మాలిక పత్రిక ఏప్రిల్ 2019 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
మా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..
షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని అందించే యుగాది సందేశంతో మరో కొత్త సంవత్సరంలోకి అడుగిడదాం. ఈ సంవత్సరంలో మీకందరికీ శుభాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ప్రతీ నెల మీరు చదువుతున్న కథలు, కవితలు, వ్యాసాలతొ పాటుగా ఈ మాసం ఒక ప్రత్యేకమైన విందును అందిస్తున్నాము. సాహిత్యం, సాంకేతికను జోడించి ఎన్ని అద్భుతాలనైనా సృష్టించవచ్చు. అలాటి కొన్ని ప్రయోగాలను మాలిక పత్రిక ప్రయత్నించి దిగ్విజయంగా పూర్తి చేసింది. అదే విధంగా గొలుసుకథలాంటి మరో ప్రయోగం. నవరసాలను కథలరూపంలో అందించాలని కొందరు మహిళా రచయిత్రులతో సంప్రదించి, ఆచరణలో పెట్టగా అందమైన కథలు వెలుగులోకి వచ్చాయి. అందరినీ అలరించాయి. ఆ తొమ్మిదిమంది రచయిత్రులు రాసిన నవరసాల సమ్మిళితమైన నవ కథలను మాలిక పత్రిక మీ అందరికోసం అందిస్తోంది. ఈ కథలన్నీ నవరసాలు..నవకథలు అన్న టాగ్ లో భద్రంగా ఉంటాయి. ఎప్పుడైనా ఆ లంకెలో చదువుకోవచ్చు. ఇక ఈ మాసపు విశేషాలు మీకోసం..
1. నవరసాలు..నవకథలు.. అద్భుతం
2. నవరసాలు..నవకథలు.. భీభత్సం
3. నవరసాలు..నవకథలు.. రౌద్రం
4. నవరసాలు..నవకథలు.. శాంతం
5. నవరసాలు..నవకథలు.. హాస్యం
6. నవరసాలు..నవకథలు.. వీర
7. నవరసాలు..నవకథలు.. కరుణ
8. నవరసాలు..నవకథలు.. భయానకం
9. నవరసాలు..నవకథలు.. శృంగారం
10. ఇల్లాలు
11. అమలిన శృంగారం
12. ఆసరా
13. చెక్కిన చిత్ర శిల్పం
14. హాలోవిన్
15. వేకువలో.. చీకటిలో
16. అమ్మమ్మ 1
17. Some బంధం
18. కాసాబ్లాంకా
19. కార్టూన్స్. జెఎన్నెమ్
20. మధ్యమహేశ్వర్
21. తేనెలొలుకు తెలుగు
22. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
23. మహాకవి శ్రీశ్రీ గురించి కొందరు ప్రముఖులు
24. కాముని పున్నమి
25. భూమి ద్వారం మూసుకుపోతుంది
26. యోగాసనం 2
27. అంబ - శిఖండి వృత్తాంతం
28. విశ్వనాథవారి భ్రమరవాసిని
29. కవితా నీరాజనమైన నివేదన
30. మార్మిక శూన్యం
31. దేనికి..?
32. ఆడంబరపు కోరికలు
33. బొటన వేళ్లు