మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
చిన్న గడ్డిపువ్వు కాని, కాగితం పువ్వు కాని, గులాబీ అయినా, బుల్లి మల్లియ అయినా, లిల్లీ అయినా, కార్నేషన్స్ అయినా పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటూనే తమ అందాలతో అందరికీ ఆనందాన్నిస్తాయి. కొన్ని అలంకరణకు వెళితే, కొన్ని తరుణుల వేణిలో వయ్యారంగా కూర్చుంటాయి, కొన్ని దేవుడి కొలువుకు వెళితే మరి కొన్ని అంతిమ ప్రయాణంలో తళుక్కుమంటాయి. అలంకరణ అయినా, ఆరాధన అయినా, అంతిమయాత్ర అయినా ప్రతీ పువ్వు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటి జీవనకాలం చాలా స్వల్పం అయినా అవి తమ రంగులు, అందాలతో అందరినీ అలరిస్తాయి. పువ్వులంటే ఇష్టపడనివారు మూర్ఖులనవచ్చు..
ఇటువంటి ఎన్నో పువ్వులను మాలగా ఈ మాసపు మాలిక మీకు అందిస్తోంది. మరిన్ని కథలు, మరిన్ని కార్టూన్లు, మరిన్ని కవితలు, సీరియళ్లతో మీ ముందుకు వచ్చేసింది అక్టోబర్ మాలిక. ఈసారి కొన్ని ఎక్కువ రచనలు ఉన్నాయి. తీరిగ్గా చదువుకోండి. మీ స్పందనను తెలియజేయండి.. పాఠకులకు, రచయితలకు రాబోయే దసరా, దీపావళి పండగ శుభాకాంక్షలు. కరోనా గుప్పిట్లో ఉండి ఏం పండగలు అంటారా.. ఆవకాయ మానలేదు, బోనాలు మానలేదు, వరలక్ష్మి అమ్మవారిని వదలలేదు. వినాయకుడిని ప్రతిష్టి,చకుండా ఉండలేదు. ఈ పండగలు కూడా తప్పకుండా చేసుకుంటాం.. కాసిన్ని ఎక్కువ జాగ్రత్తలతో.. అంతే సుమా.. దేని లెక్క దానికే..
ఒక ముఖ్య గమనిక: ఈ సంచికలోని రచనలలో మీకు కనిపించే అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు రచయితలకే స్వంతం. సంపాదకులకు సంబంధం లేదు..మీ రచనలు పంపేటప్పుడే తప్పొప్పులు, వ్యాకరణ దోషాలు అన్నీ చెక్ చేసుకుని పంపండి. లేదంటే మీ రచనలు అలాగే తప్పులతో ప్రచురించబడతాయి. మీకే నష్టం మరి.. రాయడం ఒక్కటే ముఖ్యం కాదు. అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు లాంటివి లేకుండా చూసుకోవడం రచయిత బాధ్యత..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
9.స్పందన
10.సహవాసిని
11.మూడు సాకులు
14.పూలమ్మాయి
15.హాస్యపు విరిజల్లు నవ్వుల నజరానా
18.ఉదయించాలనే….
19.కార్టూన్స్… వి.ఎస్. శాస్త్రి ఆకెళ్ల
20.కార్టూన్స్ – కె.వి. కృష్ణారావు
22.అంతా మన మంచికే – ప్రమదాక్షరి గొలుసు నవల వీడియో సమీక్ష
23.లోతైన ఆలోచనల కథలు … అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.
24.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 52
27.ఒకే గాథ…
28.వీడికోలు!
29.ఉదయ కిరణాలు
31.అయ్యో పాపం!
32.వారి సందేహం