Sunday, 27 July 2008

శాంతి ... శాంతి....


అమ్మల్లారా, అయ్యల్లారా.. శాంతించండి..

ఎందుకు , ఎక్కడ, ఎలా అంటారా???

గత కొద్దిరోజులుగా మతపరమైన బ్లాగులో జరుగుతున్న వ్యాఖ్యల యుద్ధం చూస్తూ ఉన్నాను. నాకే కాదు ఎందఱో బ్లాగర్లకు చాలా బాధగా ఉంది ఇలా జరగడం. ఆ బ్లాగరు రాసే దానికి వ్యతిరేకంగా మరో బ్లాగు మొదలెట్టి బ్లాగు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తున్నారు. కాని మిగతా బ్లాగర్లందరికీ నా సవినయ విన్నపము. మీరు ఈ రాతలకు స్పందించకండి. నాకూ కోపం వచ్చింది మొదట్లో ఆ బ్లాగులో విషయాలు. కాని కొందరు బ్లాగర్లు , చదువరులు మర్యాదగా చెప్పినా ఆ బ్లాగరు మారలేదు. అలాంటప్పుడు మీరెందుకు ఉద్రేకపడుతున్నారు. మీరు అలా వ్యాఖ్య మీద వ్యాఖ్య చెప్పినందువల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు. సమస్య ఇంకా విషమంగా తయారవుతుంది . అందరూ బాధపడుతున్నారు. ఏది మాట్లాడితే ఏమవుతుందో అని. అలాంటప్పుడు అందరూ ఆ బ్లాగులో వ్యాఖ్యలు రాయకండి. అలా వ్యతిరేకంగా అయినా రాసి ఆ బ్లాగుకు మరింత ప్రాముఖ్యం ఇస్తున్నారన్న విషయం మరిచిపోవద్దు. అది అతనికే లాభం. అనవసరంగా మనకు సమయం వృధా. మీకు నచ్చకుంటే ఆ బ్లాగుకు వెళ్ళకండి. చదవకండి. స్పందించకండి. దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఈ మత పరమైన రాతలు హద్దులు దాటితే దానిని కూడలి నుండి తీసేయించొచ్చు. కాని ఇప్పటికిప్పుడు కులప్రాతిపాదిక పై నిరోధించలేము. సో అందరూ కాస్త సంయమనం పాటించండి. దాని బదులు సరదా విషయాలు, సినిమాలు, వంద నోటు, క్వార్టర్ సీసాలు ఇచ్చివోట్లు కొనుక్కుని తమని తాము కోట్లకు అమ్ముకుంటున్న రాజకీయ నాయకుల గురించి చర్చించండి...

ఓం .. శాంతి ... శాంతి..............

10 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli

ఈ మత పరమైన రాతలు హద్దులు దాటితే దానిని కూడలి నుండి తీసేయించొచ్చు. కాని కులప్రాతిపాదిక పై నిరోధించలేము.--- కాస్త వివరించగలరా?

జ్యోతి

రాజేంద్రగారు, నేనన్నది. అది ముస్లీమ్ బ్లాగు అనీ తీసేయలేము కదా. కూడలి ఉన్నది అన్ని తెలుగు బ్లాగులకోసం. కాని ఇది అలుసుగా తీసుకుని ఆ బ్లాగరు కావాలని రెచ్చగొట్టే రాతలు రాస్తే ఉపేక్షించొద్దు అని. మనం ముందు ఆ బ్లాగును పట్టించుకోకుండా ఉందాము. ఎంతవరకు వెళతారో చూద్దాం. తప్పు అతనివైపే ఉండనిద్దాం.మనం సమాధానమిస్తె ఇంకా రెచ్చిపోతారు. అనవసరమైన వాగ్యుద్ధాలు.

Bolloju Baba

మీరన్నది కరక్ట్
మీ సూచన పాటిస్తాను.
బొల్లోజు బాబా

సుధాకర బాబు

నేనను కొన్నదే జ్యోతి గారు వ్రాశారు. తన ఇష్టమొచ్చింది వ్రాసే హక్కు తనకుందని బ్లాగరు అనుకొంటారు. స్పందించే హక్కు తమకుందని వ్యాఖ్యాతలు అనుకొంటారు. రెండూ కరక్టే గాని అప్పుడు ఈ బ్లాగులు మన సినిమా హీరో అభిమానుల సైటుల లెవెల్‍‌కు వచ్చేస్తాయి. చూసీ చూడనట్లు ఊరుకోవడమే ఇలాంటి బ్లాగులకు ఉత్తమమైన స్పందన.

