Monday, 31 January 2022

మాలిక పత్రిక ఫిబ్రవరి 2022 సంచిక విడుదల

    పాఠక, రచయిత మిత్రులకు మాలిక ఫిబ్రవరి సంచికకు స్వాగతం సుస్వాగతం..

దాదాపు పదకొండేళ్లుగా మీ సహకారంతో మాలిక పత్రిక అందరినీ అలరించే అంశాలతో  అంతర్జాలంలో ప్రచురించబడుతోంది.  గత రెండేళ్లుగా సంతోషం, బాధ కలగలుపు జీవితం అందరిదీ.. అయినా జీవనప్రయాణం ఆగదు. సాగక తప్పదు కదా.. ఒక్కరొక్కరుగా మనలని వీడి వెళ్లిపోతున్న పెద్దవారందరికీ సాదర ప్రణామాలు తప్ప ఏమి చేయగలం.. వారు చెప్పిన పాఠాలను గుర్తుచేసుకుంటూ సాగిపోవాలి.

ఈ మాసపు సంచికలో మీకోసం ఎన్నో కవితలు, కథలు, వ్యాసాలు, సీరియళ్లు ఉన్నాయి. 
మాలిక పత్రికకు మీ రచన పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com


ఈ మాసపు విశేషాలు:

 


Saturday, 1 January 2022

మాలిక పత్రిక జనవరి 2022 సంచిక విడుదల

 


పాఠక మిత్రులు, రచయితలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు


మనిషి ఎన్ని అవాంతరాలు, ఆపదలు, దుర్ఘటనలు, సమస్యలను ఎదుర్కున్నా కొత్త సంవత్సరం అనగానే ఒక కొత్త ఆశ కలుగుతుంది. జరిగిందేదో జరిగింది, ఇక రాబోయేవి మంచి రోజులు అన్న చిన్న ఆశ, నమ్మకంతో ముందుకు సాగుతాడు. ఇదే ఆశావహ దృక్పథం మనిషిని ముందుకు నడిపిస్తుంది..

ఈసారి నిజంగానే మంచిరోజులు రాబోతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. కరోనా మహమ్మారి చివరి దశకు వచ్చింది. ఇంకో రెండు మూడు నెలలు గడిస్తే ఈ ముప్పు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయంట. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ మహమ్మారి ఇంకే ఇతర విషయాల మీద ఆసక్తి కలిగించడం లేదు. అయినా మనం మొండి ధైర్యంతో సాగుతున్నాం.. అంతా మన మంచికే..

మాలిక పత్రికను ఆదరిస్తొన్న మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పటిలాగే ఈ కొత్త సంవత్సరపు మొదటి మాసంలో మీకోసం ఎన్నో మంచి కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు అందిస్తున్నాము. మీకు తప్పకుండా నచ్చుతాయని మా ఆశ.


మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com


  1.ధృతి – 8

  2.మోదుగ పూలు – 6

  3.సాఫ్ట్‌వేర్ కథలు – 4.. పులుసులో కరివేపాకు

  4.చంద్రోదయం – 23

  5.తాత్పర్యం – దృష్టిని బట్టి దృశ్యం

  6.అమ్మమ్మ – 31

  7.వెంటాడే కథలు! – 3 . మట్టిమనిషి

  8.శ్రీ గణేశ చరిత్ర (అష్టోత్తర శత కందములు)

  9. అన్నపూర్ణ తల్లి..

10.సూర్యోదయం

11. కలహాంతరిత

12.పాపం నీరజ!

13.తల్లి మనసు

14.తీరిన కోరిక..

15.దేవీ భాగవతం – 6

16.వేదకర్త “జమదగ్నిమహర్షి”

17.వనితా!

18.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

19.కార్టూన్స్ – GSR

20.కార్టూన్స్… CSK

 


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008