Friday, January 30, 2009

అదేంటోగాని....
అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి
ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి
తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాడతారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పంతుళ్ళు మరీ జోకర్లలాగా
ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు భయపడుతుంటారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంత పేదవారైనా టక్కున
అమెరికా, ఆస్టేలియా వెళ్ళి పాటలు పాడేసుకుంటారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో కాని హీరోయిన్ తల్లి ఇంట్లో మందులకు
కూడా డబ్బులుండవు కాని రెండువేలకు తక్కువ కాని జరీ చీర మాత్రమే కట్టుకుంటారు.

అదేంటోగాని హీరో ఎంత ఫైటింగ్ చేసినా షర్టు కాలర్ కూడా నలగదు.

అదేంటొగాని టీవీ సీరియల్లో ఆడాళ్లు ఎప్పుడూ ఎంబ్రాయడరీ చీరలే కట్టుకుంటారు.

అదేంటోగాని అత్త మీద చాడీలు చెప్పే కోడలు, తను అత్త అయ్యాక అన్నీ మర్చిపోతుంది.

అదేంటోగాని నాయకులు రొజూ మడత నలగని బట్టలేసుకుని బీదవాళ్ల కష్టాలు చూసి బాధపడతారు.

అదేంటోగాని అసెంబ్లీలో బండబూతులు తిట్టుకుంటారు . బయట పార్టీలలో మాత్రం నవ్వుకుంటూ చేతులు కలుపుకుంటారు.

అదేంటోగాని ఎంత హోటల్ ఓనర్ ఐనా, ఇంటికెళ్లి పప్పన్నమే తింటాడు.

అదేంటోగాని ఆడాళ్లు మొగుడికంటే పనిమనిషికి ఎక్కువ మస్కా కొడతారు.

అదేంటోగాని చాలా మంది అందంగా ఉంటారు , కాని వాళ్ల ఆలోచనలు చండాలంగా ఉంటాయి.

20 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

ఏంటండీ మీరు మరీనూ. సినిమాల్ని సినిమాల్లా చూడాలి గానీ ఇంత ఆలోచిస్తారా ఎవరన్నా? ఏవిటీ సినిమాలు అని ఆశ్చర్యం వెలిబుచ్చినప్పూడల్లా మన మిత్రులు చాలా మంది నాకీ సలహా చెప్పార్లెండి. అదే సలహా మీకూ చెబుతున్నా.

గీతాచార్య

అదేంటో కానీ మీరు చాలా బాగా వ్రాశారండీ.

అదేంటో కానీ మనం హీరోలని గుర్తుపడితే ఒక సమస్య, లేకపోతే ఒక సమస్య. (పాపం దశావతారంలో kamal గుర్తుపట్టేలా లేడ ని జనం బాధ పడ్డారు).

అదేంతోకానీ ఇది మాత్రం అదిరిందండీ. పాపం సూపర్ స్టార్ కృష్ణ పైనుంచీ దూకుతాడు. ఎన్టీయార్ ప్రక్కనుంచీ ఒక ఎదురుదెబ్బ కొడతాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి
ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు. Pic is very apt.

గీతాచార్య

కొత్తపాళీ గారు, బాగా సెప్పారండీ. సినిమాల్ని సినేమాల్లా సూడాలంట. నాకూ సెప్పిన్రు.

అప్పుడనిపించిన్దండీ.... ఏమిటి సినేమా? పలు రీలులా గోలా? అని.

Kathi Mahesh Kumar

తెలుగు సినిమాలింతే..తెలుగు సినిమాలింతే!

krishna rao jallipalli

అదేంటో గాని.. అన్నిజ్యోతి గారే చెప్పేశారు. మాకేమి మిగల్చకుండా.

Kathi Mahesh Kumar

తెలుగు సినిమాలంతే! తెలుగు సినిమాలంతే!!

పరిమళం

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.హ...హ్హ..హ్హా ...

Marthanda

నేను సినిమాలు చూడడం ఎప్పుడో మానేశాను. ఇప్పుడు పుస్తకాలు చదవడం మీదే ఎక్కువ శ్రద్ధ నాకు. సినిమాలు తీసే వాళ్ళు ప్రతిదాన్ని రంగుటద్దాలలో చూపించాలనుకుంటారు తప్ప వాస్తవిక దృష్టితో ఆలోచించరు. మా ఊరిలో ఒకతను సినిమా ప్రభావంతో నడిరోడ్డు మీద ఒక స్త్రీని రేప్ చెయ్యడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యాడు. సినిమాలో లాగ జనం చూస్తూ నిలబడిపోతారనుకున్నాడు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తారని ఊహించలేదు.

- మార్తాండ

నాగప్రసాద్

:)))

Anil Dasari

>> "అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి
తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు"

విలన్ గ్యాంగన్నా గుర్తు పడుతుందేమో కానీ, హీరో ఫ్యామిలీ మాత్రం చచ్చినా గుర్తుపట్టలేదు.

Ganesh Majji

“అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాడతారు.” హ్హ హ్హ హ్హ..

అదేంటో గాని ఆ బాల నటుడు ఎవడైనా నాకు దొరికితే... వొంగోబెట్టి లాగి తన్నాలి అనిపిస్తుంది.

Unknown

అదేంటో గాని పైన చెప్పిన అసహజాతాలే కాకుండా ఇంకా ఎన్ని ఎన్ని అసహజాతాలు ఉన్నా సరే అలాంటి సినిమాలనే మన జనం మళ్ళీ మళ్ళీ చూసేసి గొప్ప గొప్ప హిట్లుగా చేసేస్తుంటారు.(అదేంటోగాని)

Disp Name

అదెంటో గాని మీ బ్లాగు చాల స్లో గా లోడ్ అవుతుందండి! ఓ మారు రెవ్యు చేద్దురూ!

చీర్స్
జిలెబి

జ్యోతి

పరిమళంగారు,
మీరు రిక్షావోడు చూడండి,నేను చెప్పింది నిజమే అని తెలుస్తుంది..

జిలేబీ వరూధినిగారు,
అలాగంటారా.. ఏదైనా బరువు తగ్గించి చూస్తాను..

Ramani Rao

అదేంటో గాని తెలుగు సిన్మాలో హీరో రాత్రంతా రిక్షా తొక్కి, తెల్లారెసరికల్లా లక్షలు సంపాదించేసి అమ్మ దగ్గిర తను చేసిన శపదాన్ని నెరవేర్చుకొంటాడు(ఇల్లు తాట్టు వగైరా).

Anonymous

అదేంటో గాని నెత్తిమీద పిడుగుపడ్డా మా జోతక్క కొంచెం కూడా బెదరనంటుంది.
అదేంటో గానీ తన నిబ్బరం చూస్తే మా వూరి గుళ్ళో గాలిగోపురం గుర్తొస్తుంది .
అదేంటో గానీ కొందరికి ఎదిగేవాణి చూస్తే ఏడవబుద్దవుతుంది.
ఎప్పటికైనా వారికి తప్పక తమతప్పు తెలుస్తుంది

నేస్తం

అదేంటో గాని కామెంటుదామని లేఖినీ open చేయగానే ఏం కామెంటాలో మర్చిపోయాను :(

Srinivas

అదెంటో గానీ మీకన్నీ అద్ధుతమైన ఆలోచనలే వస్తాయి

Dhanaraj Manmadha

cool post. adentokani, kamentlu kuda bavunnai.

పానీపూరి123

అదేంటో గాని మీరు నిజాలు భలే సెబుతారే :-P

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008