తెలుగు బ్లాగు వార్తలు
నమస్కారం.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగు జిలుగుల పండుగ సంధర్భంగా మీకు సమర్పిస్తున్న ప్రత్యేక వార్తలు. ఈ వార్తలు ఒకేసారి మాత్రమే ప్రసారం చెయ్యబడతాయి. ఇందులో అన్నీ నిజాలే చెప్పబడతాయి. మధ్యలో వ్యాపార ప్రకటనలు ఉండవు. అందుకే మీ పనులన్నీ తీర్చుకుని వచ్చి తీరిగ్గా కూర్చోండి. ఈ వార్తలు అచ్చమైన తెలుగులో చెప్పబడును. తెలుగును తెలుగులా, ఇంగ్లీషును ఇంగ్లీషులా మాట్లాడబడును ఎటువంటి వికార చేష్టలు లేకుండా.
ఇప్పుడూ మీకు ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన ప్రపంచం గురించి చెప్తున్నాను. అదియే బ్లాగ్ప్రపంచం. ఇక్కడ తెలుగును అభిమానించే వారే ఉంటారు. వీరు ఒక రాష్ట్రానికి కాని, నగరానికి కాని, దేశానికి కాని సంబంధించినవారు కాదు. ప్రపంచం నలుదిశలా వ్యాపించి ఉన్న తెలుగు వారు రాసే బ్లాగుల లోకం. ఇక్కడందరూ వివిధ విషయాలపై బ్లాగులు రాయుచు అంతర్జాలములో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయముతో తేనేలాంటి మన తెలుగు భాషని ఎల్లెడలా వ్యాపింపజేసి తెలుగు వెలుగులను విరజిమ్ముతున్నారు.ఈ లోకంలో తరతమ భేదాలు లేవు. వయసు, చదువు తేడాలసలే లేవు. ఉన్నదల్లా ఎవరికి తెలిసిన విషయాన్ని వారు తెలుగులో రాయడమే. ఇక్కడ ఒక విద్యార్థి నుండి ఒక విజ్ఞానవేత్తవరకు, ఒక కార్టూనిస్టు నుండి ఒక గృహిణివరకు అందరు బ్లాగేవాళ్ళే. ఇక చదివేవాళ్ళకంతులేదు. తెలుగు బ్లాగర్లందరు ఒక వింత ఒరవడి సృష్టించారు పదాల అల్లికలలో వాడుకలో..కొన్ని ఇలా ఉన్నాయి.
రాసేవాడు - బ్లాగరి
రాసేది - బ్లాగోతం
కవిత -బ్లాగ్కవిత
కథ - బ్లాక్కథ
వాగుడు - బ్లాగుడు
పటిమ - బ్లాగ్పటిమ
రాజకీయాలు - బ్లాజకీయాలు
వాగ్ధానం - బ్లాగ్ధానం
దోరణి -బ్లాగ్దోరణి
ఇలా మొత్తం బ్లాగుల ప్రపంచాన్ని బ్లాగ్మయం చేసేశారు.
ఇక ఈ బ్లాగులోకంలో వివిధ విభాగాలలో ప్రముఖమైన బ్లాగుల గురించి తెలుసుకుందాము.
ముందుగా మనకు సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ బ్లాగుల గురించి కొత్తపాళిగారు వివరిస్తారు.
నమస్కారం,
నేను సాహిత్యానికి సంబంధించిన టపాలతో మారుమ్రోగుతున్న కొన్ని తెలుగు బ్లాగుల గురించి చెప్తాను. ఈ బ్లాగులన్నీ కొత్త కొత్త పద్యాలతో, చర్చలతో కళ కళ లాడుతూ ఉన్నాయి. ఇందులో మాటలకన్నా పద్యాలే ఎక్కువగా ఆటలాడుతుంటాయి.
సాలభంజికలు
విన్నవీ కన్నవీ
సంగతులూ సంధర్భాలూ
బ్లాగేశ్వరుడు
తెలుగులో తప్పటడుగులు
వికటకవి
వాగ్విలాసము
ఇంకా చాలా ఉన్నాయి మరి. OVER TO STUDIO
ధన్యవాదాలు కొత్తపాళిగారు, ఇప్పుడు మనకు సాంకేతిక అంశాల మీద రాసే బ్లాగుల గురించి సుధాకర్ వివరిస్తారు.
నమస్కారం.
