Wednesday, 9 January 2008

ఆంధ్రాంగ్ల పద్యాలు

ఆంధ్రాంగ్ల భాషా సమ్మేళనంలో పుట్టిన కొన్ని చమత్కార పద్యాలు చూద్దాం.

కనులంజూడదు భార్యయేనియును నీకాల స్థితింబట్టి జ
ర్మను తైలమ్ము జపాను సబ్బమెరికా క్రాఫున్ వియన్నాసులో
చనముల్ స్వీడను చేతి బెత్తమును స్విట్జర్లాండు రిస్ట్ వాచి ఫా
రెను డ్రెస్ ఫ్రెంచ్ కటింగు మీసాలును ఫారిన్ ఫ్యాషనే లేనిచోన్ !!


రచన : మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారు.

ఇన్సూర్ లేని లైఫును
సెన్సార్ కానట్టి ఫిల్ము సీక్రెట్ ట్రూతున్
వైన్సర్వు కానట్టి ఫీస్టును
విన్నే లేనట్టి టీము వేస్టుర బ్రదరూ !
లైఫన నౌవెడే ససలు రైటని చెప్పగలేము బెడ్డులో
నైఫును బోలెడెత్తు ప్రతి నైటును డేయును ఫాలోయవ్వగా
వైపును సన్సు డాటరుల ప్రాపరు రక్షణ నిల్లు దేరు ఫోర్
లైఫుకు ఇన్సు్‌రెన్సు బహుళంబుగ ఫ్రాంప్టు ప్రొటెక్షనిచ్చెడిన్ !!


రచన : ఇలపావులూరి సుబ్బారావుగారు.


రామ ది కింగ్సు సన్ను వితు లక్ష్మణ ఎండ్ వితు సీత క్రాస్డు దీ
ఫేమసు దండకాసు బిగు ఫీల్డుసు మోస్టు లెబోరియస్లి దెన్
కేము విరాధ విత్తు హిజు క్రూయలు వర్డ్సు - బివేరు ఫూల్సు నో
టైము టు లూ జయాము వెరిటరిర్డయి వాంట్మయి బ్రేకు ఫాస్టు సూన్ !!


రచన : విశ్వనాధ కవిరాజుగారు...

అర్ధం కాలేదు కదా
ఈ పద్యాన్ని ఇంగ్లషులో రాసుకుని చదివితే త్వరగా అర్ధమవుతుంది. కాని అది పద్యం కాదు. ప్రయత్నించండి.

7 వ్యాఖ్యలు:

Anonymous

సరదాగా భలే బాగున్నాయండీ, ముఖ్యంగా రెండోది.

కొత్త పాళీ

కందం భలేగా ఉంది.
సిరిసిరిమువ్వ శతకంలో శ్రీశ్రీ కూడా ఇలాంటివి కొన్ని రాశాడు ..
క్రాస్వర్డు పజిలు సాల్వకు ..
హిప్పోపొటమసొక్క బిషప్పును గాంచి ..

గిరి Giri

these very funny poems, neat and
nice laughter worthy gems,సరదాల
పువ్వులు విరబూయించెను, నవ్వులిటుల
share చేసినందుకు మీకు నూరు Thanks!

== గణాలు ఆటవెలదిలో పడాలంటే ఇలా చదవండి==
ఆ.వె. దీస్ వెరీఫన్ని పోయెమ్సు నీటు అండు
నైసు లాఫ్టరు వర్తిజెమ్సు సరదాల
పువ్వులు విరబూయించెను, నవ్వులిటుల

షేరు చేసినందుకు మీకు నూరు థాంక్సు

రాఘవ

కం.ఓ మై గాడ్ వాటీజ్ దిస్
దే మేడ్ "పద్యమ్స్" విదౌటెనీ డిఫికల్టీస్
ఐ మేడ్ ఎనదర్ పోయెమ్
ఇస్ మేఁ హిన్దీ బహుత్ సహీ విత్ ఇంగ్లీష్.

కం.O My God! What is this?
They made padyams without any difficulties?!
I made another poem
इस् में हिन्दी बहुत् सही with English.

నేను కొంచెం గడుసుగా హిందీ కూడా తీసుకువచ్చేశాను. :P

అన్నట్టు గిరిగారూ, అది తేటగీతి కదూ.

జ్యోతి

ఐతే మరో హిందీ పద్యం కూడా అందుకోండి..

ఫలం లేదు మజ్కూర్ కలమ్ బందు హల్‍సాల్
అలం మోదు గాకుల్ క్వచిత్ టేకుమాకుల్
అవుర్ కోయకొంపల్ మరీమాల కొంపల్
హేయే ముండ్ల కంపల్ హమారే గ్రహారే !!

రాయలకాలంలో ఓ సాహెబు కవిగారు ఓ పల్లెటూరిలో ఉండవలసి వచ్చి పడ్డ అష్టకష్టాలు ఇలా పద్యరూపంలో చెప్పుకున్నాడంట. నిజంగా ఈ పద్యం చూస్తే కష్టం దాని భాషని అది వెదుక్కుంటుంది అని అనిపిస్తుంది కదా!!

Usha

ఒహ్ ఎంటండి నేనేదో కొత్త లోకం లోకి వొచ్చిన భావం కలుగుతుంది. మీ అందరి చలోక్తులని చూస్తుంటే నా మీద నాకే సిగ్గుగా ఉంది. నేను ఇంత అడవిలో ఉండిపోయనేంటి అని. ఇప్పటికన్నా ఈ మీ ప్రపంచములో తావు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు అభిమానం అంటే ఏదో ఇష్టపడటం అనుకున్నా ఇన్ని రోజులు. కాదు అసలు తెలుగు అంటే ఏంటో అర్ధం చేసుకొని ఆస్వాదించడం అని నిన్నటి నుండి ఇక్కడ తెలుసుకోగాలుగుతున్నాను.
మీ అందరికి నా ధన్యవాదములు .
సిరసొంచి మీకు మొక్కుతున్నా నాకింతటి అదృష్టాన్ని కల్పించినందుకు .
సదా మీకు రుణపడి ఉంటాను
మీ తోటి సభ్యురాలు అవ్వగలిగే స్థాయికి ఎటూ ఎదగాలేను కాని మీతో పాటు కలిసుండే అదృష్టానికి మాత్రం చాలా ఉప్పొంగిపోతున్నాను
ఉష

గిరి Giri

రాఘవా,

ఆ.వె. తేటగీతి రాసి దేరు యూఆరని
ఊరుకోక నేను పేరు మార్చి
ఆటవెలది చేయ, నాటు డన్నని ఎత్తి
చూపునందుకు తమకు పలు థాంక్సు.

కందం బావుంది. వేర భాషలని అరువు తెచ్చుకుంటే పద్యాలు కట్టడము సుళువే :)
==
తేటగీతి రాసి there you'reని
ఊరుకోక నేను పేరు మార్చి
ఆటవెలది చేయ, not doneని ఎత్తి
చూపునందుకు తమకు పలు Thanks

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008