Sunday, August 17, 2008

హుర్రే !!! నేను గెలిచానోచ్...

ImageChef.com Poetry Blender

అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. మీ అందరి ప్రోత్సాహముతో హైదరాబాదీ బెస్ట్ బ్లాగుగా నా "షడ్రుచులు" ఎంపిక చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాదీయుల బ్లాగులలో షడ్రుచులు 276 ఓట్లతో (46%) , అగ్రస్థానంలో నిలిచింది. మిగతావన్నీ ఇంగ్లీషు బ్లాగులే .అందులో మన తెలుగు బ్లాగు అత్యున్నతంలో నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ విజయానికి హైదరాబాద్ మస్తీ సభ్యులు, తెలుగు బ్లాగు మిత్రులు, కంఫ్యూటర్ ఎరా సభ్యులు ఇచ్చిన సహకారమే ముఖ్య కారణం. ఇది నా వ్యక్తిగత విజయం కాదు.అందరు తెలుగువారిది అని భావిస్తున్నాను.
East or West తెలుగు is best

34 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

జ్యోతి గారు,అందుకోండి మా హౄదయపూర్వక ధన్యవాదాలు. మీరు మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ...

Anonymous

హైదరాబాదీ బెస్ట్ బ్లాగు గా మీ షడ్రుచులు ఎంపిక కావటం మాకు కూడా ఆనందంగాను, గర్వంగాను ఉంది. ఈ విజయాన్ని సాధించినందుకు, తెలుగు బ్లాగును అత్యున్నత స్థాయిలో నిలిపినందుకు, మీకు నా అభినందనలు తెలియచేస్తున్నాను.

కత్తి మహేష్ కుమార్

మీకు నా అభినందనలు. మీకొచ్చిన ఓట్లలో నాదీ ఒకటుందండోయ్!

నల్లమోతు శ్రీధర్

జ్యోతక్కా, బెస్ట్ బ్లాగ్ గా ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు.

teresa

హృదయపూర్వక అబ్జినందనలు!

నిషిగంధ

జ్యోతి గారూ, హృదయపూర్వక అభినందనలు.. మీరిలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

జాగృతి

జ్యోతి గారు, కృషి ఉంటే విజయం వరిస్తుందనేది మరోసారి రుజువైంది. తెలుగు బ్లాగ్ ల విషయంలో ఇది మీరు పడుతున్న శ్రమకు నిజమైన గుర్తింపు. ఈ రొజు జరిగిన నాకు నచ్చిన రెండు మంచి సంఘటనల్లో ఇది ఒకటి.

నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Satyavati

జ్యోతి గారూ
మీకు నా హ్రుదయపూర్వక అభినందనలు.

cbrao

ఎందుకో ఇది కూడలి లో రాలేదు. ఆలస్యంగానైనా, అక్కా అందుకో అభినందనలు.

కొత్త పాళీ

హార్దికాభినందనలు

krishna rao jallipalli

ఎంతో ఆనందం. అందుకోండి అభినందనలు.

రమణి

హార్దికాభినందనలు

అశ్విన్ బూదరాజు

congrats, naaku aa BLog anTE saradaaa, nijaM ga bavuntundi

బొల్లోజు బాబా

congrats

శ్రీవిద్య

జ్యోతిగారూ... ఈమద్యనే నేను ఈ తెలుగుబ్లాగుల్లోకం లో అడుగుపెట్టాను. మీ బ్లాగ్ చాలా బాగుంది.
మీరు విజయం సాదించినందుకు ఇవే నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.

నాగన్న

శుభాకాంక్షలు

రాధిక

అభినందనలు జ్యోతిగారు.మీరు ఒక్కొ మెట్టూ ఒక్కొ మెట్టూ ఎక్కుతూ చాలా దూరం వెళ్ళిపోయారు.అయినా మీ చూపులు,మనసు నేలను తాకుతూ వుంది.అది మీ గొప్పతనం.
అన్నట్టు నాకో అనుమానం...బోలెడు హైదరాబాదు తెలుగు బ్లాగులు వున్నాయి కదా మరి ఎవరూ ఇందులో పోటీ చెయ్యలేదా?మీరు మనవాళ్లకి [హై బ్లాగర్లకు] చెప్పి వుండాల్సింది.