నేను వివిధ సాంకేతిక విషయాలు రాస్తున్నా బ్లాగుల గురించి చెప్తాను. ఈ బ్లాగులు రాసేవారు కంప్యూటర్ రంగంలో బాగా పరిచయం, అవగాహన ఉండి తమకు తెలిసిన , అందరికి ఉపయోగపడగాలవనే సాంకేతిక విషయాలు రాస్తున్నారు.
నల్లమోతు శ్రీధర్
వీవెనుడు టెక్కునిక్కులు
నా మదిలో
కంప్యూటర్ మాయాజాలం
శ్రీదీపిక
సీతారాం చెప్పే కంప్యూటర్ సంగతులు
OVER TO STUDIO
ధన్యవాదాలు సుధాకర్‍గారు, ఇప్పుడు హాస్యానికి సంబంధించిన ప్రముఖ బ్లాగుల గురించి విహారి గారు వివరిస్తారు.
నమస్కారం,
నేను నవ్వులుపువ్వులు పూయిస్తున్నా కొన్ని బ్లాగులగురించి చెప్తాను.
తెలుగు కార్టూనులు
రెండు రెళ్ళు ఆరు
విహారి
ప్రసాదం
ఇప్పటికి ఇంతే … OVER TO STUDIO
ధన్యవాదాలు విహారి గారు, ఇప్పుడు తెలుగు బ్లాగులోకంలో ఉన్న కొందరు రచయితల గురించి మనకు విజయ్ కుమార్ గారు చెప్తారు.
నమస్కారమండి.
గత కొద్ది కాలంగా పత్రికలలో విరివిగా రాస్తున్న ప్రముఖ రచయితలు బ్లాగులోకంలో అడుగుపెట్టు రచనలు చేసి అంతర్జాలంలో కూడా పేరు సంపాదించుకున్నారు. వారి బ్లాగులు చూద్దామా.
సృజన అనుసృజన
అభినయని
జాన్‍హైడ్ కనుమూరి
రోహిణీప్రసాద్
నా ప్రపంచం
దార్ల
OVER TO STUDIO
ధన్యవాదాలు విజయ్‍కుమార్‍గారు. ఇప్పుడు మనకు సినిమాలగురించి రాసే బ్లాగుల గురించి వెంకట్‍గారు చెప్తారు.
నమస్కారం, మీకు సినిమాల గురించి సమగ్ర విశ్లేషణను అందించే కొన్ని బ్లాగులు..
24 ఫ్రేములు, 64 కళలు
సంభవామి యుగే యుగే
రేగోడియాలు. సినిమాలు
సౌమ్య
OVER TO STUDIO
ధన్యవాదాలు వెంకట్‍గారు, ఇప్పుడు పాటల బ్లాగులగురించి పవన్ కుమార్ (విహారి) వివరిస్తారు.
నమస్కారం. తెలుగులో మధురమైన పాటల బ్లాగులు ఉన్నాయి. అవి చూద్దామా.
సత్యం శివం సుందరం
ఆణిముత్యాలు
లలితగీతాలు
గీతలహరి
OVER TO STUDIO
ధన్యవాదాలు విహారి..ఇప్పుడు వంటల బ్లాగులు గురించి రమగారు చెప్తారు.
రుచులు
షడ్రుచులు
ఆంధ్రాకిచెన్
అన్నపూర్ణ
OVER TO STUDIO
ధన్యవాదాలు రమగారు. ఇప్పుడూ భక్తి సమాచారానందిచ్చే బ్లాగులగురించి మురళీకృష్ణగారు చెప్తారు.
నమస్కారం . భక్తి సమాచారాన్ని ఇచ్చే బ్లాగులు ఇవి..
అన్నమయ్య సంకీర్తనలు
పోతన భాగవతము
తెలుగు బైబిలు
త్యాగరాజు కీర్తనలు
భక్తిగీతాలు
భజన కీర్తనలు
OVER TO STUDIO
ధన్యవాదములు . ఇప్పుడు మనకు ఫోటో బ్లాగుల గురించి చేతన వివరిస్తారు.
నమస్కారం. మంచి మంచి అందమైన , అద్భుతమైన ఫోటోలను మనకు అందించే బ్లాగులు ఇవి
విజ్యుయల్ ఓడ్
పవన్‍గాడి ప్రపంచం
బొమ్మ
బొమ్మలకొలువు
చిత్రవిచిత్రాలు
ఇంకా మరికొన్ని ఫోటో బ్లాగులు ఉన్నాయి
ధన్యవాదాలు చేతన. ఇప్పుడు మనకు కవితల బ్లాగులను గురించి రాధిక వివరిస్తారు.
