏమిటో తెలుసా.. మా స్టాలు చివరి నంబరైనా ఎంట్రన్స్ కి పక్కనే ఉంటుంది. అంటే పుస్తక ప్రదర్శనలోకి అడుగుపెట్టగానే మహిళా రచయితలే స్వాగతం పలుకుతారన్నమాట..
ప్రమదాక్షరి/జె.వి.పబ్లికేషన్స్ స్టాలు నంబర్లు 268,269,270...
ఎల్లుండి కలుద్దాం మరి...