ప్రథమ వార్షికోత్సవం ....
గత సంవత్సరం ఇదే సమయంలో బ్లాగులనుండి సొంత డొమైన్ కి మారింది షడ్రుచులు.
షడ్రుచులు బ్లాగులో ఎక్కువగా సేకరణలు ఉన్నా ఈ సైట్ లో మాత్రం అన్నీ నా సొంత వంటకాలు, చిత్రాలే. ఈ సైట్ వల్ల మరింతమంది మిత్రులు లభించారు. వందలకొద్దీ వంటల బ్లాగులు పరిచయమయ్యాయి. అలాగే వంటల బ్లాగులకోసం ఉన్న ఆగ్రిగేటర్లు, వంటల పోటీలు ఇలా ఒక తెలియని మరోప్రపంచంలోకి ప్రవేశించడం జరిగింది. నా సైట్ లో ఉన్న బ్లాగుల్లో నేను ఎక్కువగా చాలా తక్కువ దినుసులు, తక్కువ సమయంలో చేసుకోగలిగే వంటకాలే ఇవ్వడం జరిగింది. వంట వచ్చినవారికి ఇవన్నీ విసుగ్గా ఉండొచ్చు కాని అస్సలు వంట రాని , వంట నేర్చుకోవడం మొదలుపెట్టినవారికి అవి చాలా ఉపయోగపడతాయి. మా అబ్బాయి ఆఫీసునుండి వచ్చిన స్పందన నేను సరియైన పనే చేసానని నిరూపించింది.
అలాగే అప్పుడప్పుడు ఒకే రకమైన వంటకాలతో ఉత్సవాలు కూడా నిర్వహించాను. టమాటో ఉత్సవాలు, వంకాయ వసంతోత్సవాలు, పులిహోర ఉత్సవాలు మొదలైనవి. బ్లాగు కోసమైనా కూడా కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరిగింది. ఈ సంవత్సరం కూడా ఎంతో వేగంగా గడిచిపోయింది అనిపిస్తుంది. ముందు ముందు చాట్, చైనీస్, మాక్ టేల్స్ లాంటివి చేయాలనుకుంటున్నా. ఈ సైట్ నాకో గుర్తింపుగా మారింది. దీనివల్ల పత్రికల్లో వంటల వ్యాసాలు, టీవీ షో ల చాన్స్ వచ్చింది .. ఈ సైట్లోని రెండు బ్లాగులు మరింత అందంగా చేయాలని నా ప్రయత్నం. ఇక దీనివల్ల ప్రకటనలు అవి వస్తాయేమో చూడాలి..
నా అభివృద్ధికి అన్నివిధాలా ప్రోత్సహించిన, విలువైన సలహాలు ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
షడ్రుచులు
Shadruchulu
16 వ్యాఖ్యలు:
జ్యోతి గారూ !
మీ షడ్రుచులకు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాకందరికీ ఏ కొత్త రుచులు చూపిస్తున్నారు ?
abhinandanalu .
Congratulations Jo. Keep up the good job and god bless us all. :)
రావుగారు, మాలగారు ధన్యవాదాలండి.
Andy,, how come you comment in my telugu blog. Do you know what did i write. Chek my english blog for details..http://shadruchulu.com/english.. But Thanks a lot dear..
congrats! keep cooking! :-)
The show must continue without any breaks
ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు జ్యోతిగారూ!
congrats congrats!
షడ్రుచులకు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు జ్యోతిగారూ!
అభినందనలు, శుభాకాంక్షలు.
మనిషి తృప్తినిచ్చేది ప్రపంచంలో అన్నం మాత్రమే. నిలువెత్తు ధనం ఇచ్చినా ఇంకా కవాలనే అంటాడు. అదే కడుపు నిండా భోజనం పెట్టి ఇక చాలు అనిపించవచ్చు. అలాంటి షడ్రుచులతో అంధ్రావని కి విందు చేస్తున్నరు.శుభాభినందనలు.
Congrats!!.. :)
ika meeda amma vanta nerchukomante..emi avsaram ledu.time vachinappudu shadruchulu chustale ani cheppestaa :D
Congratulations....
Keep posting more and more...:)
All the best....
జ్యోతి గారూ !
మీ షడ్రుచులకు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
అభినందనలు, శుభాకాంక్షలు
చాలా మంచిదండీ, అభినందనలు మీ బ్లాగ్ వల్లరికి గాను మరో వీరతాడు.. మీ వంటల, వంటకాల మాయాబజారులో బీపీ, షుగర్ మనుషులకు కాస్త పెద్ద పీట వేస్తే బాగుంటుందేమో. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపడుతున్నది ఇవే కదా..
మరోసారి అభినందనలు.
దాసరి సుబ్రహ్మణ్యం గారిపై రచన మే నెల ప్రత్యేక సంచిక మీ దృష్టికి వచ్చిందా. లేదంటే చెప్పండి మీకు ఓ కాపీ పంపించే ఏర్పాట్లు చేస్తాను. ప్రతి చందమామ అభిమాని వద్దా ఉండవలసిన మంచి పుస్తకం ఇది. అందకుంటే త్వరగా తెలియజేయండి.
Post a Comment