నమస్కారం . నేను మనస్సుకు హత్తుకునే , అందమైన స్పూర్తిదాయకమైన కవితల బ్లాగుల గురించి చెప్తాను.
కల్హర
అలలపై కలల తీగ
స్నేహమా
కవితా ఓ కవితా
కవిత్వం
OVER TO STUDIO
ధన్యవాదాలు. ఇప్పుడు రాజకీయ సమాచారం, ప్రతిరోజు జరిగే రాజకీయ పరిణామాల గురించి విస్తృతంగా చర్చించే బ్లాగులు తెలుసుకుందాం.
గుండె చప్పుడు
చదువరి
జాబిల్లి
ఇక చివరిగా ఆంధ్రమాత గోంగూర నుండి అమెరికా రాజకీయాల వరకు అన్ని విషయాలు రాసే ప్రముఖ బ్లాగులగురించి చావా కిరణ్ వివరిస్తారు.
నమస్కారం. అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ , కాదేదీ కవితకనర్హం అన్నట్టుగా బ్లాగడానికి అనర్హం కాని విషయమే లేదు. బాం బ్లాస్ట్ ఐనా బండి మీది మిర్చీబజ్జీ ఐనా, కారు అమ్మకమైనా కాలేజీ కబుర్లైనా. ఇలా ప్రతీ విషయం మీదా బ్లాగేస్తారు మనవాళ్ళు
సత్యశోధన
మ్యూసింగ్స్
వెంకటరమణ
కొత్తపాళి
సరిగమలునా సోది
శోధన
అంతరంగం
ఓనమాలు
కలగూరగంప
గోదావరి
జానుతెనుగు సొగసులు
నాబ్లాగు నాసోది నా నస
పూతరేక్స్
అమెరికా నుండి ఒక ఉత్తరం ముక్క
దీప్తిధార
నేనుసైతం
వసుంధర
శ్రీకృష్ణదేవరాయలు
హరివిల్లు
నువ్వుశెట్టి బ్రదర్స్
అవీ ఇవీ
జ్యోతి
తెలుగుదనం
మరమరాలు
నాలోనేను
ఇది కథ కాదు
దిల్ సే
మనిషి
చెప్పాలని ఉంది
మనసులోని మాట
సాధ్యమైనంత మేరకు ఈ బ్లాగుల సమాచారం సమీకరించడమైనది. దీనికి రెట్టింపు బ్లాగులు ఉన్నాయి. అవి మరోసారి చూద్దాం. ఇక సెలవు.
మరొక్కమారు అందరికీ దివ్య దీపావళి శుభాకాంక్షలు
జ్యోతి వలబోజు
16 వ్యాఖ్యలు:
బాగుందండీ మీ నూతన గృహం. వాస్తు పూజ, శాంతి హోమం..... మొదలైనవి చేసే ఉంటారనుకుంటాను :-)
జ్యోతి గారు, కాస్త ఆ బోల్డు అక్షరాలు తగ్గిస్తారా?
ప్రముఖమైన బ్లాగులను చక్కగా వర్గీకరించారు.
జ్యోతి గారూ,
మీకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు.
జ్యోతి గారూ, మీ కొత్త బ్లాగు చాలా బాగుంది. రెట్టించిన ఉత్సాహంతో మంచి పోస్టులు రాయండి.
- నల్లమోతు శ్రీధర్
జ్యోతక్కా,
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు, housewarming party ఎప్పుడు? :)
నాకు తెలిసిన స్నేహితులందరూ ఇప్పటివరకూ బ్లాగర్ నుంచి వర్డ్ ప్రెస్ కి మారడమే కానీ, ఎదురీత చూడలేదు. మీరే మొదటి వారు.
పద్యాల బ్లాగుల చిట్టాలో 'వాగ్విలాసమ' రాఘవ గారిని (vaagvilaasamu.blogspot.com) కూడా పెట్టల్సింది.
