Monday, 1 February 2021

మాలిక పత్రిక ఫిబ్రవరి 2021 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head



స్వాగతం.. సుస్వాగతం అని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి అప్పుడే నెల దాటిపోయింది కదా.. గత సంవత్సరం మొత్తాన్ని కరోనా కబ్జా చేసేసింది. ఈ సంవత్సరం వాక్సిన్ వచ్చిందనే శుభవార్త, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే వార్త మనందరికీ ఒక ఆశావహ దృక్ఫదాన్ని కలిగించాయి. అదేవిధంగా మళ్లీ ఏ కొత్త ముప్పు వస్తుందో అన్న భయం కూడా ఉంది అందరికీ.. ఈ ఆపదకాలంలో మనం నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకుని పాటిస్తే ముందుముందు కూడా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కోగలమేమో..

మాలిక పత్రికను ఆదరిస్తున్న పాఠక మిత్రులు, రచయితలకు అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు. మాలిక పత్రిక ముఖ్యపాత్ర పోషిస్తున్న రెండు కథల పోటీలు ఈ విధంగా ఉన్నాయి. కోసూరి ఉమాభారతిగారు నిర్వహిస్తున్న కథామాలిక, మంథా భానుమతిగారు స్పాన్సర్ చేసిన ఉగాది కథలపోటి .. ఈ రెండు పోటీలకు ఈ నెల 2 ఆఖరుతేది. గమనించగలరు.

ప్రతీనెల మేము అందిస్తోన్న కవితలు, కథలు, వ్యాసాలు, సీరియల్స్ మిమ్మల్ని అలరిస్తున్నాయని నమ్ముతున్నాము. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

ఈ మాసపు విశేషాలు:

 1. తామసి 4

 2.చంద్రోదయం 12

 3. అమ్మమ్మ -22

 4.రాజీపడిన బంధం. 12

 5.శిశుపాలుడు

 6.అలిశెట్టి ప్రభాకర్ ని గుర్తుచేసిన ‘ శిథిల స్వప్నం ‘

 7.కంభంపాటి కథలు – నీచు

 8.పెద్దాయన (కథ)

 9.రామదాసు గారి కుటుంబం (కథ)

10.శిఖరాగ్ర సమావేశం (కథ)

11.కొత్త కోణం (కథ)

12.జ్ఞాపకాల బాటలో (కథ)

13.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 56

14.తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు.. కొన్ని శిథిల శబ్దాలు

15.విదేశవిహారం చేద్దాం నాతో రండి( మలేషియా) (జెంటింగ్ హైలెండ్స్ )

16.కార్టూన్స్ – వేణుగోపాల రాజు

17.కార్టూన్స్ – ఎమ్.ఎ. రవూఫ్

18.కార్టూన్స్ – జానా బలిజపల్లి

19.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

20. నేటి యువత

 

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008