Sunday, 23 December 2007

అమూల్యమైన బహుమతులు


పుట్టినరోజు సంధర్భంగా అభినందనలు తెలిపిన వారందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు(నెనర్లు-నాకు నచ్చలా). ఇక నాకు వచ్చిన బహుమతులు గురించి చెప్పొద్దా మరి. బ్లాగులో వచ్చిన బహుమతులు అందరికీ తెలిసినవే. నా గుంపు హైదరాబాద్ మస్తీలో మాత్రం మరిచిపోలేని, విలువకట్టలేని బహుమతి లభించింది. నా పుట్టినరోజును స్పెషల్ చెయ్యడానికి , అందరు కలిసి వారం ముందునుండే ప్రయత్నాలు మొదలెట్టారు, నేను గుర్తుపట్టకుండా, కనీసం ఊహించడానికి కూడా వీలు లేకుండా. ఆ గుంపులో అందరూ స్నేహితులు, కుటుంబ సభ్యులలాగా ఉంటారు. ఎప్పుడన్నా ఎవరైనా పోట్లాడితే నేను సర్ది చెప్పేదాన్ని. చెత్త మేసేజీలు పంపితే గెంటేయడమే. ఎంత ప్రేమగా ఉంటానో అంత కఠినంగా కూడా ఉండేదాన్ని. వారం ముందు ఓ పదిమంది కలిసి పథకం అమలు చేయడం ప్రారంభించారు. ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని పోట్లాట మొదలెట్టారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చాలా తీవ్రంగా, పరుషంగా మాట్లాడుకుని, నేను వెళ్ళిపోతాను , నేను వెళ్ళిపోతాను అని అనడం మొదలెట్టారు. ఇదేంటి ఎప్పుడు లేనిది అందరు ఇలా పోట్లాడుకుంటున్నారని నేను సర్ది చెప్ప సాగాను. నాకేం తెలుసు వాళ్ళందరు కావాలని చేస్తున్నారని.మరో ప్రక్క అందరు నా గురించి తమ తమ అభిప్రాయాలన్ని సేకరించి, ఒక స్లైడ్ షోగా తయారు చేసారు. నిన్న మద్యాహ్నం వరకు గుంపులో నాకు శుభాకాంక్షలు ఎవరూ చెప్పట్లేదు. నాతో పాటు ఇంకో వ్యక్తి పుట్టినరోజు కూడా జరుపుకున్నాడు. నేను అతనికి విషెస్ చెప్పాను. అందరు అతనికే చెప్పసాగారు. నేననుకున్నా వీళ్ళందరు కలిసి నాకు ఎదో Surprise ఇవ్వబోతున్నారని.

సరిగ్గా మధ్యాహ్నం పన్నెండింటికి మొదలెట్టారు.జరిగిన విషయం చెప్పి ఈ స్లైడ్ షో ఇచ్చారు. నిజంగా షాక్ అయ్యా. ఇంత పకడ్బందీగా చేసారు ఈ పిల్లలందరూ అని.నన్ను అలా ఫూల్ చేసారని కోపం ఓ పక్క, కాని నా పుట్టినరోజు కోసం వారం ముందునుంది అందరు కలిసి ఇంత కష్టపడ్డారు, ఎంత ప్రేమగా స్లైడ్ షో చేసారు అని. ఇంతకంటే విలువైనది ఏదైనా ఉంటుందా.వాళ్ళ పోట్లాట thread 300 దాటింది రెండు రోజులలో. అంత వాడిగా వేడిగా జరిగిందన్నమాట. ఈ షాక్ నుండి తేరుకునే లోపు ఒక అబ్బాయి సాయంత్రం వీడియో శుభాకాంక్షలు చేసి పంపాడు. అది చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇంత మంది ప్రేమకు నేను పాత్రురాలినైనందుకు ఎంత అదృష్టవంతురాలిని అని. ఇక మన కూడలి కబుర్లలో మిత్రులు ఊరుకుంటారా. మంచి పద్యం వినిపించారు (పాడారు).