Dr. Ram$

జ్యోతి గారు, ఇంక లాభము లేదండి , బ్లాగ్లోకము లో పాప సంహరణ కి "అవతార పురుషుడు (శ్రీ శ్రీ అలదిండి గలిదిండి అచ్హి బుచ్హి రాంస్ బాబా)" రావాలసిన సమయము ఆసన్నమయ్యింది..నాకు కాస్త తీరిక లేదండి, వుంటే ఈ పాటికి ఎప్పుడొ వచ్హి వుండె వాడిని..
బ్లాగ్లోకము లో బ్లాగర్ల, వ్యాఖ్యత ల పాపాలు పండాయి.. అర్ధం పర్ధం లెని చర్చలు, వాదనలు, కొంతమంది బ్లాగర్లు ఐతే వ్యాఖ్యతల ని తన్ని మరీ వాళ్ళ భావాలని రుద్దేస్తున్నారు.. ఇన్నాళ్ళు బ్లాగరు టపా కి వ్యాఖ్యలు చూశాను..కాని ఈ మద్య వ్యాఖ్యాతల వ్యాఖ్య ల కి వేరే వాళ్ళు యేయ్ తంతాము, పొడుస్తాము, నీ భావాలు తప్పు అని, ఎంతో కర్కశము గా వ్యాఖ్యలు రాస్తున్నారు.. బాబొయ్ , అరిపిస్తున్నారు..యిది కూడలి నా లేక పార్లమెంట్ సమావేశాలా అన్న భావం కలుగుతుంది.. నేను ఇంతే వుపేక్షిష్తే , "ముడుపులు తీసుకొని టపాలు, వ్యాఖ్యలు రాస్తున్నారు" మన తెలుగు బ్లాగర్లు అని యే టి.వి 9 వాడో, న్.టి.వి వాడో "ఆపరేషన్ ముడుపులు" పేరు తో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన చేస్తారు. పెద్ద అపవాదు కూడా మూట కట్టుకోవాలిసి వస్తది మన తెలుగు బ్లాగర్లు.. తప్పదు, బ్లాగ్లోకము లో బ్లాగర్లు, వ్యాఖ్యాతల పాపం పండింది.. నేను కాస్త తీరిక చూసుకొని త్వరగా వచ్హేస్తాలేండి.. మీరు ఏమి బాధ పడకండి.. జై హిందు, జై ముస్లిం , జై ఆడ , జై మగ, జై అగ్ర వర్ణాలు , జై దళిత వర్ణాలు, జై తెలంగాణా, జై ఆంధ్ర, జై చిరంజీవ, జై రాజశేఖర, చివరాఖరి గా జై సాక్షి, జై ఈనాడు... జై జై అవతార పురుష " శ్రీ శ్రీ అలదిండి గలిదిండి అచ్హి బుచ్హి రాంస్ బాబా" గారు..

Dr. Ram$

పై వ్యాఖ్య లో ఇంకొకటి అతికించడము మార్చి పోయాను, కూడలి లో ఈ కొట్లాటలు, కుమ్ములాటలు ఇంతే జరుగుతూ వుంటే ఏదో ఒక రోజు "కూడలి వీవెన్" గారి పై అవిశ్వాస తిర్మానము పెట్టవలసి వస్తుంది, సభాపతి జ్యోతక్క గారి ఆధ్వర్యము లో.. అబ్బో అప్పుడు బలే మజా వస్తుంది లే రెండు మూడు టపాలు మాత్రమే రాసిన నాలాంటి చిన్నా చితక బ్లాగర్ల కి కూడా మంచి డిమాండ్ వస్తుందేమో.. బ్లాగుల ని నాలెడ్జ్ కి, హాస్యానికి, భావుకత కి, చిన్ననాటి, ప్రస్తుతపు మన దైనందిన జీవితము లో మనకి రోజు తారస పడె సరదా సరదా సన్ని వేశాల కి వాడుకుంటే మంచిదని నా మనవి.. ముఖ్యం గా యిలా "కూడలి" అని లాభాపేక్ష లేని , తెలుగు బాషాభివ్రుద్దికై పాటు పడుతున్న పబ్లిక్ సైట్ ల లో.. యిది నా ఫీలింగ్ మాత్రమే.. కావున దయచేసి నా వ్యాఖ్య లో తప్పులు వెతక్కండి మహ ప్రభో..

Sujata M

Thank you jyoti garu. Good idea.

Rajendra Devarapalli

కాని కులప్రాతిపాదిక పై నిరోధించలేము---????

చిన్నమయ్య

నిజము, సత్యం ల మూసివేత.
వాన వెలిసింది.
సునామీ తప్పింది.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

బ్లాగుల/బ్లాగరుల యొక్క తప్పొప్పుల విషయం విపణి శక్తుల (market forces) కి వదిలిపెడదాం. మనం ఏ విషయం మీదా గిరిగియ్యలేం.

కూడలి ఇప్పటికే అనేక సెన్సార్లకు లోనై బక్కచిక్కినట్లు కనిపిస్తోంది. దాన్ని ఈ వివాదాల్లోకి లాగడం నాకు సుతరామూ ఇష్టం లేదు. కూడలిలో బ్లాగుల సంఖ్యని ఇంకా పెంచాల్సి ఉంది. ఉన్నవాటిని తొలగించడం కాదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008