మాలిక పత్రిక నవంబర్ 2022 సంచిక విడుదల
స్వాగతం... సుస్వాగతం.
చలిచలిగా... గిలిగిలిగా... లేత చలిగాలులు, చిరు వానజల్లులతో వణికిస్తున్న కాలాన్ని స్వాగతిస్తూ, మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, యాత్రామాలికలు, ధారావాహికలు, వ్యాసాలు, కార్టూన్స్ మోసుకుంటూ వచ్చింది మాలిక పత్రిక నవంబర్ సంచిక..
ఈ మాసపు సంచికలో శ్రీమతి సంధ్యా యల్లాప్రగడగారి ధారావాహిక మోదుగపూలు ముగిసిపోతోంది. అతి త్వరలో సంధ్యగారినుండి మరో ధారావాహిక కోసం ఎదురుచూస్తున్నాము. ప్రముఖ, అభిమాన రచయిత్రులు స్వాతీ శ్రీపాద, గిరిజారాణి కలవలగార్లు మాలిక పత్రిక కోసమే కొత్త సీరియల్స్ రాస్తున్నారు. మిమ్మల్ని అలరిస్తున్నాయని భావిస్తున్నాము.
అతి త్వరలో సంక్రాంతి సందర్భంగా మాలిక పత్రిక ఒక కథలపోటి నిర్వహించబోతోంది.. వచ్చే సంచికలో పూర్తి వివరాలు అందించబడతాయి..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.
ఈ మాసపు మాలిక పత్రికలో మీకోసం వచ్చిన విశేషాలు..
4.పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు
7. సాఫ్ట్‌వేర్ కధలు – కలేపా – కోతిమీ
8. నంజనగూడు, దొడ్డమల్లూరు ఆలయాలు
10. ఆట పట్టింపు
11. గోపమ్మ కథ – 3
12.అమ్మమ్మ – 41
13. కార్టూన్స్ – భోగా పురుషోత్తం
14. భావ కాలుష్యం