పాపం ఐటి - పాటేస్కో..
ఎమున్నదక్కో ఎమున్నదక్కో
పొట్ట పెరిగిపోయి .. జుట్టు రాలిపోయి... ఉన్నా పరువు పోయి
ఈ ఇండస్ట్రీలో నాకు
ఏమున్నది అక్కో ... ఏమున్నది అక్కా...
బి టెక్ చేసినాకా ( సామి )
హైదరాబాదు చేరుకున్నా. ( సామి )
ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఆ..ఆ...ఆ....
ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే . ఎంత కావాలి అంటే అంట పెట్టి
జాబ్ కొట్టినా... జాయిన్ అయినా బాంచన్....
ఎమున్నదక్కో.. ఎమున్నదక్కో
ట్రైనింగులు ఇవ్వకపాయే ( సామి )
క్లయింటు ఇంతరాక్షను అన్నాడు ( సామి )
కమ్యూనికేషను బాలేదు అంటే ఆ...ఆ.. ఆ..
కమ్యూనికేషను బాలేదు అంటే కుమిలి కుమిలి ఏడ్చినా
హిందులో వేయించినా బాంచన్..
ఎమున్నదక్కో... ఎమున్నదక్కో...
ప్రాజెక్టు ఇచ్చిండు ( సామి )
పే స్లిప్పు వచ్చింది ( సామి )
పే స్లిప్పు చూపించి ... ఆ..ఆ...ఆ...
పే స్లిప్పు చూపించి.. క్రెడిట్ కార్డు తీసుకున్నా.. అవసరం లేనివి
అన్నీ కొన్న అప్పుల పాలు అయినా బాంచన్...
ఎమున్నదక్కో .. ఎమున్నదక్కో...
ప్రాజెక్టు ఐపోయింది ( సామి )
కొత్తది వస్తాది అన్నాడు ( సామి )
బెంచిలో పెట్టిండూ.. ఆ.. ఆ.. ఆ....
బెంచిలో పెట్టినాక సబ్జెక్టు మర్చిపోయినా ..ఆ రోజు మా హెచ్ . ఆర్ పిలిచిండూ
పోయి కలిసినా బాంచన్...
ఎమున్నదక్కో.. ఎమున్నదక్కో..
బూమ్ తగ్గింది అన్నాడు ( సామి )
కాస్ట్ కటింగు అన్నాడు ( సామి )
బెంచిలో ఉన్నా అని చెప్పి.. ఆ.. ఆ.. ఆ...
బెంచిలో ఉన్నా అని చెప్పి బయటకు తోసిండూ
కొంప కూల్చిండూ బాంచన్..
ఎమున్నదక్కో .. ఎమున్నదక్కో..
నాకు మెయిల్లో ఇంగ్లీషులో వచ్చిన పాటకు తెలుగు రూపం. (అదేంటో నాకు అన్నీ తెలుగులో ఉండాలనిపిస్తుంది)
11 వ్యాఖ్యలు:
జ్యోతిగారు, పాట అదుర్స్.... ఐ.టీ. వాళ్ళ పరిస్థితి మరీ దారుణం గా ఉంది....
అదరగోట్టేసారు !!!
joyti garu idi vere blog lo r narayanamurty info narayana murty ga avudamani vaste yem pata padatado antu vere yevaro rasinattu jnapakam. adi kuda telugu blog lo ne vachhindy.a bloger peru rasi unte bavundedy. mirelagu ikkda rasinavanni na sontam yemi kavani yelagu munde chepparu kabatty.
జ్యోతి గారు పాట అదిరింది :)
బాగుందండీ, అనువాదంలా లేదు.
అదేమిటో నాకు అన్నీ తెలుగులో వుండాలనిపిస్తుంది -- నాకూ అంతే. :)
రవిగారు,
నేను వేరే బ్లాగులో చూడలేదు. నాకు నిన్న మెయిల్ లో వచ్చింది. ఈ విషయం పాట క్రింద చెప్పాను చూడండి..
జ్యోతి గారు, జనాల్ని నవ్వించాలనే మీ తాపత్రయం బావుంది. నిజానికి ఆర్ధిక మాండ్యం వల్ల అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్తితి. కాక పోతే IT కొంచెం ముందు.
IT ఇంజినీర్లకి ఉన్న ఆదాయం, విదేశీ ప్రయాణాలు ఇలా మరెన్నో అవకాశాలు మిగత రంగాల్లో ఉన్నవారికి లేకపోవడంతో , అందని ద్రాక్ష పుల్లన అన్న సామెతనీ ఇక్కడ కూడా ఆపాదించారు. ఈ విధంగానైనా వారికి ఉర ట కలిగితే సంతోషం.
మన తెలుగు ఛానెల్స్ పుణ్యమా అని , IT అబ్బాయిలకి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాని ఈ పరిస్తితుల్లో మీరు IT అబ్బాయిలకి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ... రాజేష్
funny song :)
@ rajesh, sitha kashtaalu sitha vi :P
pata chala baga compose chesaru
pratuta paristitulani chala baga teliya chestu undi andulo
hatz up 2 u
అదిగో మళ్ళీ ఇక్కడకూడా...మ్మ్హ్హ్
నా మనోభావాలు దెబ్బతిన్నాయ్ :-)
jyothi garu naku computer gurechi sarega tekedhu. 5 yeares back ma friend u.s veluthu net gurenchi konchem nerppadu.eepudu blog creat chesanu kani naku nenu na blog ni jalleda lo ela choodalo me vanti vare bloges ni ela anusarenchalo teledhu.konchem cheppara.na mail.i.d hellobpavan@yahoo.co.in konchem telugu lo mail chyandi.by.
Post a Comment