ఏమిటీ ఘోరం????
పేదల చిన్నారుల ఆసుపత్రి నీలోఫర్ ఇప్పుడా చిన్నారుల మరణవేదికైంది. రాష్ట్ర నలుమూలలనుండి వైద్యానికి, ప్రసవానికి వచ్చే ఎందరో తల్లుల కడుపుకోతకు కారణమైన రభస ఒక ఎం.ఎల్.ఏ.డాక్టర్ల మధ్య జరిగింది. అసలు ఇక్కడ తప్పంతా డాక్టర్లదే. తప్పు చేసిన నాయకుడిని వదిలేసి వైద్యాన్ని వదిలేయడమేంటి. ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు సార్ధకత.అంతగా కోపమైతే ఆ నాయకుడిని పట్టుకుని కొట్టండి కాని చావుబ్రతుకులమధ్య ఉన్న పసిపిల్లలను బలిపెట్టడమేంటి. ప్రాణాలు పోయడం వాళ్ళ కర్తవ్యమా, లేక తమ గొడవకు నెలల పిల్లల ప్రాణాలు తీయడమా. నవమాసాలు మోసి కని ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఇక్కడికి తీసుకొస్తే వైద్యం లేక తమ కళ్ళముందే ఆ పసిమొగ్గలు వసివాడిపోతే ఆ తల్లితండ్రుల కడుపుకోత ఎవరు తీర్చగలరు. ఈ గొడవ రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుంది. కాని ఆ పసిప్రాణాలు మళ్ళీ తీసుకురాగలరా. దేవుడే డాక్టర్ల రూపంలో తమ పిల్లలను కాపాడతాడని ఇక్కడికి తీసుకువచ్చిన ఆ కుటుంబ సభ్యులు ఏం నేరం చేసారని. వాళ్ళకింత అన్యాయం చేస్తున్నారు.
ఇంత పంతమా ఆ డాక్టర్లకి.ఈ రాజకీయ నాయకుల సంగతి తెలిసిందే .. కర్ర విరగదు పాము చావదు అన్నట్టు నానుస్తున్నారు పైగా ఆ పిల్లలను చావు బ్రతుకుల మధ్య తీసుకొచ్చారు, వైద్యం లేక చావలేదు అంటున్నారు. తమ సమస్యలకోసం రోడ్డుకెక్కిన డాక్టర్లకు కనీస మానవత్వం లేదా పైగా ఏ పాపము తెలియని చిన్నారులు బలవుతున్నా పంతం పట్టుకుని ఉన్నారు.ఇప్పటికే రెండు రోజుల్లో పదిమంది చిన్నారులు బలయ్యారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ డాక్టర్లు కూడా వీళ్ళకి మద్ధతుగా సమ్మె చేస్తారంట. మనుష్యుల ప్రాణాలతో ఆడుకోవడానికా వీళ్ళు లక్షలు ఖర్చుపెట్టి వైద్యవృత్తి చదివింది.అసలు ఈ డాక్టర్లందరిని ఉద్యోగాలనుండి తీసేసి చదువుకుని నిస్వార్ధ సేవ చేయాలని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారిని నియమించాలి ప్రభుత్వమైనా. కాని దానికి తెగులు పట్టింది ...ఖర్మ? ఏదో ఉద్ధరిస్తారని వాళ్ళను ఎన్నుకున్న మనం నేరస్తులం.
1 వ్యాఖ్యలు:
అసలు ఈ డాక్టర్లందర్నీ ఉద్యోగాల్లోంచి తీసేసి....
ఆ నిస్వార్థ సేవకుల్నయితే కొట్టరా అఫ్సర్లూ, రాములమ్మలూ? ఈ జునియర్ డాక్టర్లు ఆ నిస్వార్ర్థ సేవ చేద్దామనే ఉద్దేశ్యంతోనే గదా ట్రైన్ అవుతున్నారు!
Post a Comment