మీనాక్షి

జ్యోతి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు..

జాన్‌హైడ్ కనుమూరి

నా హృదయపూర్వక అభినందనలు

ప్రతాప్

congrats జ్యోతక్కా,
ఈ శుభ సందర్భంలో మంచి పార్టీ ఇస్తారని (మీ చేతులతో వండిన వంటలు) ఆశిస్తున్నాం.

ఆయుష్మాన్ భవ!!

ఓటుకు వేసినందుకు ఏదో ఇస్తానని.. అపుడోసారి చెప్పినట్టు గుర్తు. మాకు పార్టీ కావాలి... పార్టీ అంటే మీ షడ్రుచులు బ్లాగులో వంటకాలు చూసి బ్రేవ్ మనండి అంటారేమో!!! మాకు నిజం పార్టీ కావాలి.

ramya

జ్యోతి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు..
అవును నాకూ పార్టీ కావాలి. ఎప్పుడు ఇస్తున్నారు?

Anonymous

జ్యోతక్కా,

శుభాకాంక్షలు.

అవార్డు నువ్వే వుంచేసుకుని ప్రైజు నాకిచ్చెయ్.

-- విహారి

saisahithi

శుభాకాంక్షలు,
నిజమే ఇది మన తెలుగు వారందరి విజయం

జ్యోతి

మీ అభిమానమే ఈ పోటిలో చేరి గెలిచేలా చేసింది. అందరికి కృతజ్ఞతలు.

రాధిక, అందులోకొన్ని తెలుగు సైట్లు ఉన్నట్టున్నాయి కాని ఈ పోటికి తగిన బ్లాగులను వాళ్ళే నిర్ణయించారు. నా బ్లాగు అలాగే చేరింది.

విహారి,
ఒకవేళ ప్రైజు గట్రా ఇస్తే నీకే ఇస్తాలే..

ఇక పార్టి ఆంటే ఓకె. నేను చేయడానికి రెడీ.

Naveen Garla

ఇందులో నేను వేసిన వోట్లు ఆరు :)

places visited in US and India

నేనూ ఈ బ్లాగుల ప్రపంచానికి కొత్తదానినే. మొన్న ప్రమదావనానికి వద్దామనుకునీ కొంచె సంకోచించాను..బ్లాగరు వయసు గురించి ఏవో చర్చలు జరుగుతున్నట్లున్నాయి కదా, అవేవో తేలాక వద్దామనుకున్నా. జ్యోతిగారూ, మీతో మొదటి పరిచయం శుభాకాంక్షలు తెలుపుతూ..అందంగా వుందికదూ. హార్దిక శుభాకాంక్షలు అందుకోండి.

లక్ష్మి
psmlakshmi.blogspot.com
2psmlakshmi.blogspot.com

Purnima

Hearty Congratulations!! Party ekkadaa??

te.thulika

అభినందనలు జ్యోతి గారూ. చాలా సంతోషం.

జ్యోతి

లక్ష్మిగారు, అలాంటి సంకోచమేమీ లేదండి. ఇక్కడ మహిళలు అన్నదానికే ప్రాముఖ్యం తప్పితే వయసుకు అస్సలు సంబంధం లేదు. మీరు హై. బ్లాగర్ల మీటింగ్‍క్ వచ్చారు కదా. వచ్చే ప్రమదానం కి రండి . ఇది ఆన్‍లైన్‍లో జరుగుతుంది. మీరు నాకు మెయిల్ చేస్తే ఎంట్రీ పాస్ ఇస్తాను. ఎందుకంటే ఇది మహిళలకు మాత్రమే..

మాలతిగారు, పూర్ణిమ .. థాంక్స్..
నవీన్. నాకుతెలుసుగా. అందుకే ఈ విజయం నాది కాదు తెలుగుబ్లాగర్లందరిదీ అన్నాను.

సిరిసిరిమువ్వ

అభినందనలు. మరి పార్టీ ఎప్పుడు?

కృష్ణుడు

congratulations Jyothi gaaru.

నరసింహ

హార్దికాభినందనలు

వేణూ శ్రీకాంత్

Hearty Congratulations.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008