ఇరానీ చాయ్ - ఉస్మానియా బిస్కట్ హోజాయ్ !! ..
" ఆదాబ్. 1/2 చాయ్ అవుర్ ఉస్మానియా బిస్కూట్ లారే "
ఈ మాట హైదరాబాద్ పాతబస్తీలోని దాదాపు ప్రతీ కేఫ్ లోనూ వినపడుతుంది. ఇక్కడికొచ్చే వారు బిస్కట్లు తిని, టీ తాగడానికి మాత్రమే రారు. దానిని చుక్క చుక్కను ఆస్వాదిస్తూ, మధ్యలో గుండ్రటి ,మెత్తటి బిస్కట్లు లేదా చిట్టి చిట్టి సమోసాలు తింటూ, ప్రపంచం లోని ముఖ్య విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుంటారు. మిత్రులు కలిసి "హో జాయ్! ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కూట్ కే సాత్ " అని కేఫ్ లో సెటిల్ ఐపోతారు. ఇక వాళ్లకు లోకమే తెలియదు. ఎన్నో ముచ్చట్లు, కష్టాలు, చర్చలు... ఇలా ... ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కూట్ మజాయే వేరు. అది ఎంత ప్రయత్నించినా వేరే చోట దొరకదు. ఇంట్లో చేసుకోలేము. చిక్కటి చాయ్ చుక్క చుక్క చప్పరిస్తూ తాగుతూ, దాని రుచిని కూడా ఆస్వాదిస్తారు. అందుకే హైదరాబాదీ బిర్యాని తిన్నాక ఒక ఇరానీ చాయ్ పడనిదే తృప్తి ఉండదు అసలైన భోజనప్రియులకు. ఇక ఉస్మానియా బిస్కట్లు .. కాసేపు తీయగా, కాసేపు ఉప్పగా వెరసి గమ్మత్తుగా ఉంటుంది వీటి రుచి. కొంచం కొంచం కొరికి చప్పరిస్తూ, టీలో ముంచుకుని నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది. అదో బ్రహ్మాండమైన రుచి. ఒకదానికొకటి జంటల ఉండాల్సిందే. పొద్దున్నే లేదా సాయంత్రం ఇరానీ చాయ్, నాలుగు ఉస్మానియా బిస్కట్లు లాగిస్తే ఎంతో శక్తి వచ్చినట్టు ఉంటుంది బద్ధకాన్ని వదిలిస్తుంది అని ఆ చాయ్ ప్రియుల నమ్మకం.
మీకు ఈ రుచి తెలుసా???
(నేనైతే ఈ ఉస్మానియా బిస్కట్లు కొనుక్కుని ఎవరికీ ఇవ్వకుండా దాచుకుని తింటాను :) . వీటి ముందు ఎంత పెద్ద బేకరీ నుండి తెచ్చిన బిస్కట్లు వేస్ట్ అని నా అభిప్రాయం..)
ఇంత అభిమానం పొందిన చాయ్ ధర ఐదు రూపాయలు . బిస్కట్లు మాత్రం రూపాయే.. వీటికి తోడూ మరొకటుంది. చిట్టి సమోసాలు. అది కూడా రూపాయే..
ఒకసారి ట్రై చేయండి మరి.. నా మాట ఒప్పుకుంటారు..
4 వ్యాఖ్యలు:
ఈ మధ్య ఇరానీ టీ చాలామంది తాగటంలేదు. అందులో ఏదో పొడి కలుపుతున్నారని తెలిసింది. చిక్కదనం కోసం ఏవో కలుపుతున్నారు. ఎందుకో తాగలేకపోతున్నాము. ఆంధ్ర టీ, కాఫీ లు ఇవ్వాళ రేపు బాగానే దొరుకు తున్నాయి. It is better to avoid irani tea. osmania biscuits కూడా ఒక్కోసారి మెత్తబడిపోతుంటాయి. పాత స్టాకు తినటం అంత మంచిది కాదు. good day /nice బిస్కెట్లు నయం. irani tea culture is not suitable for us. జ్యోతి అక్కయ్య గారు మీరు ఏమంటారు?
జ్యోతిగారితో నేను సై అంటాను....
కానీ చిన్ని తేడా.... సమోసాలు ఎవ్వరికి ఇవ్వకుండా నేనే తినేసి,
ఏదో మరీ బాగుండదని రెండు బిస్కట్లు ఇస్తానులెండి!!!
I guess your some 20yr. old living in dreams.
ఇక ఉస్మానియా బిస్కట్లు .. కాసేపు తీయగా, కాసేపు ఉప్పగా వెరసి గమ్మత్తుగా ఉంటుంది వీటి రుచి. కొంచం కొంచం కొరికి చప్పరిస్తూ, టీలో ముంచుకుని నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది.
nijame jhothi gaaru
Post a Comment