Friday 27 June 2008

మహిళలకు మాత్రమే ప్రవేశం...

మహిళా బ్లాగర్లకొక శుభవార్త.

బ్లాగు అగ్రిగేటర్ జల్లెడలో మహిళా బ్లాగర్ల కోసం ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఏర్పాటు చేయబడింది. అందులో కేవలం మహిళా బ్లాగులు (మహిళలు రాసే బ్లాగులు. తప్పుగా అర్ధం చేసుకోకండి) చేర్చబడతాయి. ఈ ప్రాంగణానికి వెళ్లడానికి తయారు చేయబడిన బొత్తాము మీ బ్లాగులలో పెట్టుకోవడానికి ఈ క్రింది కోడ్ ని మీ బ్లాగులో పెట్టండి. దాన్ని నొక్కితే అది నేరుగా మహిళా బ్లాగుల విభాగానికి తీసుకెళ్తుంది. ఇప్పుడు సుమారు పాతిక మంది ఉన్నా మహిళా బ్లాగర్లు ఇంకా పెరగాలని ఆశిస్తూ...



<a href="http://jalleda.com/jcustcat.php?catid=7">
<img border="0" src="http://www.jalleda.com/images/jmahila.png" alt="మహిళా బ్లాగర్లు "/>
</a>

ఈ పై డబ్బాలోని కోడ్ మీ సైడ్ బారులో అతికిస్తే మీకు క్రింద చూపిన విధంగా అందమైన బొత్తం ప్రత్యక్ష్యం అవుతుంది. దానిని నొక్కితే మీ చదువరులు నేరుగా మహిళా బ్లాగర్ల వర్గానికి వెళ్తారు.

మహిళా బ్లాగర్లు

12 వ్యాఖ్యలు:

Purnima

ఏంటీ.. మహిళలు పాతిక మందేనా?? :-O అసలెంతమంది బ్లాగర్లు ఉంటారు ఉజ్జాయింపుగా..

నాకెటెళ్ళినా అమ్మాయిలే ఎందుకు కనిపిస్తున్నారు చెప్మా??

కొత్త పాళీ

ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని నేను నిరవధిఖంగా ఖండిస్తున్నా నధ్యక్షా!

సిరిసిరిమువ్వ

అసలు ఈ ప్రత్యేక ప్రాంగణం అవసరం ఏమిటి?

జ్యోతి

పూర్ణిమా

అదే మరి మహిళల ప్రత్యేకత.. ఒక్క టపా రాస్తే పది టపాలు రాసినట్టు అన్నమాట.

కొత్తపాళీగారు,
ఎందుకండి ఖండించడం??ఎలాగూ మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కాని ఇక్కడ అందరిలో ఉంటు మాకంటు ప్రత్యేకంగా ఉండాలని.. అవునూ ఇక్కడ అధ్యక్షా !! ఎవరూ???. త్వరలో కూడలిలో కూడా ప్రత్యేక విభాగం కావాలని అడిగాము వీవెన్‍ని. ఎలాగూ ప్రత్యేక చాట్‍రూమ్ ఉంది. ఇది మాత్రం ఎందుకు వద్దు.

వరూధినిగారు.
తెలుగు బ్లాగర్లలో మహిళల బ్లాగుల కాస్త ప్రత్యేకంగా ఉండాలని.. అంతే . వేరే దురుద్దేశ్యం లేదులెండి..

Unknown

నిజ జీవితంలో‌ చాలదన్నట్టు ఇక్కడ కూడా రిజర్వేషన్లు...
ప్చ్.. ఏం చేస్తాం‌!

Rajendra Devarapalli

కానివ్వండి

Aruna

ha hya..bhale bhale. Nenu kuDa manchi muhurtam chuskoni active aipota.

Vensy

నా బ్లాగులో ఆ బొత్తాన్ని కుట్టడానికి ప్రయత్నిస్తే అతుక్కోవడంలా.పేస్ట్ చేయమందామంటే ఆ మాటే లేదు. ఏంచేస్తే అతుక్కుంటుందో... కొంచెం కాజాకుట్టు ఎలా కుట్టాలో చెప్పరూ...

San .D

నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉందేమో తెలీదు గానీ మరి ఈ పరిణామాలు
నాకు నచ్చటం లేదండి. రైళ్ళల్లో మహిళల బోగీ ఉన్నట్టు ఇక్కడ కూడా ఎందుకు??
అసలు మహిళా బ్లాగర్లు,మగ బ్లాగర్లు అన్న ఆలోచన ఎందుకు??
ఇలా చేసే ప్రతీ పనిలోనూ మగ ఆడ అన్న తేడా చూపించడం అంత ఆరోగ్యకరం కాదని నా నమ్మకం.

నొప్పిస్తే క్షంతవ్యుడిని.

Anonymous

త్వరలో మిగతా అన్ని రిజర్వేషన్లు వస్తాయనుకుంటా...

www.srinucartoons.blogspot.com

సుష్మాస్వరాజ్,జయలలిత,ఉమాభారతి,మాయావతి వీళ్ళందరికి ఏ రిజర్వేషన్లు ఉన్నాయి.ప్రతిభ కంటే ఎక్కువగా రిజర్వేషన్‌ని నమ్ముకోవడం మనదేశంలో బాగా అలవాటు.

Indian

అసలు రిజర్వేషన్ కాన్సెప్టే తప్పు.,PHC కి రిజర్వేషన్ ఇచ్చాము అంటే అర్ధం వుంది, వారికి మనో ధైర్యం కలగటానికి, మరి అన్ని బాగానే వున్నా ఆడవారికి రిజర్వేషన్?. సమాన హక్కు కావాలి కాని క్యూఁ మాత్రం సేపరేటుగా వుండాలి! ఎందుకో?.ఇక చదువులకొస్తే... హుం . వాటి గురించి మాట్లాడాలంటేనే బయం వేస్తున్నట్టు వుంది..నో క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ at 95% institutes. ఎంత సేపు మార్కుల గోలేగాని చదివిన దాని మీద అవగాహన కల్పించే సమయం లీనంత బిజీ ఎడ్యుకేషన్ ఐపోయింది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008