Saturday, 7 January 2023

మాలిక పత్రిక జనవరి 2023 సంచిక విడుదల

కొత్త సంవత్సరానికి స్వాగతం... సుస్వాగతం.. అప్పుడే ఒక సంవత్సరం అయిపోయిందా.. కొత్తసంవత్సరపు వేడుకలు ఇంకా పాతబడనేలేదు పన్నెండు నెలలు, బోలెడు పండుగలు గడిచిపోయాయా?? కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది కదా.. ఆదివారం .. హాలిడే అనుకుంటే వారం తిరిగి మళ్లీ ఆదివారం వచ్చేస్తుంది.. కాలం వేగం పెంచిందా... మనం మెల్లిగా నడుస్తున్నామా అర్ధం కాదు..

కొత్తసంవత్సర వేడుకలు అయిపోయాయి అనుకుంటూ ఉండగానే తెలుగువారి ముఖ్యమైన పండుగ ముగ్గులు, పతంగుల పండుగ వచ్చేస్తుంది. ముచ్చటగా మూడురోజులు వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి..

ముగ్గులు వేలాది సంవత్సరాలుగా జీవించి ఉన్న జానపద రూపం! భారతదేశపు సంప్రదాయ కళ!

ప్రతీరోజూ ఉదయం ముగ్గులు వేయటం యోగాసనాలు వేసిననంత ఫలం.

సంప్రదాయ ముగ్గులు వేయడానికి ఉపయోగించే పొడి - బియ్యపు పిండి చీమలు వంటి అల్పప్రాణులకు ఆహారంగా మారుతుంది.

సంప్రదాయంగా మట్టినేలపై పేడ నీటిలో కలిపి, కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఈ పేడ యాంటిబయాటిక్కుగా పనిచేస్తుంది. ముగ్గులు గణితశాస్త్రపరంగా కూడా సౌష్టవ ధర్మాన్ని కలిగి ఉంటాయి.

తెలుగువారి ముగ్గులలో చుక్కల ముగ్గులు ఎక్కువ, ఉత్తరాది వారి రంగోలిలో గీతల ముగ్గులు ఎక్కువ.

ముగ్గుల గురించి కొన్నిమాటలు చెప్పుకుని భోగి, సంక్రాంతి,కనుమ పండగ శుభాకాంక్షలు మీ(మన) అందరికీ తెలియజేస్తున్నాము. 

మరో ముఖ్య విషయం... ఈ మాసం నుండి  మాలిక పత్రికలో పిల్లలకోసం  'బాల మాలిక' కథల ఖజానా మొదలుపెట్టాము. మీలో ఎవరైనా ఈ శీర్షికకోసం కథలు పంపించవచ్చు. ఈ నెలలో మొదటగా నండూరి సుందరీ నాగమణిగారి కథ చదవండి.. మీ పిల్లలకు చదివి వినిపించండి.. చదివించండి.. మీరు వినండి..

మరో కొత్త శీర్షిక రాస్తున్నారు నండూరి సుందరీ నాగమణి.. మన సినిమాల్లోని మధురమైన పాటలను సవివరంగా పరిచయం చేయబోతున్నారు "సుందరము- సుమధురము"  ఈ శీర్షిక పేరు.

 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

ఈ జనవరి మాసపు విశేషాలు 

 1. వెంటాడే కథ – 16

 2.విరించినై విరచించితిని… 2 , తనికెళ్ల భరణి

 3.సుందరము – సుమధురము – 1

 4.కంభంపాటి కథలు – కౌసల్య నవ్విందిట

 5.జీవనవేదం-5

 6.పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు

 7. తాత్పర్యం – సొరంగం

 8.అర్చన కనిపించుట లేదు – 1

 9.అమ్మమ్మ – 42

10.చంద్రోదయం – 36

11.బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

12.తుళ్ళి పడకే ఓ…మనసా

13.కౌముది

14. కార్టూన్స్ – CSK

15.కార్టూన్స్ – భోగా పురుషోత్తం


 

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008