Friday, 27 February 2009

ఏమి సేతురా ???




పొద్దున్నే వేడినీళ్లు కడుపులో పడనిదే
మన బండి ముందుకు కదలనంటుంది
పాలు కొందామంటే పాతికి రూపాయలు లీటరంట
పాలుపోక బండి మీద మూడురూపాయల టీకానిచ్చా..


ఏమి సేతురా


పేపర్ తీసి చదువుదామంటే
ఏటుచూసినా పనికిరాని కబుర్లే
వాడిని వీడు తిట్ట, వీడిని వాడు తిట్ట
మధ్యలో ఎక్కడో మంచి వార్తలు వెతుక్కున్నా...


ఏమి సేతురా


ఈనాడు చదువుదామంటే సాక్షిని తిట్టే
జ్యోతి చూద్దామంటే సాక్షిని తిట్టే
సాక్షిని చూద్దామంటే వీళ్లిద్దరిని తిట్టే
ఎవరిని తిట్టని పేపరేదైనా ఉందా...


ఏమి సేతురా


పోనీ వార్తలు చూద్దామంటే అదో అయోమయం గోల
నాయకులు తిట్టుకున్నా, కొట్టుకున్నా అన్ని చానెల్స్‌లో అదే లీల
ఎక్కడైనా సంచలనం జరిగితే పది చానెల్స్ తిప్పినా అదే హేల
ఏ గోలా లేక హాయిగా చూసే న్యూస్ చానెల్ ఉందా???



ఏమి సేతురా



టీవీ చూద్దామంటే బుర్ర వాచిపోయే సీరియళ్లు
సినిమా కెళదామంటే అయోమయం కథలు
గుడికైనా వెళదామంటే అక్కడా లంచాల బాగోతం
ఎక్కడ చూసినా డబ్బు, అధికారందే రాజ్యం.


ఏమి సేతురా

6 వ్యాఖ్యలు:

సుభద్ర

nijame nandi......yemi cheyalanteeee

bagaa alochimchi manchi chaduvu kunnavallani
vote vesi gelipidam,parties ki atitam gaaa,
chudam yemi jarugu tundooo.
manchi ni matramee korukundam.

కొత్త పాళీ

పేపర్లు టీవీలో వార్తలు చూడ్డం మానెయ్యండి :)

జ్యోతి

కొత్తపాళీగారు,
నేను టివి చూడ్డం మానేసి చాలా కాలమైంది. ఎప్పుడైనా మావారు చూస్తుంటే అలా లుక్కేస్తాను.ఒక్కోరి డైలాగులు, ఆరోపణలు వింటుంటే నాకేమో కోపం వచ్చి తిట్టాలనిపిస్తుంది,మావారేమో అవి వింటూ నవ్వుతుంటారు.వినేవాళ్లు వెదవలైతే ఎన్నైనా చెప్తారు అని..
ఇక ఈ ఎన్నికలు ఐపోయేవరకు తెలుగుపేపర్ మానేద్దామనుకుంటున్నా.. అదే డబ్బులతో మంచి పుస్తకం కొనుక్కోవచ్చు కదా ...

krishna rao jallipalli

నిజం చెప్పారు. కొన్ని విషయాల్లో మనము ఏమి.. ఏమి చేయలేము. ఏమి సేతురా రామా అని పాడుకోవడం తప్పించి. సినిమా చూసినట్లన్నమాట. సినిమా మనకి నచ్చలేదు అనుకోండి... ఏమి చేయగలం.. బయటకి వస్తాము. అదికాకపోతే తెరనీ చించెస్తాము, కుర్చిలను విరగ్గోడతాము . అంతే కాని ఆ నటినటులను, దర్శకుడను, నిర్మాతని ఏమి చేయలేము కదా. అంతే ఇరగ దీయ లేము కదా.. అదే కనుక ప్రత్యక్షంగా చూసే ఒక నాటకం గాని, వేరే ఏ ప్రోగ్రాము అనుకోండి... స్టేజి మీదనుండి లాగి నాలుగు పీక వొచ్చు. కొన్ని విషయాల్లో కొన్ని వెసులుబాటులు ఉండవు.. కొన్ని దొరకవు.
అలాగే బ్లాగుల విషయంలో కాని, పత్రికల విషయంలో కాని.. బహిష్కరణ ఒక్కటే మార్గం (మీరు అన్నారు చూసారూ ...ఇక ఈ ఎన్నికలు ఐపోయేవరకు తెలుగుపేపర్ మానేద్దామనుకుంటున్నా) అదన్నమాట మనం చేయకలిగింది.

బుజ్జి

"ఇక ఈ ఎన్నికలు ఐపోయేవరకు తెలుగుపేపర్ మానేద్దామనుకుంటున్నా.. అదే డబ్బులతో మంచి పుస్తకం కొనుక్కోవచ్చు కదా ..." adenti asalu ee time lo entha comedy untundo telsa meeku news papers lo? monna sivaratri roju eenadu lo YSR prakatan choodandi kaavalntea..

గీతాచార్య

ఏమి సేతురా...

తెలీదాండీ? రామసేతు. :-D

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008