Wednesday 25 June 2008

నేటి మహిళకు మేటి కంప్యూటర్..


ఇది మహిళా బ్లాగర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న మహిళలకు కూడా. సాధారణంగా అందరి ఇళ్ళల్లో కంప్యూటర్ స్టడీ రూంలో కాని, హాల్ లో కాని ఉంటుంది. మగాళ్ళకు వంటింట్లో పని ఏముంటుంది . హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని మనం చేసిచ్చే పకోడీలు, టీ, కాఫీలు లాగిస్తూ తమ పని చేసుకుంటారు. మహిళలకు అలా వీలు కాదుకదా?


ఎలా మరి???



పర్లేదు మనకోసం కూడా కిచన్లో పెట్టుకునే కంప్యూటర్ వచ్చింది. హాయిగా వంట చేస్తూ పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. లేదా కేబుల్ చానెళ్ళు. ఇక కూరలు ఉడికేలోపు కంప్యూటర్ మీద ఏదైనా రాసుకోవచ్చు. ఇలా అక్కడే మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావొచ్చు. అన్నం ఉడికేలోపు ఒక ముఖ్యమైన మెయిల్ చదివి రిప్లై ఇచ్చేయొచ్చు. వంటిల్లు సర్దుతూనే ఆన్‌లైన్ బిల్లులు కట్టేయొచ్చు.


అలాగే వంట అయ్యాక పాత్రలతొ పాటు మరకలు పడిన (పప్పు, కూరలు లాంటివి పడకుండా ఉంటాయా) కీబోర్డ్ ని కూడా కుళాయి క్రింద పెట్టేసి హాయిగా కడిగేయొచ్చు. నిజం.. ఏమి కాదు . వాటర్ ప్రూఫ్. ఇంకా ఆశ్చర్యపరిచే సంగతి.. ఇది వైర్‌లెస్ సిస్టం. మనం గిన్నెలో కూర కలుపుతూనే అక్కడినుండి కదలకుండానే సిడి మార్చొచ్చు..

భలే ఉంది కదూ..


కాని దీని ధర $1595.99 మాత్రమే.


కాని ఒక విశేష సూచన. భర్తలూ మీ క్రెడిట్ కార్డులు జాగ్రత్త. మీ ఆవిడ ఈ టపా చూడకుండా జాగ్రత్తపడండి. తర్వాత మీ ఇష్టం..నన్ను అనొద్దు మరి..

దీని వివరాలు ఇక్కడ చూడండి.

1 వ్యాఖ్యలు:

ప్రతాప్

ఒహ్.. వావ్వ్.. సూపరు. చాలా బావుందండి ఈ కంప్యూటరు. ఇంతకీ ఒక ధర్మసందేహం, మీ ఇంట్లో ఉందా?

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008