Friday, 5 May 2023

మాలిక పత్రిక మే 2023 సంచిక విడుదల

స్వాగతం... సుస్వాగతం... మాలిక పాఠక, రచయిత మిత్రులందరికీ మండే మే నెల సంచికకు స్వాగతం. అయినా ఈ వేసవికాలం ఏంటో అస్సర్ధం కావట్లేదు. ఏప్రిల్ నెలలోనే వేడి పెరిగింది మే ఎలా కాల్చేస్తుందో అని అందరూ భయపడుతూంటే, ఆకాశం బద్ధలైనట్టు వానలు ఉరుములు, మెరుపులతో ముంచేస్తున్నాయి. ఏంటో ఈ చెడగొట్టు వానలు. ఇక ఇప్పుడు జరిగేది... జరుగుతున్నది... జరగబోయేది మామిడి , మల్లెల కాలం... మల్లెలు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా మామిడిపళ్లను మాత్రం మరువగలమా.. పచ్చి మామిడికాయలతో రోజూ వంటలు, ఆవకాయలు. తర్వాత ముక్కలు కోసి ఎండబెట్టి ఒరుగులు చేసుకోవడం. మామిడిపళ్లైతే రోజొకటి తినాల్సిందే... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆవకాయల బిజీ కనిపిస్తోంది. మరో పక్క పచ్చని మామిడిపళ్ల దృశ్యాలు.. ఆహా! ఏమి రుచి! మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు, కార్టూన్స్ తో మీ ముందుకు వచ్చింది మే నెల మాలిక పత్రిక.. మీకు నచ్చే... మీరు మెచ్చే విశేషాలు ఎన్నో... 

ఈ మాసపు విశేషాలు: 

 1. జీవనవేదం – 9

2. గోపమ్మ కథ… 8

3. లోపలి ఖాళీ – సిద్ధయ్య మఠం

4. అమ్మమ్మ – 46

5. పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

6. అర్చన కనపడుటలేదు – 5

7. పక్కవారిది పరమానందం

 
 

11. రిమెంబర్ – రీమెంబెర్

13. కవిత్వం పరమార్ధం


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008