NUtana gruhapravesa subhakankshalu Jyothi garu.[:)]
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలండీ ..జ్యోతిగారు.. మనలోమన మాట.. రమ అని నాపేరు చెప్పారు... నేనే అనుకొంటున్నాను .... ఒకవేళ నా వూహ.. తప్పైతే మన్నించండి ...నేను వంటల గురించి చెప్పాను అని అనుకొంటున్నాను పేరు నాదే అయితే.. (మీ నూతన బ్లాగ్ వార్తల్లో) ...బాగుంది... . నా బ్లాగు విశ్లేషకులేవరు.. లేరా?? వర్గీకరణ కి నా బ్లాగు దూరమైనందుకు కించిత్ బాధగా వుంది..అయినా పర్వాలేదు.. నేను నా మనసు సంతృప్తి కోసం అప్పుడప్పుడు... మన స్నెహుతులైన బ్లాగర్ల ముందుకి వస్తూ వుంటాను..... వ్యాఖ్యల కోసం కాదు...వేరే మెప్పుదల కోసం అంతకన్నా కాదు...
మీ బ్లాగ్ వార్తల్లో బ్లాగర్లందరికి... మీ ద్వార నా తరపునుండి... "దీపావళి శుభాకాంక్షలు" అందజేస్తారని.....
ఉనికి కోల్పోయిన .. నా మనసులో మాట..... బ్లాగ్ తరపున ....శుభాకంక్షలతో.. మీ స్నేహుతురాలు రమ...
actually, వర్గీకరణ సరిగా లేదు. నా బ్లాగు ని సినిమా బ్లాగు అనడం దారుణం. మహా అంటే ఓ ఇరవై శాతం పోస్టులు సినిమాలపై ఉంటాయి అంతే! :(
రమగారు,
అలాంటిదేమీ లేదండి. ఎదో కాస్త వెరైటీగా రాద్దామని చిన్న ప్రయత్నం చేసా. మీ బ్లాగుగురించి తెలుసు. కాని అడ్రస్ తెలీక రాయలేదు అంతే.నాకు ఏ ఒక్క బ్లాగులపై పక్షపాతం లేదు. కూడలి, కొత్తది పాతది, జల్లెడ వెతికి వెతికి ఇవి రాయగలిగా ఇంకా చాలా ఉన్నాయి కాని నాకు ఓపిక లేకుండింది.మీ డ్రస్ ఇవ్వండి రాస్తాను. నేను ప్రతీ విభాగానికి చెందిన వారినే ఆ విభాగ వార్తలు చెప్పించాను.వంటల విభాగంలో చెప్పింది రుచులు బ్లాగుకర్త రమగారు. ఆవిడ అమెరికాలో ఉంటారు.
సౌమ్య..
ఆ బ్లాగు నీదని కూడా తెలీదు. కూడలి సినిమా విభాగంలో ఉంటే పెట్టా. నేనేం చేయను..
ఓహ్!! సారి అండీ... నేనె పప్పులో కాలేసానన్నమాట.... అయినా... రమ అని నేనొక్కదాన్నే వుంటాను అనుకొవడం నా తప్పే కదండి... అసలు నా పేరె రానప్పుడు... నా బ్లాగ్ రాయలేదన్న నీలాపనింద మీకు రాకూడదు..జ్యోతిగారు... తప్పు సరిదిద్దుకొన్నాను .. ఇక నా అడ్రస్స్ అంటార... చెప్పాను కదండి..... నా బ్లాగు వ్యాఖ్యలు .. మెప్పులు లాంటి వాటికి దూరమే....కాబట్టి... చదివి కాస్త తలనొప్పి..తెచ్చుకోవాలనుకొన్నప్పుడు అలా నా బ్లాగ్ వైపు తొంగి చూస్తే చాలు.. మీకు అమృతాంజన్ ఖర్చు తప్పదు మరి....ఇంకోసారి కలిసినప్పుడు తప్పక నా బ్లాగ్ ఆడ్రస్ ఇస్తాను..
మీ ఆలోచన వినూత్నంగా ఉంది. దాదాపుగా తెలుగు లో ఉన్న అన్ని బ్లాగులని ఒకేచోట ప్రస్థావించారు.బావుందండి.
మా సత్రం(blogspot.com)లోనే ఓ గది తీసుకుని గృహప్రవేశం చేసినందుకు శుభాకాంక్షలు..
మీరు బాగా శ్రమించి, కాలాన్నివెచ్చించి, సక్షిప్తంగా రాసినందుకు అభినందించకుండా వుండలేకపోతున్నాను
అభినందనలు
నేను ఈ నెలనే మొదలెట్టా..నా బ్లాగు..
అందుకే పాత బ్లాగులు చూస్తున్నా..
సీనియర్లు వీక్షిస్తే..బాగుంటుంది.
మీ రచనలు బాగున్నాయి.
Post a Comment