Thursday 30 October 2008

మనసులో మాట





మనసులో ఏదైనా విషయం మీద ఆలోచనలు మొదలయ్యాయంటే అవి అలా కొనసాగిపోతుంటాయి. వాటికి హద్దు, అదుపు ఉండదు. వాటిని అలా కాగితంపై అలవోకగా రాసేయొచ్చు. ఎందుకంటే అవి మనకు నచ్చినట్టుగా,మన స్వభావానికి తగ్గట్టుగా ఉంటాయి. కాని ఇతరుల గురించి రాయాలంటే కొంచం కష్టమే. నాకైతే మరీ కష్టం. కంప్యూటర్ ఎరా పత్రిక కోసం బ్లాగు రివ్యూ రాయించి పంపడం ప్రతినెల నా భాధ్యత. నవంబరు నెలకోసం రాయమని చెప్పినవాళ్లు పని ఒత్తిడిలో రాయలేకపోయారు. చివరి తేదీ దగ్గరకొచ్చింది. ఆ పేజీ వదిలేయడానికి మనసొప్పలేదు. సో తెగించి "ధైర్యే సాహసే మా ఆయనే" (భారతీయ నారి భర్త పేరు చెప్పొద్దు మరి) అనుకుని వేరే పని వత్తిడిలో ఉన్నా కూడా రమణి బ్లాగు గురించి రాయడం మొదలుపెట్టా. ఇంకేముంది. అలా రమణి బ్లాగుకెళ్లి మంచి మంచి టపాలు వెతుకుతూ, చదువుతుంటే సమీక్ష కొండెక్కుతుంది. మళ్లీ దానిని ముందుకు లాక్కుని రాయడం. ఎలాగైతేనేమి ఓ మూడు గంటలలో చెమట్లు గ్రక్కుతూ సమీక్ష పూర్తి చేసా. ఇలా ఎందుకన్నానంటే కనీసం మూడు పేజీల సమీక్ష ఇవ్వాలి మరి. అప్పుడే అది పత్రికలో పూర్తి పేజికి సరిపడుతుంది. ఆ సమీక్ష చదివి ఆ పత్రిక సంపాదకుడు శ్రీధర్ ఓకె అన్నాక నా తలపై పెద్ద భారం తగ్గినట్టైంది. ఎందుకంటే మొదటిసారి ప్రయత్నించా కదా. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని రాయాలి. లేకపోతే మిగతా బ్లాగర్లు, చదువరులు నన్ను చీల్చి చెండాడరూ. "ఇంటర్నెట్‌లో తెలుగు వెలుగులు" తర్వాత కంప్యూటర్ ఎరా లో నా రెండవ వ్యాసం ఇది. "మనలోమాట .. నా మనసులో మాట" నేను రమణి బ్లాగు ఎంచుకోవడానికి మరో ప్రత్యేకమైన కారణం ఉంది. అది తర్వాత చెప్తాను.

మరో గమనిక.

నేను రాయాలనుకుని రాయలేకపోయిన టపా . నాకు తెలిసిన బ్లాగర్ల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అలవాటుగా మారింది అని అందరికి తెలుసుకదా. కాని కొత్తపాళీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దామనుకునేటంతలో , మరో ఏకలవ్య శిష్యుడు నల్లమోతు శ్రీధర్ తన బ్లాగులో బ్రహ్మాండంగా చెప్పేసాడు. పండగ రోజునుండి కూడలి చతికిలబడింది. ఈ విషయం అందరికీ తెలియదని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఒకసారి కంప్యూటర్ ఎరా బ్లాగుకేసి లుక్కేసుకోండి మరి..

5 వ్యాఖ్యలు:

Ramani Rao

సమీక్ష మటుకు నేను రాసిన టపాల కన్నా చాలా బాగా ఉంది. అంతా బానే ఉంది. కాని చివర్లో ఏంటలా సస్పెన్స్ లో పెట్టేసారు. సరె! ఎవరికీ చెప్పను నా చెవిలో చెప్పేయండి నా బ్లాగు ఎందుకు ఎంచుకొన్నారో? ష్! మనలొమన మాట, ఎవరన్నా నా టపాలు తట్టుకోలేక, ఇంక ఆపమని వీడ్కోలు సన్మానాలేమన్నా అనుకొన్నారా?? ;-)

Anonymous

నేను ఎప్పుడో చదివేసా
నేను శ్రీధర్ గారు రాసారనుకుని చివరికంటా చదివెసాకా
అక్కడ మీపేరు చూసి ఆస్చర్యపోయా.
ఒకసారి మీ బ్లాగులో శ్రీధర్ గారిని చూసికూడా ఇలాగే అస్చర్యపోయాలెండి.
అవునండీ ,కచ్చితంగా ( పోనీ సుమారుగా) ఆడ బ్లాగులెన్నివుంటాయో చెప్పగలరా?
వూరికే తెల్సుకుందామని.

జ్యోతి

లలిత ,,

అదేంటంటే.. ఇది నా మొదటి సమీక్ష ఆ పత్రికలో రెండో వ్యాసం. కాని నా బ్లాగులో ప్రతినెల ఇచ్చేది శ్రీధర్ తన పత్రికలో ఇచ్చే ఎడిటోరియల్. అతని అనుమతితోనే నా బ్లాగులో మనందరికోసం ఇస్తున్నానన్నమాట.
ఇక మహిళా బ్లాగులు సుమారుగా 30-35 ఉండొచ్చేమో. లెక్కపెట్టలేదు. జల్లెడలోని మహిళా విభాగం చూసి నువ్వే లెక్కేసి చెప్పమ్మా!..

శ్రీసత్య...

చాలా బాగుంది.ఇలనే ముందుకు సాగండి..........!

మీ శ్రీసత్య.....

కొత్త పాళీ

సమీక్ష బాగా రాశారు. మీ రచనా శైలి ఇదివరకటి మీద గాంభీర్యతని సంతరించుకుంటోంది. అభినందనలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008