మాలిక పత్రిక 2024 సంచిక విడుదల
మనిషి ఎన్ని అవాంతరాలు, ఆపదలు, దుర్ఘటనలు, సమస్యలను ఎదుర్కున్నా కొత్త సంవత్సరం అనగానే ఒక కొత్త ఆశ కలుగుతుంది. జరిగిందేదో జరిగింది, ఇక రాబోయేవి మంచి రోజులు అన్న చిన్న ఆశ, నమ్మకంతో ముందుకు సాగుతాడు. ఇదే ఆశావహ దృక్పథం మనిషిని ముందుకు నడిపిస్తుంది. సరికొత్త ఆశలతో,సరికొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగిడదాము.
మాలిక పత్రికను ఆదరిస్తొన్న మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పటిలాగే ఈ కొత్త సంవత్సరపు మొదటి మాసంలో మీకోసం ఎన్నో మంచి కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు అందిస్తున్నాము. మీకు తప్పకుండా నచ్చుతాయని మా ఆశ.
మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com