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసునీ పాలి వజ్రమూ
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతన మాలోనున్న చిన్ని కృష్ణుడూ
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడమూ
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందున వైఢూర్యము
గతియై మమ్ము కాచేటి కమలాక్షుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
కాళీంగుని తలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్ర నీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునీ వలె దిరిగే పద్మనాభుడూ..........


చావాకిరణ్ ,కొత్తపాళి, నాగరాజు గారు కలిసి కూర్చిన ఈ పద్యహారంలోని నవరత్నాలను గమనించండి.ఇంతకు మించి విలువైనది ఇంకేదైనా ఉన్నదా???


నేను ఇదంతా చెప్పింది , అందరు నన్ను మెచ్చుకుంటున్నారని కాదు, యాంత్రికంగా మారిన మన జీవన వాహిణిలో అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తే ఎదుటివారి మోముపై చిన్ని చిరునవ్వు తెప్పించగలము కదా అని. అందుకే నేను నా బ్లాగులో నాకు తెలిసినవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేది. ఇలా మిత్రులు, సన్నిహితుల నుండి అందుకున్న శుభాకాంక్షలు విలువకట్టలేనివి, మరిచిపోలేనివి .మధురమైనవి అయి ఉంటాయి. మీరూ ప్రయత్నించండి..

8 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

ఊరకే అన్నమయ్య పదం పాడామని కాదు, దానితో నవరత్నాలనీ ఇచ్చామని చెప్పరేం! అదీ అసలు కిటుకు .. ఆ పాటని ఎంచుకోవటంలో తెలివి పీయెన్నార్ గారిది!

జ్యోతి

Oops! నా బుర్రలో లైటు ఇప్పుడు వెలిగింది..అదే అనుకుంటున్నా నవరత్నమాల అంటున్నారేంటని. నాకు నిజ్జంగా నగలు, రత్నాల మీద అంత మక్కువ లేదండి అందుకే ఆ పద్యంలోని రత్నాలను గమనించలేదు.

Anonymous

ఇన్ని రొజులూ మీకె పని లేదనుకున్నాను. చాలా మందికి లెదని అర్ధం అయిందంది.

జ్యోతి

థాంక్స్ అండి అనానిమాసురులుగారు ,,

రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించడానికి మీరు, వై ఎస్ ఆర్,మోడి,సోనియాలాటి వారు ఉండగా మాకెందుకు చింత..ఏదో పనిలేక పిలిచి పిల్లి తల గొరిగినట్టు ఇలాటి తిక్క పనులు చేస్తుంటాము. మీరు పట్టించుకోకండి.

రాధిక

జన్మదిన శుభాకాంక్షలు జ్యోతి గారూ.ఆలస్యానికి క్షమించాలి.ఈ రోజే రావడం కూడలికి.అలాగే "సదా స్మైల్" గారికి కూడా.

Anonymous

నిజమే.మీలాంతి వారిని చచ్చినా ఎవడూ ఎవరినీ వుధరించమనడు.కాకపోతే మీకు సొనియాకే కొద్దిగా పోలెఇకలు కలుస్తాయి కదా. చేసింది తక్కువ, గోల ఎక్కువ. రాసింది తక్కువ హడావిడి ఎకువ. అది కూడా ఎవరో రాసిన ప్రసంగం మనం చదివెయ్యడం.సోనియా గురించి ఒక్కసారాలోచిమ్చండి జోతక్కాజీ.

చదువరి

ఆలస్యంగానైనా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!

cbrao

జ్యొతి బెహన్:

తోఫా జో మిలా ఆప్కో,
లాయక్ హై ఆప్ లేనే కా,
బన్లియ భాయీ ఇత్నే ఆప్కా,
కరూ క్యా గింతీ, ఆప్కో
బధాయీ ఔర్ జియో సౌ సాల్

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008